దిల్లీ: ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన దాతృత్వ విభాగం రిలయన్స్ ఫౌండేషన్ 2022-23 సంవత్సరానికి గాను 5వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేయనుంది. దీనికి గాను దేశంలోని 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న తొలి ఏడాది విద్యార్థులు 5 వేల మందిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ.2లక్షల వరకు నిధులను అందజేయడంతో పాటు పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లో భాగస్వాములను చేయనుంది. ఉపకారవేతనాల మంజూరీలో బాలికలు, బాలురకు సమ ప్రాతినిధ్యం ఉంటుందని రిలయన్స్ ఫౌండేషన్ సీఈఓ జగన్నాథ్ కుమార్ స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.