• facebook
  • whatsapp
  • telegram

LPU: ఎల్‌పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి RS. 3 కోట్ల ప్యాకేజీ (ADVT)

ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. తాజాగా నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 2023 బ్యాచ్‌ విద్యార్థుల అద్భుతమైన విజయాన్ని సాధించారు. అనేక మంది భారీ వేతనంతో ప్యాకేజీలను పొందారు. లవ్లీలో 2018 తరగతి విద్యార్థి అయిన యాసిర్‌ ఎం. అత్యధిక ప్యాకేజీ సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో రూ.3 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. పవన్‌ కుంచాలా అనే మరో విద్యార్థి సైతం టీసీ సెంట్రల్‌ అనే కంపెనీలో రూ.1 కోటి ప్యాకేజీకి ఎంపికయ్యాడు.

2022-23 బ్యాచ్‌ల నుంచి 1100 మందికి పైగా విద్యార్థులు రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ ప్యాకేజీతో ప్రాంగణ నియామకాల్లో కొలువులు సాధించడం విశేషం. ఎల్‌పీయూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకు ఇది అద్దం పడుతోంది. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన యశస్వి యదువన్షి ఇటీవలే మైక్రోసాఫ్ట్‌లో రూ.52.08 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అత్యధికంగా రూ.54.9 లక్షల సీటీసీ, ఆర్కిటెక్చర్‌ విద్యార్థుల్లో అత్యధికంగా రూ.31.69 లక్షలు, ఎంబీఏ విద్యార్థుల్లో అత్యధికంగా రూ.29.3 లక్షల చొప్పున వార్షిక వేతన ప్యాకేజీలతో కొలువులు సాధించారు. 2023-24 ప్రాంగణ నియామకాల సీజన్‌లో టాప్‌-10 శాతం మంది విద్యార్థులు సగటున రూ.12.3 లక్షల ప్యాకేజీతో కొలువులు సాధించారు. ప్రధాన ఐఐటీల కంటే ఈ సగటు ఎక్కువ. తద్వారా టాలెంట్‌ డెవలప్‌మెంట్‌లో ఎల్‌పీయూ తన కీర్తిని పెంచుకుంటోంది.

ఇదొక్కటే కాదు.. ఎల్‌పీయూ పూర్వ విద్యార్థుల సక్సెస్‌ స్టోరీలు వర్సిటీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఎల్‌పీయూలో గ్రాడ్యుయేట్లుగా బయటకొచ్చిన విద్యార్థులు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రూ.కోటికి పైగా వేతనం అందుకుంటున్నారు. ఎల్‌పీయూకు చెందిన 5,500 మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌, ఐబీఎం, శాంసంగ్‌, హేవలెట్‌ ప్యాకర్డ్‌, హిటాచీ, బార్‌క్లేస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి ఫార్చ్యూన్‌- 500 కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఎల్‌పీయూ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో ఆయా కంపెనీలు పాల్గొనడం ద్వారా వర్సిటీకున్న గుర్తింపును అర్థం చేసుకోవచ్చు.విద్యార్థులు సాధించిన ఘనత ఎల్‌పీయూ వైస్‌ ఛాన్సలర్‌, పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ అశోక్‌ మిత్తల్‌ కొనియాడారు. విద్యార్థుల మేధో, వ్యక్తిత్వ వికాసానికి ఎల్‌పీయూ నిబద్ధతతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అద్భుతమైన ప్యాకేజీలతో తమ కెరీర్‌ను ప్రారంభించాలన్న విద్యార్థుల కలను సాకారం చేయడంలో LPU కెరీర్ సర్వీసెస్ విభాగం, అంకితభావం కలిగిన మార్గదర్శకులు పోషించిన పాత్ర అనిర్వచనీయమని మిత్తల్‌ కొనియాడారు.

ఎల్‌పీయూ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాములు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయని ఎల్‌పీయూ ప్రో ఛాన్సలర్‌ రష్మీ మిత్తల్‌ పేర్కొన్నారు. 2023కు గాను టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇంపాక్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఎల్‌పీయూ దేశంలో రెండో స్థానం సాధించిందని, వరల్డ్స్‌ యూనివర్సిటీస్‌ విత్‌ రియల్ ఇంపాక్ట్‌ (WURI) -2023 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం దక్కించుకుందని తెలిపారు. విద్యార్థుల విజయానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించడంలో భాగంగా విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ ప్రశంసలే తార్కాణమని పేర్కొన్నారు.

ఎల్‌పీయూ విశ్వవిద్యాలయంలో 2024 ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు త్వరలోనే ముగియనుంది. ఎల్‌పీయూలో ప్రవేశాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. LPUNEST 2024 ప్రవేశ పరీక్షలో ప్రతిభతో పాటు కొన్ని ప్రోగ్రామ్‌లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను క్లియర్‌ చేయడంపై అడ్మిషన్లు ఆధారపడి ఉంటాయి. పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి: https://bit.ly/3WcFIqX
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.