• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాద్‌లో పెరుగుతున్న‌‌ ఐటీ నియామకాలు

ఐటీ నియామకాలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాల్లో మెరుగ్గా ఉన్నాయని మాన్‌స్టర్‌ డాట్‌ కామ్‌ పేర్కొంది. కొవిడ్‌ ప్రభావం నుంచి కోలుకోవడమే కాక 2020 జనవరితో పోలిస్తే, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో బెంగళూరులో 3 శాతం, పుణెలో 2 శాతం, హైదరాబాద్‌లో 1 శాతం వృద్ధితో నియామకాలు జరుగుతున్నట్లు తెలిపింది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో నియామకాలు డిసెంబరుతో పోలిస్తే 10 శాతం వరకు పెరిగాయని వివరించింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 6 శాతం, ముంబయిలో 15 శాతం వరకు తగ్గాయని వెల్లడించింది.

విద్య, బీఎఫ్‌ఎస్‌ఐ, స్థిరాస్తి రంగాల్లో వృద్ధి

దేశీయంగా విద్య, స్థిరాస్తి, బీమా రంగాల్లో నియామకాలు పెరుగుతున్నాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ చెబుతోంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఉద్యోగ నియమాకాలు 2020 డిసెంబరు స్థాయిలోనే ఈ ఏడాది జనవరిలోనూ ఉన్నాయని తెలిపింది. వాహన, ఫార్మా వంటి రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదు కావడం ఇందుకు నేపథ్యం. 2021 జనవరిలో మొత్తం 1925 లిస్టింగ్‌లు రాగా.. 2020 డిసెంబరులో 1972గా ఉన్నాయి. 2020 జనవరితో పోల్చితే, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో నియామకాలు 19 శాతం తగ్గాయి.  
* డిసెంబరుతో పోలిస్తే జనవరిలో విద్య, బోధనా రంగాల్లో 11 శాతం; బీమాలో 8% పైగా; స్థిరాస్తిలో 13%, రిటైల్‌ 7%, బీఎఫ్‌ఎస్‌ఐ 5%, బీపీఓ/ఐటీఈఎస్‌ 3% మేర నియామకాలు పెరిగాయి. వాహన/అనుబంధ రంగాల్లో 14%, టెలికాంలో 8% చొప్పున తగ్గాయి.
* 2020 జనవరితో పోలిస్తే ఫార్మా, బయోటెక్‌లో 9%; ఆతిథ్య రంగంలో 61% మేర నియమాకాలు క్షీణించాయి. బీఎఫ్‌ఎస్‌ఐ 29%, బీమా 23% మేర ఉద్యోగాలు తగ్గాయి.
* ప్రారంభ స్థాయి (0-3 ఏళ్ల అనుభవం)లో 26% మేర; 13 ఏళ్లకు పైన అనుభవం ఉన్న వారికి 9% మేర నియామకాలు తగ్గాయి.
* ద్వితీయ శ్రేణి నగరాలైన వడోదరాలో 9%; చండీగఢ్‌లో 8%, జయపురలో 6% చొప్పున వృద్ధి లభిస్తే, మెట్రో నగరాల్లో నియామకాలు తగ్గాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.