• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 02-05-2024 లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌   

1.  భారత అమ్మాయిలదే టీ20 సిరీస్‌!

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భారత అమ్మాయిలు సత్తాచాటుతున్నారు. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నారు. మూడో టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుచేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



2.  కాంగోలో కొత్తరకం ఎంపాక్స్‌ 

దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్‌ విజృంభణను కట్టడి చేయడానికి కాంగో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మహమ్మారికి సంబంధించిన ఒక కొత్త రకం వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాపించగలదని తేల్చారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3.  ఏపీలో ఓటర్లు 4,14,01,887

ఏపీలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. 2024 జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. దాంతో పోలిస్తే ప్రస్తుత జాబితాలో నికరంగా 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

4.  బోయింగ్‌ విమానాల ప్రజావేగు జాషువా మరణం

ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన 737 మ్యాక్స్‌ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్‌ బ్లోయర్‌ (ప్రజావేగు) జాషువా డీన్‌(45) మరణించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా

న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ)లోకి ప్రవేశించారు. ఆందోళనకారుల గుడారాలను తొలగించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.