ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం గౌరవ సలహాదారుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 1,062 గురుకులాల ప్రిన్సిపాళ్లు కలసి మే 7న ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వినోద్‌కుమార్ నివాసంలో సమావేశమై మాట్లాడారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే ఏకైక లక్ష్యంగా ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘కేజీ టు పీజీ’ నాణ్యమైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని నెరవేరుస్తామని ప్రకటించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.