• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య విద్యార్థుల థీసీస్‌కు మినహాయింపులు

ఈనాడు, దిల్లీ: కరోనా నేపథ్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యార్థులకు సిద్ధాంత వ్యాసాల (థీసీస్‌) సమర్పణలో మినహాయింపులిస్తూ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) డిసెంబ‌రు 23న‌ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19, 2019-20 విద్యా సంవత్సరాల్లో పీజీ కోర్సుల్లో చేరిన వారికి ఈ మినహాయింపులు వర్తిస్తాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం థియరీ, క్లినికల్‌, ప్రాక్టికల్‌ పరీక్షలకు కనీసం 6 నెలల ముందు విద్యార్థులు థీసీస్‌ సమర్పించాల్సి ఉంటుంది. కరోనాతో కాలపరిమితిని 3 నెలలకు తగ్గించారు. అలాగే స్పెషాలిటీస్‌/సూపర్‌ స్పెషాలిటీస్‌ కోర్సులు చేసే విద్యార్థులు ఒక పోస్టర్‌ ప్రజెంటేషన్‌, జాతీయ, రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌ల్లో ఒక పేపర్‌ చదవడం, ఒక పరిశోధన పత్రాన్ని (రీసెర్చ్‌ పేపర్‌) ప్రచురణ కోసం పంపిస్తేనే పీజీ పరీక్ష హాజరుకు అనుమతించడం వంటి నిబంధనలను 2018-19 బ్యాచ్‌ విద్యార్థులకు కూడా మినహాయిస్తున్నట్లు ఎన్‌ఎంసీ పేర్కొంది.  2018-19, 2019-20 బ్యాచ్‌ విద్యార్థులు సమర్పించిన థీసీస్‌ను పరిశీలించేటప్పుడు అవి నిర్దేశించిన నమూనా పరిమాణం కన్నా తక్కువగా ఉన్నా పరిగణలోకి తీసుకోవాలని విశ్వవిద్యాలయాలు, వైద్యకళాశాలలకు సూచించింది. కొవిడ్‌ వల్ల క్లినికల్‌ మెటీరియల్‌ కొరత ఏర్పడినందున ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.