• facebook
  • whatsapp
  • telegram

ఆర్మీలో ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాలు

దేశంలో నిరుద్యోగ యువ‌త ఆర్మీలో త‌మ ఉద్యోగ ప్ర‌స్తానం ప్రారంభించడాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ఆర్మీలోని ఉద్యోగాల‌ను రెండు విధానాల ద్వారా భ‌ర్తీ చేస్తారు. అవి ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌. 

ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌

కేవ‌లం ఇంట‌ర్ అర్హత‌తో నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ(ఎన్‌డీఏ), డిగ్రీ అర్హత‌తో కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్‌(సీడీఎస్‌) ప‌రీక్షల ద్వారా ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాల‌ను అందుకోవ‌చ్చు. ఈ రెండు ప‌రీక్షల‌నూ యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఎన్‌డీఏ ప‌రీక్షలో ఎంపికైన‌వాళ్లు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ, పుణెలో శిక్షణ పొందుతారు. వీళ్లకు శిక్షణ అందించ‌డంతోపాటు డిగ్రీ కూడా చ‌దివిస్తారు. అనంత‌రం సంబంధిత విభాగానికి చెందిన క్యాడెట్ శిక్షణ పొందుతారు. ఎన్‌డీఏ ద్వారా ఆర్మీలో ప్రవేశం పొందిన‌వాళ్లు క్యాడెట్ శిక్షణ‌లో భాగంగా మిల‌ట‌రీ అకాడెమీ, డెహ్రాడూన్‌లో త‌ర్ఫీదు తీసుకుంటారు. అలాగే సీడీఎస్ ప‌రీక్ష ద్వారా ఆర్మీకి ఎంపికైన‌వాళ్లు కూడా ఐఎంఏ,డెహ్రాడూన్‌లోనే శిక్షణ తీసుకుంటారు. అయితే ఎన్‌డీఏ, సీడీఎస్‌లే కాకుండా డైరెక్ట్ ఎంట్రీ స్కీం ద్వారా కూడా ఆర్మీలో ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాల్లో ప్రవేశం పొందే వీలుంది. అవి...

10+2 టెక్ ఎంట్రీ

ఎంపీసీ గ్రూప్‌తో మెరిట్ విద్యార్థులు ఈ విధానం ద్వారా రాత ప‌రీక్ష లేకుండా నేరుగా ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వూతోనే ఉద్యోగాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ విధానంలో ఎంపికైన‌వాళ్లకి ఐదేళ్ల శిక్షణ ఉంటుంది. ఇందులో నాలుగేళ్లు క్యాడెట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే వీళ్లు అభిరుచి, అవ‌కాశం మేర‌కు ఉచితంగానే బీటెక్ చ‌దువుకోవ‌చ్చు. అనంత‌రం ఏడాదిపాటు ఐఎంఏలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఆ త‌ర్వాత వీళ్లు లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరుతారు.

డైరెక్ట్ ఎంట్రీ

ఇంజినీరింగ్ అర్హత‌తో డైరెక్ట్ ఎంట్రీ విధానంలో ఆర్మీలో చేరొచ్చు. ఇంజినీరింగ్‌లో 70 శాతం మార్కులు సాధించిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. వీళ్లు కూడా కేవ‌లం స‌ర్వీస్ సెల‌క్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) ఇంట‌ర్వ్యూతోనే ఎంపిక కావ‌చ్చు. ఇలా ఎంపికైన‌వాళ్లకు 18 నెల‌ల పాటు మిల‌ట‌రీ అకాడెమీలో శిక్షణ ఉంటుంది.

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌...

ఈ విధానంలో ప‌దేళ్ల వ‌ర‌కు ఆర్మీలో ఆఫీస‌ర్‌గా కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత అభ్యర్థి ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌కు ఎంపికైతే కొన‌సాగొచ్చు, కావాలంటే వైదొల‌గొచ్చు. స‌ర్వీస్‌లో మ‌రో నాలుగేళ్లు పొడిగించుకునే అవ‌కాశం కూడా ఉంది. అభ్యర్థి ఈ వ్యవ‌ధిలో న‌చ్చిన‌ప్పుడు వైదొలిగే అవ‌కాశం ఉంది. ఈ క‌మిష‌న్ ద్వారా ఎంపికైన‌వాళ్లు ఆర్మీ కార్యాల‌యాల్లో అడ్మినిస్ట్రేష‌న్‌ విభాగంలో కొనసాగుతారు కాబ‌ట్టి వీళ్లకు బ‌య‌ట కూడా అవ‌కాశాలు మెండుగానే ఉంటాయి. ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ప‌రీక్షల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన‌వాళ్లకు చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ ఉంటుంది.

ప‌ర్మనెంట్ క‌మిష‌న్ ద్వారా భ‌ర్తీ అయ్యే ఉద్యోగాలు వివ‌రంగా...

నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ)

నిర్వహ‌ణ‌: యూపీఎస్‌సీ

ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు. మార్చి, అక్టోబ‌ర్‌ల్లో వెలువ‌డుతుంది.

ఖాళీలు: ఒక్కో విడ‌త‌లో 195 వ‌ర‌కు ఉండొచ్చు.

అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌

వ‌యోప‌రిమితి: 16 1/2 నుంచి 19 ఏళ్లు

కోర్సు ప్రారంభం: ఏటా జ‌న‌వ‌రి, జులైల్లో

ట్రైనింగ్ అకాడెమీ: ఎన్‌డీఏ, పుణె

శిక్షణ‌: మూడేళ్లు ఎన్‌డీఏలో+ ఏడాది ఐఎంఏలో

10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్‌

భ‌ర్తీ: ఏడాదికి రెండుసార్లు

ఖాళీలు: ఒక్కో విడ‌త‌లో 85

ప్రక‌ట‌న‌: ఏప్రిల్‌, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో

ఎంపిక‌: అడిష‌న‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ రిక్రూటింగ్ ద్వారా

అర్హత‌: గ్రూప్ స‌బ్జెక్టుల్లో క‌నీసం 70 శాతం మార్కుల‌తో 10+2/ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత‌

శిక్షణ ప్రారంభం: ఏటా జ‌న‌వ‌రి, జులైల్లో

శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌

శిక్షణ వ్యవ‌ధి: ఐదేళ్లు (ఏడాది పాటు ఐఎంఏలో నాలుగేళ్లు సంబంధిత ట్రేడ్‌(ఇంజ‌నీరింగ్ బ్రాంచ్‌)లో శిక్షణ ఉంటుంది.

సీడీఎస్ఈ(ఐఎంఎ)

ప‌రీక్ష: కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్‌(సీడీఎస్ఈ)

నిర్వహ‌ణ‌: యూపీఎస్‌సీ

భ‌ర్తీ: ఏటా రెండు సార్లు

ఖాళీలు: 250 వ‌ర‌కు ఉండొచ్చు.

ప్రక‌ట‌న‌: మార్చి/ ఏప్రిల్‌, సెప్టెంబ‌ర్‌/ అక్టోబ‌ర్‌ల్లో

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌

వ‌యోప‌రిమితి: 19 నుంచి 24 ఏళ్లు

శిక్షణ ప్రారంభం: జ‌న‌వ‌రి, జులై నెల‌ల్లో

శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌

శిక్షణ వ్యవ‌ధి: 18 నెల‌లు

టీజీసీ(ఇంజినీర్స్‌)

ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు (ఏప్రిల్‌, అక్టోబ‌ర్‌ల్లో)

భ‌ర్తీచేసే సంస్థ: అడిష‌న‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్ బ్రాంచ్‌

అర్హత‌: నిర్దేశిత బ్రాంచ్‌ల్లో బీఈ/ బీటెక్‌

వ‌యోప‌రిమితి: 20 - 27 ఏళ్లు

కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి, జులై నెల‌ల్లో

శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌

వ్యవ‌ధి: ఏడాది

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా భ‌ర్తీ అయ్యే ఉద్యోగాలు వివ‌రంగా...

ఎస్ఎస్‌సీ నాన్ టెక్నిక‌ల్ (మెన్‌)

ఎంపిక‌: సీడీఎస్ఈ ద్వారా

నిర్వ‌హ‌ణ‌: యూపీఎస్‌సీ

ప్ర‌క‌ట‌న‌: ఏటా రెండు సార్లు

ఖాళీలు: 175 వ‌ర‌కు ఉండొచ్చు

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ

వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు

శిక్ష‌ణ ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో

శిక్ష‌ణ కేంద్రం: ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఓబీఏ), చెన్నై

శిక్ష‌ణ వ్య‌వ‌ధి: 49 వారాలు

టీజీసీ ఎడ్యుకేష‌న్ (ఏఈసీ)

ప్ర‌క‌ట‌న‌: ఏటా రెండు సార్లు (ఏప్రిల్‌, అక్టోబ‌ర్‌ల్లో)

ఎంపిక సంస్థ‌: అడిష‌న‌ల్ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్‌, రిక్రూటింగ్‌

అర్హ‌త‌: క‌నీసం సెకెండ్ క్లాస్‌తో ఏదైనా పీజీ ఉత్తీర్ణ‌త‌ (ఎంఏ/ ఎమ్మెస్సీ)

వ‌యోప‌రిమితి: 23-27 ఏళ్లు

శిక్ష‌ణ ప్రారంభం: జ‌న‌వ‌రి, జులైల్లో

శిక్ష‌ణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌

శిక్ష‌ణ వ్య‌వ‌ధి: ఏడాది

ఎస్ఎస్‌సీ నాన్ టెక్ (ఉమెన్‌)

ప‌రీక్ష‌: సీడీఎస్ఈ

నిర్వ‌హ‌ణ‌: యూపీఎస్‌సీ

ప్ర‌క‌ట‌న‌: ఏటా రెండు సార్లు (మార్చి/ ఏప్రిల్‌, సెప్టెంబ‌ర్‌/ అక్టోబ‌రుల్లో)

ఖాళీలు: 175 వ‌ర‌కు ఉండొచ్చు

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు (అవివాహితులై ఉండాలి)

కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి, జులైల్లో

శిక్ష‌ణ కేంద్రం: ఓటీఏ, చెన్నై

శిక్ష‌ణ వ్య‌వ‌ధి: 49 వారాలు

జ‌డ్జ్ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (జాగ్‌) మెన్

‌ప్ర‌క‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు

ఖాళీలు: అప్ప‌టి ప‌రిస్థితుల బ‌ట్టి ఆదార‌ప‌డి ఉంటుంది

నిర్వ‌హ‌ణ‌: అడిషిన‌ల్ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌

అర్హ‌త‌: డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ/ ఎల్ఎల్ఎంలో క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త‌. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ స్టేట్‌లో పేరు న‌మోదు చేసుకోవాలి.

కోర్సు ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబరుల్లో

శిక్ష‌ణ కేంద్రం: ఓటీఏ, చెన్నై

వ్య‌వ‌ది: 49 వారాలు

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ టెక్నిక‌ల్ (మెన్‌)

ఖాళీలు: 50 వ‌ర‌కు ఉండొచ్చు

ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు (ఏప్రిల్‌, అక్టోబ‌రుల్లో)

నిర్వహ‌ణ‌: అడిషిన‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌

అర్హత‌: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ

వ‌యోప‌రిమితి: 20-27 ఏళ్లు

ఎంపిక‌: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ద్వారా

శిక్షణ ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో

శిక్షణ కేంద్రం: ఓటీఏ, చెన్నై

శిక్షణ వ్యవ‌ధి: 49 వారాలు

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ మెన్‌

ఖాళీలు: 50

ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండుసార్లు

నిర్వహ‌ణ‌: అడిషిన‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌

అర్హత‌: 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎంలో ఉత్తీర్ణత‌తోపాటు ఎన్‌సీసీ సీనియ‌ర్ డివిజ‌న్ ఆర్మీలో రెండేళ్ల స‌ర్వీస్‌, సీ స‌ర్టిఫికెట్ ప‌రీక్షలో క‌నీసం బీ గ్రేడ్ ఉండాలి. అవివాహితులే అర్హులు.

వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు

ఎంపిక విధానం: ఎస్ఎస్ బీ ఇంట‌ర్వ్యూ ద్వారా

శిక్షణ ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబ‌రుల్లో

ట్రైనింగ్ అకాడెమీ: ఓటీఏ, చెన్నై

శిక్షణ వ్యవ‌ధి: 49 వారాలు

ఎస్ఎస్‌సీ టెక్ ఉమెన్‌

ఖాళీలు: అప్పటి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటాయి.

నిర్వహ‌ణ: అడిషిన‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌

ప్రక‌ట‌న‌: ఏటా రెండు సార్లు

అర్హత‌: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ

వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు (అవివాహితులై ఉండాలి)

ఎంపిక‌: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ద్వారా

శిక్షణ ప్రారంభం: అక్టోబ‌ర్‌, ఏప్రిల్ నెల‌ల్లో

శిక్షణ కేంద్రం: ఓటీఏ, చెన్నై

శిక్షణ వ్యవ‌ధి: 49 వారాలు

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ ఉమెన్‌

ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు

ఖాళీలు: అప్పుడున్న ప‌రిస్థితుల బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది

నిర్వహ‌ణ‌: అడిషిన‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌

అర్హత‌: 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎంలో ఉత్తీర్ణత‌తోపాటు ఎన్‌సీసీ సీనియ‌ర్ డివిజ‌న్ ఆర్మీలో రెండేళ్ల స‌ర్వీస్‌, సీ స‌ర్టిఫికెట్ ప‌రీక్షలో క‌నీసం బీ గ్రేడ్ ఉండాలి. అవివాహితులే అర్హులు.

వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు

ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ద్వారా

శిక్షణ ప్రారంభం: ఏప్రిల్‌, అక్టోబ‌రుల్లో

ట్రైనింగ్ అకాడెమీ: ఓటీఏ, చెన్నై

శిక్షణ వ్యవ‌ధి: 49 వారాలు

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీమ్‌

ఖాళీలు: 60

ప్రక‌ట‌న‌: ఏటా ఒక‌సారి (మేలో ఉండొచ్చు)

నిర్వహ‌ణ‌: అడిషిన‌ల్ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ రిక్రూటింగ్‌

అర్హత‌: ఇంజినీరింగ్ ఫైన‌ల్‌ / ప్రిఫైన‌ల్ విద్యార్థులు అర్హులు

వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు (ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు) 18-24 ఏళ్లు (ప్రిఫైన‌ల్ విద్యార్థులు) అవివాహితులే అర్హులు

ఎంపిక‌: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ద్వారా

శిక్షణ ప్రారంభం: జులైలో

శిక్షణ కేంద్రం: ఐఎంఏ, డెహ్రాడూన్‌

శిక్షణ వ్యవ‌ధి: ఏడాది

వెబ్‌సైట్లు: http://joinindianarmy.nic.in, https://www.upsc.gov.in/

Posted Date : 17-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌