• facebook
  • whatsapp
  • telegram

Civil Assistant Surgeons: వైద్యులకు నచ్చిన చోట పోస్టింగ్‌

* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాల్లో నూతన విధానం

ఈనాడు, హైదరాబాద్‌: గతంలో వైద్యుల నియామకాల్లో అనుసరించిన విధానాల వల్ల పలు సమస్యలు వచ్చినందున.. ఈ దఫా సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. నాలుగేళ్ల కిందట వైద్య విధానపరిషత్‌ పరిధిలో అభ్యర్థుల ప్రాధాన్యాలను పట్టించుకోకుండా.. ఇష్టానుసారం పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఎక్కువ మంది వైద్యులు విధుల్లో చేరలేదు. దీంతో ఈసారి ఎంబీబీఎస్‌ అర్హతతో నియమితులయ్యే వైద్యులకు వారికి నచ్చినచోట పోస్టింగ్‌ ఇవ్వాలని నిర్ణయానికొచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 211 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ తుది దశకు చేరుకోవడంతో వాటిపై తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 969 పోస్టులకు చెందిన తుది జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ప్రభుత్వానికి మూణ్నాలుగు రోజుల్లో అందజేయనుంది. రిజర్వేషన్లు, నియామక నిబంధనలు, అనుభవం, వెయిటేజీ తదితరాలను అనుసరించి బోర్డు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో సుమారు 70 శాతానికి పైగా ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న వైద్యులే ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరికి 20 మార్కులను వెయిటేజీగా ఇవ్వడంతో.. నేరుగా దరఖాస్తు చేసుకున్న వారి కంటే ఎక్కువ మార్కులు సాధించి వీరు ముందు వరుసలో నిలిచినట్లు సమాచారం.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం!

‣ ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

‣ స్టైల్‌ స్టైల్‌గా...

‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.