• facebook
  • whatsapp
  • telegram

త్రివిధ దళాల్లోకి తిరుగులేని దారి

 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)- 2021 నోటిఫికేషన్ విడుదల


భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా? అయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఆసక్తితోపాటు ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారి ప్రతిభకు పదునుపెట్టి, సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎంపికైతే గౌరవం, హోదా లభిస్తాయి. ఆర్థికంగానూ మంచి అభివృద్ధి ఉంటుంది. శిక్షణ కాలం నుంచే పెద్ద వేతనాన్ని పొందవచ్చు.  ‌సీడీఎస్ ప‌రీక్ష యూపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది.

ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ

మొత్తం ఖాళీలు: 345, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్-100, ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ -26 , ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)-17.

దరఖాస్తు: వెబ్సైట్ 
http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు:  రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.

అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జ‌న‌వ‌రి 1998 - 1 జ‌న‌వ‌రి 2003 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌