* 2,876 పోస్టుల్లో 2,301 వారికే
* లెక్చరర్, ఇతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
* డెమో తరగతులకు 25 మార్కులు
* సమగ్ర ప్రకటన విడుదల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ ఏప్రిల్ 17 నుంచి ప్రారంభమైంది. జూనియర్ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది. మొత్తం 2,876 పోస్టుల భర్తీకి వెలువరించిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికి దఖలుపడ్డాయి. అలానే జనరల్ కింద పేర్కొన్న మిగిలిన పోస్టులకు పురుషులతో పాటు మహిళలూ పోటీపడవచ్చు. గురుకులాల నిబంధనల మేరకు మహిళా విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళలే అర్హులు కావడంతో వారికి అదనపు ప్రయోజనం లభిస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ మహిళలవే కావడం గమనార్హం. ఈ విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక రోస్టర్‌ను అమలు చేయనున్నారు.
పరీక్షల షెడ్యూలును త్వరలో వెబ్‌సైట్లో పొందుపరుస్తామని గురుకుల బోర్డు వెల్లడించింది. పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో లేదా కంప్యూటర్ ఆధారితంగా (సీబీఆర్‌టీ) ఆన్‌లైన్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని సూచించింది.
ముఖ్యాంశాలు..
* జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు పేపర్-1 అందరికీ ఒకటే(కామన్) ఉంటుందని, ఈ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని బోర్డు తెలిపింది. పేపర్-2, 3 ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి.
* ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు పొందాలని భావిస్తున్న అభ్యర్థులు 2023 జనవరి 1 తరువాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని గురుకుల బోర్డు తెలిపింది.
* గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్టులకు డెమో మార్కుల విధానాన్ని బోర్డు యథాతథంగా కొనసాగిస్తోంది. వీటికి 25 మార్కులు ఉంటాయని తెలిపింది.
పరీక్ష ఫీజు రూ.1,200
* ఈ పోస్టులకు పరీక్ష ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.1,200, రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ.600గా బోర్డు నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన రిజర్వుడు అభ్యర్థులకు ఫీజు రాయితీ లేదు. పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
* దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే helpdesk-treirb@telangana.gov.in కు, ఇతర సందేహాలకు treirbhelpline@gmail.com ఈ-మెయిల్ చేయాలని సూచించింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23317140 నంబరులో సంప్రదించవచ్చని తెలిపింది.
* పరీక్షలో సమాధానాలు గుర్తించేప్పుడు ఓఎంఆర్ షీట్లో డబుల్ బబ్లింగ్ చేసినా, వైట్‌నర్ తదితరాలు వినియోగించి షీటును ట్యాంపర్ చేసినా ఆ సమాధాన పత్రాలు చెల్లుబాటుకానివిగా గుర్తిస్తామని స్పష్టం చేసింది.
జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్ష విధానం..
అర్హత: పీజీ సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పాటు బీఈడీ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు అవసరం.
పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల భాష ప్రావీణ్యం- 100 మార్కులు
పేపర్-2: సంబంధిత సబ్జెక్టులో బోధన పద్ధతులు- 100 మార్కులు
పేపర్-3: సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం (పీజీస్థాయి)- 100 మార్కులు
డెమో: 25 మార్కులు (మొత్తం మార్కులు 325)
లైబ్రేరియన్లు (జూనియర్ కళాశాలలు)
అర్హత: డిగ్రీతో పాటు లైబ్రరీసైన్స్‌లో 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
పేపర్-1: కామన్. డెమో: 25 మార్కులు
పేపర్-2: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్- 100 మార్కులు
డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్ష విధానం..
అర్హత: పీజీలో 55 శాతం మార్కులతో పాటు యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించే స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5% మార్కులు, 1991కు ముందు పీహెచ్‌డీ పట్టా పొందిన వారికి పీజీలో 5% మార్కుల సడలింపు ఉంటుంది.
పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీఎస్, ఆంగ్లభాషా ప్రావీణ్యం - 100 మార్కులు
పేపర్-2: సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం (పీజీస్థాయి) - 100 మార్కులు
డెమో: 25 మార్కులు
మొత్తం మార్కులు: 225
ఫిజికల్ డైరెక్టర్లు (డిగ్రీ కళాశాలలు)
అర్హత: ఫిజికల్ ఎడ్యుకేషన్ పీజీలో 55 శాతం మార్కులతో పాటు యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించే స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి. ఎవరైనా పీహెచ్‌డీ చేసి ఉంటే వారికి యూజీసీ నెట్, రాష్ట్రాల సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5% మార్కులు, 1991కు ముందు పీహెచ్‌డీ పొందిన వారికి పీజీలో 5% మార్కుల సడలింపు లభిస్తుంది.
పేపర్-1: కామన్ (100 మార్కులు)
పేపర్-2: సంబంధిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం (పీజీస్థాయి)- 100 మార్కులు
డెమో: 25 మార్కులు
మొత్తం మార్కులు: 225

లైబ్రేరియన్లు (డిగ్రీ కళాశాలలు)
అర్హత: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పీజీలో 55 శాతం మార్కులతో పాటు యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించే స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ చేసిన వారికి యూజీసీ నెట్, రాష్ట్రాల సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5% మార్కులు, 1991కు ముందు పీహెచ్‌డీ పట్టా పొందిన వారికి పీజీలో 5% మార్కుల సడలింపు లభిస్తుంది.
పేపర్-1: కామన్ (100 మార్కులు)
పేపర్-2: సంబంధిత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం (పీజీస్థాయి)- 100 మార్కులు
డెమో: 25 మార్కులు
మొత్తం మార్కులు: 225
ఫిజికల్ డైరెక్టర్లు (జూనియర్ కళాశాలలు)
అర్హత: ఎన్‌సీఈటీ నిబంధనలకు లోబడి బీపీఈడీ అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు ఉంటుంది.
పేపర్-1: కామన్.
డెమో: 25 మార్కులు
పేపర్-2: ఫిజికల్ ఎడ్యుకేషన్- 100 మార్కులు
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎనిమిదో తరగతి మోడల్ పేపర్లు - 2023
‣ తొమ్మిదో తరగతి మోడల్ పేపర్లు - 2023
‣ తెలంగాణ గురుకులాల్లో 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 92 క్రాఫ్ట్ టీచర్, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 134 ఆర్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్(స్కూల్స్) పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టులు
‣ తెలంగాణ గురుకులాల్లో 4,020 టీజీటీ పోస్టులు
‣ విదేశాలు.. విద్యావకాశాల నెలవులు
‣ షుగర్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు
‣ ఉద్యోగార్థులూ.. పారా హుషార్!
‣ సీడాట్‌లో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.