వరుసగా 3 సార్లు న్యాక్ ‘ఎ’ గ్రేడ్ ఉంటే డీమ్డ్ వర్సిటీకి అనుమతి
నిబంధనల సవరణ ముసాయిదా నివేదిక విడుదల
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డీమ్డ్ విశ్వవిద్యాలయాలు సైతం సీట్ల భర్తీలో, ఉద్యోగ నియామకాల్లో సామాజిక రిజర్వేషన్ పాటించాలి. ఈ మేరకు యూజీసీ శుక్రవారం డీమ్డ్ వర్సిటీ నియమ నిబంధనల ముసాయిదాలో స్పష్టంచేసింది. యూజీసీ 2019 ఫిబ్రవరి 20న డీమ్డ్ వర్సిటీలకు సంబంధించి గెజిట్ను విడుదల చేసింది. అందులో పలు సవరణలు చేస్తూ ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలను ఈనెల 18లోపు తమకు పంపాలని కోరింది. వరుసగా మూడు సార్లు న్యాక్ ‘ఎ’ గుర్తింపు పొందిన కళాశాలలు, మూడో వంతు బ్రాంచీలకు వరుసగా మూడుసార్లు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ), కేంద్ర ప్రభుత్వ ర్యాంకింగ్లో ప్రత్యేక కేటగిరీలో 50లోపు ఉన్నా లేదా ఓవరాల్ ర్యాంకింగ్లో 100లోపు చోటు దక్కించుకున్నా ఆ కళాశాలలు డీమ్డ్ వర్సిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అవి ఆన్లైన్/దూర విద్య కోర్సులను అందించవచ్చు. యూజీసీ నిబంధనలను పాటించడం లేదని తనిఖీల్లో గుర్తిస్తే జరిమానా విధించనున్నారు. ఇప్పటివరకు ఆఫ్ క్యాంపస్లకు కేంద్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చేది. ఇక నుంచి యూజీసీనే ఇవ్వనుంది. విదేశాల్లోనూ ప్రాంగణాలు పెట్టుకోవచ్చు. నిధులకు సంబంధించి ఆయా ఖాతాలను స్పాన్సర్, ఇతర సంస్థల పేరిట కాక డీమ్డ్ వర్సిటీ పేరిటే నిర్వహించాలి. ఈ నిధులను స్పాన్సరింగ్ ట్రస్టులకు, ఇతర సంస్థలకు బదిలీ చేయరాదు. దీనిపై యూజీసీ ఛైర్మన్ జగదీశ్కుమార్ మాట్లాడుతూ విద్యానాణ్యత, పారదర్శకత పెంచేలా, నూతన జాతీయ విద్యా విధానం స్ఫూర్తి ఆధారంగా నిబంధనల్లో మార్పులు చేశామన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ
‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు
‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.