ప్రతి నెలా తొలి పనిదినం రోజున టీచర్లు త్వరగా విధుల్లోకి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సుస్థిర నమోదు కార్యక్రమం(సస్టైనింగ్ ఎన్రోల్మెంట్ డ్రైవ్) పేరిట ప్రతినెలా మొదటి పని దినం రోజున ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో సగం మంది ఉదయం త్వరగా విధులకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉపాధ్యాయులు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు తరచూ, దీర్ఘకాలికంగా తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కారణాలు తెలుసుకోవాలన్నారు. అర్ధంతరంగా చదువు మానేసిన వారి పిల్లల్ని మళ్లీ బడుల్లో చేర్పించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఆయా డీఈవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.