శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జనవరిలో జరగనున్న బీఈడీ, బీపీఈడీ, బి ఫార్మసీ పరీక్షల కాల పట్టికను డిసెంబరు 30న పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్ విడుదల చేశారు. జనవరి 5 నుంచి 8 వరకు బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష సమయం నిర్ధారించారు. బీపీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు జనవరి 4 నుంచి 7వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతాయి. బీఫార్మసీ నాలుగో సెమిస్టర్ జనవరి 6 నుంచి 21 వరకు, రెండో సెమిస్టర్ జనవరి 5 నుంచి 22వరకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.