• facebook
  • whatsapp
  • telegram

పిలుస్తోంది వైమానిక దళం... ఎంపికైతే రూ. 75 వేల వేతనం

 పైసా చెల్లించకుండా పైలట్ అయ్యే అవకాశం
 సాధారణ డిగ్రీ విద్యార్థులకు వరం
 విద్యార్థినులూ అర్హులే

సాధారణ డిగ్రీతో అసాధారణ అవకాశాలను సొంతం చేసుకునే మార్గాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఒకటి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు భారత వైమానిక దళంలో పలు రకాల (ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ) క్లాస్ వన్ కొలువులను సొంతం చేసుకోవచ్చు. ఫ్త్లెయింగ్ బ్రాంచ్‌లో ఎంపికైనవారు పైసా ఖర్చు లేకుండా పైలట్ శిక్షణ పూర్తిచేసుకుని నెలకు సుమారు రూ.75,000 వేతనంగా పొందొచ్చు. టెక్నికల్ బ్రాంచ్‌కైతే రూ.65514, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లకు రూ.63014 జీతంగా చెల్లిస్తారు. ఏ విభాగానికి ఎంపికైనప్పటికీ వేతనంతోపాటు పలు రకాల ఆలవెన్సులు, సౌకర్యాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టులకు విద్యార్థినులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో బ్రాంచ్‌ల వారీ అర్హతలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.
 

ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ఏటా రెండు సార్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ప్రకటన సాధారణంగా జూన్, డిసెంబర్‌ల్లో వెలువడుతుంది. రాత పరీక్షలు ఆగస్ట్, ఫిబ్రవరిల్లో ఉంటాయి.
 

బ్రాంచీల వారీ అర్హతలిలా...
ఫ్త్లెయింగ్ బ్రాంచ్

విద్యార్హత: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ చదివుండడం తప్పనిసరి. మూడేళ్ల సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
వయోపరిమితి: 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అంటే జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య జన్మించినవారే అర్హులు.
ఎత్తు: కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండరాదు.

 

టెక్నికల్ బ్రాంచ్
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో స్పెషలైజేషన్ చేసినవారు అర్హులు. ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎత్తు: పురుషులైతే 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

 

గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్
ఈ బ్రాంచ్‌లో మూడు ఉప విభాగాలున్నాయి. అవి..
1. అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్
2. అకౌంట్స్
3. ఎడ్యుకేషన్
అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకాం లేదా 50 శాతం మార్కులతో ఎంకాం లేదా సీఏ లేదా ఐసీడబ్ల్యుఏ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే
ఎడ్యుకేషన్: 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసుకున్నవారు, ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లోని పై మూడు పోస్టులకూ 20 నుంచి 26 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు.
ఎత్తు: పురుషులు 157.5, మహిళలైతే 152 సెం.మీ ఉండాలి.

 

ఎంపిక ఇలా...
పైన పేర్కొన్న ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ ఏ బ్రాంచ్‌కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అంటే ప్రశ్నపత్రం అన్ని విభాగాలకూ ఒక్కటే. టెక్నికల్ బ్రాంచ్‌కి దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈఏటీ) రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్త్లెయింగ్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీబీఏటీ) నిర్వహిస్తారు. అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి ఎంపికవుతారు. వీరు శిక్షణ అనంతరం విధుల్లో చేరతారు.

 

రాత పరీక్షలో: వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలడుగుతారు. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్లు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో... చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ విభాగం నుంచి... కాంప్రహెన్సన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లిషన్, సిననిమ్స్, యాంటోనిమ్స్, ఒకాబులరీ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో... సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, రేషియో అండ్ ప్రపోషన్, సింపుల్ ఇంట్రస్ట్ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగంలో వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ(మెంటల్ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.
ఈ పరీక్ష ముగిసిన వెంటనే టెక్నికల్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు.

 

స్టేజ్ 1, 2 ఇలా...
రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2లో సైకలాజికల్ టెస్ట్, బృంద పరీక్షలు; ఇంటర్వ్యూలు చేపడతారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఉద్యోగం ఖాయమైనట్టే. అయితే ఫ్త్లెయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ఈ దశలో అదనంగా పీఏబీటీ ఉంటుంది. వారు ఇందులో అర్హత సాధిస్తేనే పైలట్ పోస్టులకు ఎంపికవుతారు.

 

ఎంపికైతే...
అభ్యర్థులకు సంబంధిత బ్రాంచ్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్త్లెయింగ్, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74, గ్రౌండ్ డ్యూటీకి ఎంపికైనవారికి 52 వారాలపాటు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.21,000 చొప్పున స్త్టెపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు విధుల్లో చేరతారు. ఫ్త్లెయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి రూ.74264, టెక్నికల్ బ్రాంచ్‌వారికి రూ.65514, గ్రౌండ్ డ్యూటీ పోస్టులకు రూ.63014 చొప్పున ప్రతి నెలా వేతనం చెల్లిస్తారు. వీటితోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఉంటాయి.

 

వెబ్‌సైట్: www.careerairforce.nic.in

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌