ఈనాడు, అమరావతి: డీఎస్సీ 1998, 2008 నిరుద్యోగ ఉత్తీర్ణ ఉపాధ్యాయులను కనీస వేతనం కింద ఎలా పరిగణించారో.. అలాగే డీఎస్సీ 1996 క్వాలిఫైడ్ నిరుద్యోగ ఉపాధ్యాయులనూ తీసుకునే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ నవంబరు 17న ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. తమను కనీస వేతనం కింద తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 1996 డీఎస్సీ ఉత్తీర్ణ నిరుద్యోగ ఉపాధ్యాయులు 76 మంది హైకోర్టును ఆశ్రయించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.