• facebook
  • whatsapp
  • telegram

ఫ్లిప్‌కార్ట్‌లో 70,000 ఉద్యోగాలు 

బెంగళూరు: కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో ఉద్యోగాల కొరత తీవ్రమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. తాము భారత్‌లో 70,000 కొత్త ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయంతో  పరోక్షంగా మరో 50వేలకి పైగా ఉద్యోగాలు లభించవచ్చని సంస్థ అంచనా వేసింది.  కొవిడ్‌-19 ప్రభావానికి తోడు రానున్న పండగ సీజన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెజాన్‌ ‘ప్రైమ్‌ డే’కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ ఆన్‌లైన్‌ కొనుగోలు మేళాను ప్రకటించింది. ఈ అతి పెద్ద సేల్‌ అక్టోబర్‌ 17 నుంచి 22 వరకు కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో తాము ప్రత్యక్ష ఉద్యోగాల నియామకమే కాకుండా సరఫరా చివరి దశలో అంటే ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు చేర్చేందుకు మరికొందరిని  భాగస్వాములుగా చేసుకోనున్నామని సంస్థ వెల్లడించింది. ఇందుకుగాను 50,000లకు పైగా కిరాణా షాపులు, చిన్న దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకుంటామని  ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. తాము కల్పించనున్న అవకాశాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, పికింగ్‌, ప్యాకింగ్‌, సార్టింగ్‌ తదితర ఉద్యోగాలు ఉంటాయని సంస్థ వివరించింది. చిన్న దుకాణాలతో చేసుకునే ఒప్పందాల వల్లా మరికొందరికి ఉపాధి దొరుకుతుందని సంస్థ వెల్లడించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.