• facebook
  • whatsapp
  • telegram

NMC: ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాల గుర్తింపుపై ఎన్‌ఎంసీకి సుప్రీం నోటీసులు

ఈనాడు, దిల్లీ: సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడిలోని ఎంఎన్‌ఆర్‌ వైద్యకళాశాలకు గుర్తింపు ఇవ్వకపోవడంపై జాతీయ వైద్యమండలి(ఎన్‌ఎంసీ), కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కళాశాలకు గుర్తింపు ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పీజీ విద్యార్థులు సింహాద్రి రవిశంకర్‌ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ రవీంద్రభట్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ భట్నాగర్‌, న్యాయవాది తన్వీ దూబే వాదనలు వినిపించారు. ఎంఎన్‌ఆర్‌ కళాశాలల్లో 2021-22 సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సులకు గుర్తింపును పునరుద్ధరించాలంటూ 2022, నవంబరు 28న హైకోర్టు ఆదేశాలిచ్చినా ఎన్‌ఎంసీ పట్టించుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఎంసీ తీరుతో పీజీ వైద్య విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల అనంతరం కళాశాలకు గుర్తింపు ఇస్తామంటూ మౌఖికంగా హామీ ఇచ్చిన ఎన్‌ఎంసీ దానికి కట్టుబడలేదన్నారు. ఎన్‌ఎంసీ చట్టం 2019 ప్రకారం ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాల గుర్తింపు పునరుద్ధరించేలా ఎన్‌ఎంసీని ఆదేశించాలన్నారు. 2021-22లో ఎంఎన్‌ఆర్‌ పీజీ కళాశాలలో చేరిన వారిని ఇతర వైద్య కళాశాలలకు కేటాయించాలని కోరారు. వాదనల అనంతరం ఈ విషయమై స్పందించాలంటూ ఎన్‌ఎంసీ, కేంద్ర ప్రభుత్వానికి.. ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మే 12కి వాయిదా వేసింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.