• facebook
  • whatsapp
  • telegram

ఎడ్యుకేష‌న్ విభాగంలో ఎంపిక ఇలా..

నేవీ రంగంలో ఉద్యోగంలో స్థిర‌ప‌డాలని యువ‌త ఎంతో ఎదురుచూస్తోంది. ఇందులో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. అందులో భాగంగా ఎడ్యుకేష‌‌న్ ఆఫీస‌ర్ హోదాతో ఉద్యోగాలు ఉంటాయి. ఈ విభాగంలోని పోస్టుల‌ను ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ రెండు విభాగాల ద్వారా భ‌ర్తీ చేస్తారు.


ప‌ర్మనెంట్ క‌మిష‌న్ (పీసీ)
అర్హత‌: మెకానిక‌ల్‌/ ఐటీ/ కంప్యూట‌ర్ సైన్స్ బ్రాంచ్‌ల్లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌. లేదా మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీలో 60 శాతం మార్కుల‌తో ఎంటెక్ లేదా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఆప‌రేష‌న‌ల్ రీసెర్చ్‌, ఎనాల‌సిస్‌, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీ లో 50 శాతం మార్కుల‌తో ఎమ్మెస్సీ లేదా 50 శాతం మార్కుల‌తో ఎంఏ ఇంగ్లిష్‌, హిస్టరీ.
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)


షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: మెకానిక‌ల్‌/ ఐటీ/ కంప్యూట‌ర్ సైన్స్ బ్రాంచ్‌ల్లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌. లేదా మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్‌లో 60 శాతం మార్కుల‌తో ఎంటెక్ లేదా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఆప‌రేష‌న‌ల్ రీసెర్చ్‌, ఎనాల‌సిస్‌, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్‌ లో 60 శాతం మార్కుల‌తో ఎమ్మెస్సీ
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)


మెడిక‌ల్ విభాగం
నేవీ ఆస్పత్రుల్లో వైద్యులుగా సేవ‌లందించ‌డానికి మెడిక‌ల్ విభాగంలో పోస్టులు భ‌ర్తీ చేస్తారు. ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ విధానంలో వైద్యుల‌ను ఎంపిక చేస్తారు.
షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌
ఈ విధానంలో ఏడాదికి రెండుసార్లు వైద్య పోస్టులు భ‌ర్తీ చేస్తారు. మ‌హిళ‌లు కూడా డాక్టర్ పోస్టుల‌కు అర్హులే. అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టుల ద్వారా ఉద్యోగానికి భ‌ర్తీ చేస్తారు. వ‌యోప‌రిమితి గ‌రిష్ఠంగా 45 ఏళ్లకు మించ‌రాదు.

 

ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌
ఈ విధానంలో ఎంపికైన‌వాళ్లు ఫుల్ టైం ఉద్యోగిగా కొన‌సాగొచ్చు. ఏడాదికి ఒక‌సారి ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. వ‌యోప‌రిమితి ఎంబీబీఎస్ పూర్తిచేసినవాళ్లైతే 30 ఏళ్లు, పీజీ డిప్లొమా అభ్యర్థులైతే 31 ఏళ్లు, పీజీ పూర్తిచేసిన‌వాళ్లైతే 35 ఏళ్లు.


ఉమెన్ ఎంట్రీ
ఎగ్జిక్యూటివ్ విభాగంలో: ఎస్ఎస్‌సీ- ఏటీసీ, అబ్జర్వర్‌, లా, లాజిస్టిక్స్ బ్రాంచ్‌ల్లో చేర‌డానికి మ‌హిళ‌లు అర్హులు.
ఎడ్యుకేష‌న్ విభాగంలో: ఎస్ఎస్‌సీ-ఎడ్యుకేష‌న్ బ్రాంచ్‌లో మ‌హిళ‌లు చేరొచ్చు.
ఇంజినీరింగ్ విభాగంలో: ఎస్ఎస్‌సీ-నేవ‌ల్ ఆర్కిటెక్చర్‌, ఎస్ఎస్‌సీ-యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా నేవ‌ల్ ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.


వెబ్‌సైట్లు: http://nausena-bharti.nic.in, https://www.upsc.gov.in/
 

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌