బార్ కౌన్సిళ్లకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి నమోదు కోసం రూ.600కు మించి వసూలు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అడ్వొకేట్స్ యాక్ట్ ప్రకారం ఎన్‌రోల్‌మెంట్ ఫీజు రూ.600 మాత్రమే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహల ధర్మాసనం పేర్కొంది. దీంతో కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్న న్యాయ శాస్త్ర విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. నమోదు ఫీజు రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు? ఏటా ఎంత మొత్తం వసూలవుతోందో తెలపాలంటూ ధర్మాసనం అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు నోటీసు జారీ చేసింది. బార్ కౌన్సిళ్లు భారీ మొత్తంలో నమోదు ఫీజులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్‌పై మే 12న ధర్మాసనం విచారణ చేపట్టింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ మనన్ కుమార్ మిశ్రా వాదనలు వినిపిస్తూ.. 1993లో నమోదు ఫీజును రూ.600గా నిర్ణయించారని, ఆ తర్వాత ధరలు ఎన్నో రెట్లు పెరిగాయని తెలిపారు. దీన్ని ధర్మాసనం అంగీకరించలేదు. న్యాయవాద వృత్తి సేవకు సంబంధించినది, ఫీజులు భారీగా పెంచడం వల్ల పేద కుటుంబాల నుంచి వచ్చే న్యాయశాస్త్ర విద్యార్థులకు భారం అవుతుందని పేర్కొంది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.