• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొత్త టెక్నాలజీలపై ఆన్‌లైన్‌ బూట్‌ క్యాంప్‌!

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రకారం- 2022 నాటికి 4.0 టెక్నాలజీల్లో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఉపయోగించే 21వ శతాబ్దపు టెక్నాలజీలైన ఐఓటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ మొదలైనవే 4.0 టెక్నాలజీలు! 

మనం యూట్యూబ్‌లో సైన్స్‌ వీడియో చూస్తే, మనకి సజెషన్స్‌లో అటువంటి వీడియోలనే చూపిస్తారు. అలాగే అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ఫోన్‌ కొనడానికి బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు కింద ఫోన్‌ కవర్, ఫోన్‌ ఇన్సూరెన్స్‌ లాంటి సజెషన్స్‌ రావడం మనం తరచూ చూస్తుంటాం. ఇవన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అప్లికేషన్లు. తమ బ్రాంచి, నేపథ్యంతో ఎటువంటి సంబంధమూ లేకపోయినా సరే, నేటి యువత భవిష్యత్తు ఈ 4.0 టెక్నాలజీల చుట్టూ ఉండబోతోంది. 

4.0 విప్లవం, అందులో ఉండబోయే అవకాశాల గురించి యువతకు తెలిపేందుకు ఐబీ హబ్స్, నెక్స్‌ట్‌ వేవ్‌ కలిసి ఉచితంగా ఆన్‌లైన్‌లో 4.0 టెక్‌ బూట్‌క్యాంప్‌ను నిర్వహించనున్నాయి. ఇది ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ ఆన్‌లైన్‌ బూట్‌క్యాంప్‌లో ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి ప్రఖ్యాత కళాశాలల్లో చదివి, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీల్లో ప్రొడక్ట్స్‌ తయారుచేసిన వారు బోధిస్తారు.  

ఈ బూట్‌క్యాంప్‌లో ఐఓటీ, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్‌ లాంటి 7 రకాల టెక్నాలజీల గురించి వివరిస్తారు. వీటి గురించి అవగాహనకు నిపుణుల నుంచి హాండ్స్‌ ఆన్‌ సెషన్స్‌ కూడా ఉంటాయి. 21వ శతాబ్దపు టెక్నాలజీల గురించి తెలుసుకోవడం వల్ల అందులో కెరియర్‌ను ఎలా నిర్మించుకోవాలో అవగాహన వస్తుంది. ఇందులో పాల్గొన్నవారికి 4.0 టెక్‌ 101 సర్టిఫికెట్‌ అందజేస్తారు.

ఈ బూట్‌క్యాంప్‌లో పాల్గొనే విద్యార్థులు దేశంలోనే అతి పెద్ద 4.0 టెక్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీలో భాగం అవుతారని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ కమ్యూనిటీలో 25 రాష్ట్రాల నుంచి 20000+ విద్యార్థులు, 500+ కాలేజీలు ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల మారుతున్న టెక్నాలజీలు, పరిశ్రమకు కావాల్సిన తాజా నైపుణ్యాల అవగాహన వస్తుందని వారు తెలిపారు. తాజా ఇంటర్న్‌షిప్స్, ఉద్యోగ అవకాశాల గురించి ఇందులోని విద్యార్ధులు తెలుసుకుంటారు.

తమ బ్రాంచి, విద్యానేపథ్యంతో సంబంధం లేనివారు, ఎటువంటి కోడింగ్‌ అనుభవం లేనివారు కూడా ఈ ఒక్క రోజు ఆన్‌లైన్‌ బూట్‌క్యాంప్‌లో పాల్గొనవచ్చు. 

వెబ్‌సైట్‌: https://www.ccbp.in/

Posted Date : 04-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌