మానుకోట, న్యూస్‌టుడే: జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్) పథకం ద్వారా 2022-23 విద్యాసంవత్సరంలో నిర్వహించిన పరీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 263 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. విద్యలో ప్రతిభను చూపే నిరుపేద విద్యార్థులు తమ చదువును ఆటంకం లేకుండా కొనసాగించేలా ఆర్థిక చేయూతను ఇవ్వాలనే ప్రధాన ఆశయంతో ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, స్థానిక సంస్థల విద్యార్థులు, రెసిడెన్షియల్ వసతి లేని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో ఆయా విద్యాసంవత్సరాల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు ఉపకారవేతనం అందుతుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.