* 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తిగా మారింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య ఎల్.పాండురంగారెడ్డి సెప్టెంబరు 15న విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5వ తేదీ నుంచి ప్రారంభం..15వ తేదీని తుది గడువుగా నిర్ణయించగా...తాజాగా ఆ గడువును సెప్టెంబరు 22వ తేదీ వరకు పొడిగించారు. మహాత్మాగాంధీ, కాకతీయ వర్సిటీల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది. సెప్టెంబరు 15 వరకు మొత్తం 30 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.
ఇదీ కాలపట్టిక...
* సెప్టెంబరు 22 వరకు: రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన
* 23 నుంచి 26వ తేదీ వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు
* 29వ తేదీ: తొలి విడత సీట్ల కేటాయింపు
* అక్టోబరు 4 వరకు: సీట్లు పొందిన వారు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి
* అక్టోబరు 6 నుంచి: రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రారంభం
మరింత సమాచారం... మీ కోసం!
‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్లు
‣ ‘పవర్ బీఐ’తో బెస్ట్ కెరియర్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.