• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్ అర్హ‌త‌తో ఉద్యోగాలు

ఇంజినీరింగ్ బ్రాంచ్ (నావ‌ల్ ఆర్కిటెక్ట్‌)

నిరుద్యోగ‌ యువ‌త‌కు భార‌త నౌకాద‌ళం ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తోంది. ప‌దోత‌ర‌గ‌తి మొద‌లు డిగ్రీ, ఇంజినీరింగ్ ఆపై చ‌దువులున్న వారికి ప్రత్యేక‌మైన ఉద్యోగాలెన్నో నేవీలో ఉన్నాయి. త‌క్కువ అర్హత‌తో చేరిన‌ప్పటికీ కెరీర్‌లో ఎదుగుద‌ల‌కూ అవ‌కాశాలు ఉన్నాయి. నేవీలో ఇంజినీరింగ్ అర్హ‌త‌తో ఉద్యోగాలు, వాటికి కావాల్సిన అర్హత‌లేమిటో చూద్దాం...

10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. దీంతోపాటు పీసీఎంలో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. అలాగే టెన్త్ లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 50 శాతం మార్కులు ఉండాలి.(పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2-19 ఏళ్లు


షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎంట్రీ
అర్హత‌: మెకానిక‌ల్‌/ సివిల్‌/ ఏరోనాటిక్స్‌/ మెట‌ల‌ర్జిక‌ల్‌/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)


యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో నావ‌ల్ ఆర్కిటెక్చర్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, ఏరోనాటిక‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్‌, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ లేదా బీ ఆర్క్‌
వ‌యోప‌రిమితి: 19-24 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా అర్హులే)


స్పెష‌ల్ నావ‌ల్ ఆర్కిటెక్ట్ ఎంట్రీ స్కీం (ఎస్ఎన్ఎఇఎస్‌)
అర్హత‌: నావ‌ల్ ఆర్కిటెక్చర్‌లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌
ఎంపిక విధానం: క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ ద్వారా
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)


ఎల‌క్ట్రిక‌ల్ విభాగం
ఇందులో స‌బ్ మెరైన్ ఎలక్ట్రిక‌ల్ ఆఫీసర్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు.


క్యాడెట్ ఎంట్రీ (ఎన్‌డీఏ)
అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2- 19 ఏళ్లు


10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. అలాగే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల్లో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు టెన్త్ లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు త‌ప్పనిస‌రి.


యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, కంట్రోల్ సిస్టం, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌లో అప్పటిదాకా 60 శాతం మార్కుల‌తో ఫైన‌ల్‌, ప్రీ ఫైన‌ల్ విద్యార్థులు అర్హులు.
వ‌యోప‌రిమితి: ప్రి ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులైతే 19 1/2- 25 ఏళ్లు, ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులైతే 19-24 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)


షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (జీఎస్‌)
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు


షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (స‌బ్‌మెరైన్‌)
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, కంట్రోల్ ఇంజినీరింగ్‌, టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌లో ఎందులోనైనా 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌
వ‌యోప‌రిమితి: 19 1/2-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌