• facebook
  • whatsapp
  • telegram

Free Coaching: డేటా సైన్స్‌లో ఉచిత శిక్షణ

* ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో అవకాశం
 

ఈనాడు: ఉన్నత చదువులు చదివినా.. సరైన నైపుణ్యాలు లేకుండా ఉద్యోగాలు సాధించడం చాలా కష్టం. అందుకే నాలుగేళ్లు ఇంజినీరింగ్ చేసినా రాని ఉద్యోగం.. 4 నెలల నైపుణ్య శిక్షణ తీసుకుంటే వస్తుంది. కానీ లక్షల రూపాయలు ఖర్చు చేసి అందరూ కోచింగ్‌లు తీసుకోలేరు కదా! అలాంటి యువతను ప్రోత్సహించేందుకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చి వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది హైదరాబాద్‌లోని గ్రోటెక్‌. ఇది రెడ్డీస్‌ ఫౌండేషన్‌లోని అనుబంధ సంస్థ. ఇక్కడ శిక్షణ పొందాలంటే ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, బీఎస్సీ, బీసీఏ పూర్తి చేసి ఉండాలి. 18-28 ఏళ్లలోపు వయస్సు కలిగి విద్యార్థులు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులకు పోటీ పరీక్షల ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది. ఎంపికైన వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. సంబంధిత కోర్సుల్లో శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 8328203807, 8019050334 ను సంప్రదించవచ్చు. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.