• facebook
  • whatsapp
  • telegram

Gvt Junior College: పాఠాలు.. సర్దు‘పాట్లు’!

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఓ తరగతి గది ఇది. ఇక్కడ చాలినన్ని గదులు లేకపోవడంతో ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. వృత్తివిద్య కోర్సు ఎంపీహెచ్‌డబ్ల్యూ చదువుతున్న విద్యార్థినులు ప్రథమ సంవత్సరంలో 56 మంది, ద్వితీయ సంవత్సరంలో 64 మంది ఉన్నారు. ఇటువైపు తిరిగి కూర్చున్నది మొదటి సంవత్సరం వారు కాగా.. అటువైపు కూర్చున్నది ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు. నల్ల బోర్డు ఒకటే ఉంది. బోర్డు సాయంతో పాఠం ఎవరికి చెప్పాల్సివస్తే వారు అటు వైపు కూర్చుంటారు. మిగతావారు వెనకకు కూర్చుని పాఠాలు వినడం, రాయడం చేస్తుంటారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.