• facebook
  • whatsapp
  • telegram

సీడీఎస్ఈలో ఎంపిక ఇలా..

డిగ్రీ పూర్త‌యిన యువ‌త డిఫెన్స్ రంగంలో ఉద్యోగంలో స్థిర‌ప‌డాలంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మంచి మ‌ర్గాన్ని చూపుతుంది. ఇందుకు అనుగుణంగా సీడీఎస్ఈ ఎంపికరెండు దశల్లో జరుగుతుంది. మొద‌టి స్టేజ్లో రాత పరీక్ష, త‌రువాతి స్టేజ్లో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.  
రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ అంశాల నుంచి ప్రశ్నపత్రాలు అడుగుతారు. ఒక్కో పేపర్కు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ మూడు విభాగాలకు రెండు గంటల చొప్పున సమయం కేటాయించారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ప్రశ్నపత్రం లేదు. అన్ని విభాగాల్లోని ప్రశ్నలకు బహుళైచ్ఛిక రూపంలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జవాబు తప్పుగా రాస్తే రుణాత్మక మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఎంపికైతే స్టేజ్కు అర్హత లభిస్తుంది. స్టేజ్లో నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మిగిలిన ఇంటర్వ్యూలతో పోలిస్తే కఠినతరమైనదనే చెప్పవచ్చు. ఇది అయిదు రోజులపాటు కొనసాగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్ట్లు, సైకలాజికల్  పరిశీలనల ద్వారా అభ్యర్థుల తీరును క్షుణ్ణంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలవిద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో ఇవి జరుగుతాయి. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి.

సిలబస్ అవగాహన

ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్లభాషను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్: వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించనవే ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఇందులో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అరిథ్మెటిక్, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, క్షేత్రగణితం, స్టాటిస్టిక్స్ టాపిక్ల నుంచి అడుగుతారు.

Posted Date : 17-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌