చర్లపల్లి, న్యూస్టుడే: ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశం కల్పించనున్నామని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) డైరెక్టర్ వి.కిరణ్కుమార్ డిసెంబరు 2న తెలిపారు. ఈ మేరకు ఆయన నోటిఫికేషన్ విడుదల చేశారు. చర్లపల్లిలోని సీపెట్లో మిషన్ ఆపరేటర్ అసిస్టెంట్ ఇంజక్షన్ మౌల్డింగ్లో 3 నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం సదుపాయాలను కల్పిస్తామని వివరించారు. శిక్షణ అనంతరం ఆయా కంపెనీల్లో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఎనిమిది లేదా పదో తరగతి చదివిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 7893586494, 9959333418 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.