* కొత్త వైద్య కళాశాలలపై సీఎంకు వివరించిన అధికారులు
ఈనాడు, అమరావతి: ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన అయిదు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి స్పందన కనిపిస్తోందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరును సీఎం ఆగస్టు 24న సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ‘ప్రైవేటు వైద్యకళాశాలల్లో కంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, పాడేరు, ఆదోని, మర్కాపురం, మదనపల్లెలోని కొత్త వైద్య కళాశాలల్లోనూ ప్రవేశాలు జరుగుతాయి. 2025-26లో మిగిలిన కళాశాలల నిర్మాణాలు పూర్తవుతాయి. 2025-26 విద్యా సంవత్సరంలో మిగిలిన వైద్యకళాశాలలూ ప్రవేశాలకు సిద్ధమవుతాయి’ అని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వర్చువల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?
‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు
‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్ ఆఫీసర్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.