• facebook
  • whatsapp
  • telegram

Inter Practicals: పాత పద్ధతిలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. అందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలకు ముందు కళాశాలల వారీగా ల్యాబ్‌లు సిద్ధం చేయాలి. జంతు, వృక్ష, భౌతిక, రసాయన శాస్త్రాల ప్రయోగశాలలు ఇంటర్‌ బోర్డు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పరికరాలు, రసాయనాలు అందుబాటులో ఉంచాలి. పరీక్షల షెడ్యూల్‌ విడుదలయ్యే లోపు ఆ ప్రకియ అంతా పూర్తి చేశారు. ఈ ఏడాది పూర్వపు పద్ధతిలో (నాన్‌ జంబ్లింగ్‌) అన్ని వసతులున్న ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

క్షేత్ర స్థాయిలో  పరిశీలన

జిల్లాలో మొత్తం 247 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అందులో వసతులు ఉన్న ప్రైవేటు కళాశాలలను ప్రిన్సిపళ్ల బృందం ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రైవేటు కళాశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు ఉండి ప్రయోగశాల అనుకూలంగా ఉంటే పరీక్షలు నిర్వహించవచ్చనే ప్రతిపాదన చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రయోగ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు మొత్తం 297 ఉన్నాయి. ఈ ఏడాది 52,193 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు చదువుతున్నారు.

ఇబ్బందులు  తలెత్తకుండా ఏర్పాట్లు: రవికుమార్, ఆర్‌ఐవో

ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. కొవిడ్‌ నేపథ్యంలో పిల్లలకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఉన్న ప్రైవేటు కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు పంపాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.       

కొవిడ్‌ నేపథ్యంలో...

నాలుగేళ్లుగా ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జరుగుతున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పూర్వపు పద్ధతిలో నిర్వహించేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నిర్వహణ కొంత భారం కావడంతో నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్మీడియ‌ట్‌ మోడ‌ల్‌ పేప‌ర్లు

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్మీడియ‌ట్‌ స్టడీమెటీరియల్

‣ మేక్‌మై ట్రిప్‌-పడ్‌తే రహో-బడ్‌తే రహో స్కాలర్‌షిప్‌ 

‣ ఇలా చేస్తే కొలువు మీదే

‣ చేరతారా... భారత నౌకాదళంలో!

‣ దేశార్థికానికి ఊపు తెస్తుందా?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.