• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అందుకో ‘ఆర్యభట్ట’ బహుమానం!
 

‣ పదేళ్ల నుంచి 24 ఏళ్లలోపు విద్యార్థులు అర్హులు

‣ ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటేషన్-2021

లెక్కల్లో చురుకైన విద్యార్థులు భారీ బహుమానం పొందే అవకాశం ఇది. ఆల్ ఇండియ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ (ఏఐసీటీఎస్‌డీ) ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలో విజేతగా నిలిస్తే చాలు. ఈ సంస్థ ఏటా ‘ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటేషన్’ పరీక్ష నిర్వహిస్తుంది. ఈఏడాదికి సంబంధించి ప్రకటన వెలువడింది. ఆ వివరాలు ఇలా...

ఎవరు అర్హులు?

దేశంలోని ఏదైనా పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనడానికి అర్హులు. వయసు పదేళ్ల నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. 

బహుమానం ఎంత?

పరీక్షలో ప్రతిభ చూపిన వారిలో నుంచి టాప్‌-20 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో టాప్ ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి విజేతకు రూ.1.5 లక్షలు, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు ఇస్తారు. వీటితోపాటు ఏఐసీటీఎస్‌డీ ధ్రువపత్రం, జాతీయ గణిత శాస్త్రవేత్త ట్రోఫీ అందజేస్తారు. అలాగే రోబోటిక్స్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ ప్రొఫెష‌న‌ల్స్‌లో ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. ఏఐసీటీఎస్‌డీ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నేరుగా పాల్గొనే అవకాశం దక్కుతుంది. జాతీయ గణిత శాస్త్రవేత్త స్కాలర్షిప్ పొందే వీలు కలుగుతుంది. వీటితో మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. 

దరఖాస్తు ఎలా చేయాలి?

ఆసక్తి ఉండి, అర్హులైన వారు సంబంధిత అధికారి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.290 చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు 48 గంటల్లో హాల్‌టికెట్‌ నంబరు వస్తుంది. 

పరీక్ష విధానం

ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇంటి నుంచే రాయవచ్చు. ఇందులో డెస్క్టాప్ గానీ ల్యాప్టాప్ గానీ ఉండాలి. వీటితోపాటు ఇంటర్నెట్ సౌకర్యం తప్పనిసరి. వయసును బట్టి మూడు గ్రూపులుగా విభజించారు. 10 నుంచి 13 ఏళ్లవారిని గ్రూప్‌-1గా, 14 నుంచి 17 ఏళ్లవారిని గ్రూప్‌-2గా, 18 నుంచి 24 ఏళ్లవారిని గ్రూప్‌-3గా పేర్కొన్నారు. వీటిని బట్టే పరీక్ష సిలబస్, ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో 30 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ఒక్క ప్రశ్నకు రెండు మార్కుల చొప్పు మొత్తం 60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 45 నిమిషాలు ఉంటుంది. ఇందులో రుణాత్మక మార్కులు కూడా ఉంటాయి. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. 

సిల‌బ‌స్‌లోని అంశాలు

గ్రూప్‌-1

అభ్య‌ర్థులకు చైన్ రూల్, పర్సంటేజ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఆవేరేజ్, నంబర్ సిస్టం, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ క్యాలెండర్కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఆయ అంశాల వారీగా సిద్ధం కావాలి.

గ్రూప్-2

ఈ విభాగం అభ్యర్థులకు కంపేరింగ్ క్వాంటిటీస్, ఏజెస్, ట్రైన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రు డిస్కౌంట్, చైన్ రూల్, హెచ్సీఎఫ్ & ఎల్సీఎం, ప్రాఫిట్ & లాస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. 

గ్రూప్-3

ప్రాఫిట్ & లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్పీడ్ & డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ & వర్క, ట్రైన్స్, చైన్ రూల్, ఏజెస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఆయా విభాగాలపై దృష్టి సారించాలి. 

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులకు చివరితేదీ: మే 20, 2021

ఆన్‌లైన్ పరీక్ష: జూన్ 10, 2021

పరీక్ష ఫలితాలు: జూన్ 30, 2021

వెబ్‌సైట్‌: https://www.aictsd.com/aryabhatta-national-maths-competition/


 

Posted Date : 08-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌