* ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతి
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభమవుతున్నందున విద్యార్థులు తమ హాల్‌టికెట్లను కళాశాలల ప్రిన్సిపల్స్ నుంచి పొందాలని, www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి కూడా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ మార్చి 6న ప్రకటన జారీ చేశారు. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. డౌన్‌లోడ్ చేసుకొని ప్రిన్సిపల్ సంతకం లేకుండా తీసుకొచ్చిన హాల్‌టికెట్లను పరిశీలించి విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను నవీన్ మిత్తల్ ఆదేశించారు.
ఇంటర్ స్టడీమెటీరియల్
ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు - 2023 (ఈ-బుక్స్)