ఈనాడు, హైదరాబాద్: టీఎస్-ఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 96.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం శనివారం(మే 20) నిర్వహించిన ఈ పరీక్షకు 23,261 మంది దరఖాస్తు చేసుకోగా.. 22,452 మంది హాజరయ్యారని సెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.
డీఈఈసెట్ దరఖాస్తు పొడిగింపు
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న డీఈఈసెట్-2023 దరఖాస్తు గడువును మే 24 వరకు వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.