• facebook
  • whatsapp
  • telegram

నేవీలో ఉద్యోగాలెన్నో...

ఆస‌క్తి ఉన్న యువ‌త‌కు భార‌త నౌకాద‌ళం ఆహ్వానం ప‌లుకుతోంది. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ ఇలా ప్రతి కోర్సుకూ సంబంధించి ప్రత్యేక‌మైన ఉద్యోగాలెన్నో నేవీలో ఉన్నాయి. త‌క్కువ అర్హత‌తో చేరిన‌ప్పటికీ కెరీర్‌లో ఎదుగుద‌ల‌కూ అవ‌కాశాలు ఉన్నాయి. ఎంపికైన‌వారికి ఆక‌ర్షణీయ వేత‌నంతోపాటు ప‌లు ర‌కాల ప్రోత్సాహకాలు ల‌భిస్తాయి. నేవీలో వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలు, వాటికి కావాల్సిన అర్హత‌లేమిటో చూద్దాం...
 

సైల‌ర్ ఎంట్రీ
సైల‌ర్ పోస్టుల కోసం ఏటా రెండు సార్లు నావికాద‌ళం ప్రక‌ట‌న విడుద‌ల‌చేస్తుంది. సైల‌ర్‌గా ఎంపికైన‌వాళ్లు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌, ఏవియేష‌న్ బ్రాంచ్‌, స‌బ్ మెరైన్ బ్రాంచ్‌, ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్‌, ఇంజినీరింగ్ బ్రాంచ్‌, మెడిక‌ల్ బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.సాధార‌ణంగా సైల‌ర్ పేరుతో నాలుగు ర‌కాల పోస్టుల‌కు ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. అవి...ఆర్టిఫీషియ‌ల్ అప్రెంటిస్‌, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌, మెట్రిక్ రిక్రూట్ అండ్ నాన్ మెట్రిక్ రిక్రూట్‌, మ్యుజీషియ‌న్స్‌. వీటి గురించి వివరంగా ..
 

ఆర్టిఫీషియ‌ల్ అప్రెంటిస్‌

అర్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 17-20 ఏళ్లు
ఎంపిక‌: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ల ద్వారా
శిక్షణ‌: ఎంపికైన‌వాళ్లకు 9 వారాల ప్రాథ‌మిక శిక్షణ చిల‌క స‌ర‌స్సులో ఉంటుంది. దీంతోపాటు 8 వారాల స‌ముద్ర శిక్షణ నిర్వహిస్తారు. అనంత‌రం నాలుగేళ్లు డిప్లొమాలో ఎలక్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఏరోనాటిక‌ల్ బ్రాంచ్‌ల్లో శిక్షణ ఉంటుంది. అంటే అభ్యర్థులకు ఉద్యోగంతోపాటు ఇంజినీరింగ్‌లో డిప్లొమా కూడా సొంత‌మైన‌ట్టే. ఈ డిప్లొమాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోవ‌చ్చు. ఆర్టిఫీషియ‌ల్ అప్రెంటిస్‌కు ఎంపికైన‌వాళ్లు క‌నీసం 20 ఏళ్లపాటు నేవీలో ప‌నిచేయాల‌నే నిబంధ‌న ఉంది. కావాల‌నుకుంటే ఆ త‌ర్వాత కూడా కొన‌సాగొచ్చు.
 

సీనియ‌ర్ సెకెండ‌రీ రిక్రూట్‌
అర్హత‌: ఇంట‌ర్‌/ ప్లస్‌2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ కంప‌ల్సరీ స‌బ్జెక్టులుగా; కెమిస్ట్రీ/బ‌యాల‌జీ/ కంప్యూట‌ర్స్ వీటిలో ఏదైనా ఒక‌టి ఆప్షన‌ల్ స‌బ్జెక్టుగా చ‌దివుండాలి.
వ‌యోప‌రిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక‌: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ల ద్వారా
శిక్షణ‌: ఎంపికైన‌వాళ్లకు 24 వారాల బేసిక్ ట్రైనింగ్ ఐఎన్ఎస్ చిల‌క‌లో ఉంటుంది. అనంత‌రం అభ్యర్థుల‌కు కేటాయించిన ట్రేడ్‌లో 24 వారాల ప్రొఫెష‌న‌ల్ ట్రైనింగ్ నేవ‌ల్ సంస్థలో దేశంలో ఎక్కడైనా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు క‌నీసం 15 ఏళ్లపాటు నేవీలో ప‌నిచేయాలి. అనంత‌రం కావాల‌నుకుంటే స‌ర్వీస్ పొడిగించుకోవ‌చ్చు.
 

మెట్రిక్ రిక్రూట్‌మెంట్ అండ్ నాన్ మెట్రిక్ రిక్రూట్‌మెంట్‌(ఎంఆర్ అండ్ ఎన్ఎంఆర్‌)
మెట్రిక్ రిక్రూట్‌మెంట్ విభాగంలోకి స్టివార్డ్‌, కుక్ వ‌స్తారు.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
నాన్ మెట్రిక్ విధానంలో టోపాస్ పోస్టులు భ‌ర్తీ చేస్తారు.
అర్హత‌: ఆరోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
పై రెండు పోస్టుల‌కు వ‌యోప‌రిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్టుల ద్వారా
శిక్షణ‌: ఎంపికైన‌వాళ్లకు 15 వారాల పాటు ఐఎన్ఎస్ చిల‌క‌లో ప్రాథ‌మిక శిక్షణ ఉంటుంది. అనంత‌రం ప్రొఫెష‌న‌ల్ ట్రైనింగ్ ఏదైనా నేవ‌ల్ కేంద్రంలో చేప‌డ‌తారు.
 

మ్యుజీషియ‌న్‌
నేవీ బ్యాండ్‌లో ప‌నిచేయ‌డానికి మ్యుజీషియ‌న్లను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్నవాళ్లకు మ్యూజిక్ ప‌రిక‌రాల‌పై ప్రావీణ్యం ఉండాలి.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక‌: మ్యూజిక్ ప‌రిక‌రాల్లో ప్రావీణ్యం, ఫిజిక‌ల్ టెస్టు, మెడిక‌ల్ టెస్టుల ద్వారా
 

ఆఫీస‌ర్ ఎంట్రీ
వివిధ విభాగాల్లో నేవీలో ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ విభాగాలు...ఎగ్జిక్యూటివ్‌, ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎడ్యుకేష‌న్‌, మెడిక‌ల్‌. ఈ విభాగాల‌కు సంబందించి ఒక్కో విభాగంలోనూ ప‌లు పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.
 

ఎగ్జిక్యూటివ్ విభాగం...
ఇందులో జ‌న‌ర‌ల్ సర్వీస్ ఆఫీస‌ర్‌, హైడ్రోగ్రాఫిక్ ఆఫీస‌ర్‌, నేవ‌ల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్షన్ ఆఫీస‌ర్‌, ప్రోవోస్ట్ ఆఫీస‌ర్‌, పైల‌ట్ ఆఫీస‌ర్‌, అబ్జర్వర్ ఆఫీస‌ర్‌, స‌బ్ మెరైన్ ఆఫీస‌ర్‌, డైవింగ్ ఆఫీస‌ర్‌, లా ఆఫీస‌ర్‌, లాజిస్టిక్ ఆఫీస‌ర్‌, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ ఉద్యోగాలు ఉంటాయి. ఈ పోస్టుల కోసం నిర్వహించే ప‌రీక్షల వివ‌రాలు తెలుసుకుందాం...
 

ఎన్‌డీఏ
ప‌రీక్ష: నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ)
నిర్వహ‌ణ‌: యూపీఎస్‌సీ
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌తో ఇంట‌ర్‌/ ప్లస్‌2, పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 16 1/2- 19 ఏళ్లు
 

ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల‌
ప‌రీక్ష: ఎన్‌డీఏ ద్వారా భ‌ర్తీ చేస్తారు
నిర్వహ‌ణ‌: యూపీఎస్‌సీ
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌తో ఇంట‌ర్‌/ ప్లస్‌2, పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 16 1/2- 19 ఏళ్లు
 

గ్రాడ్యుయేట్ స్పెష‌ల్ ఎంట్రీ స్కీం(జీఎస్ఈఎస్‌)
ప్రవేశం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల‌
ఎంపిక‌: యూపీఎస్‌సీ ద్వారా
అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ, పురుషులు మాత్రమే
వ‌యోప‌రిమితి: 19-22 ఏళ్లు
 

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ
ప్రవేశం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల‌
అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈతోపాటు నేవ‌ల్ వింగ్ సీనియ‌ర్ డివిజ‌న్ ఎన్‌సీసీ సి స‌ర్టిఫికెట్‌ పురుషులు మాత్రమే
వ‌యోప‌రిమితి: 19-24 ఏళ్లు
 

పీసీ నేవ‌ల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్షన్ కేడ‌ర్‌
అర్హత‌: ఎల‌క్ట్రానిక్స్‌/ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌లో ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రానిక్స్‌/ ఫిజిక్స్‌లో పీజీ. పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 19 1/2 - 25 ఏళ్లు
 

పీసీ లా క్యాడ‌ర్
అర్హత‌: క‌నీసం 55 శాతం మార్కుల‌తో లాలో డిగ్రీ, పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 22-27 ఏళ్లు
 

పీసీ లాజిస్టిక్ క్యాడ‌ర్‌
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో బీకాం/ ఎంకాం/ ఎంఏ (ఎక‌నామిక్స్‌)/ బీఏ(ఎక‌నామిక్స్‌)/ ఎంబీఏ/ బీబీఎ/ బీబీఎం/ ఎంసీఏ/ బీసీఏ/ బీఎస్సీ(ఐటీ)/ బీటెక్‌/ బీఆర్క్‌/ సీఏ/ ఐసీడ‌బ్ల్యుఏ/ మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు
 

ఎస్ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ జ‌న‌ర‌ల్ స‌ర్వీస్‌
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో బీఈ/బీటెక్‌, పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు
 

ఎస్ఎస్‌సీ హైడ్రోగ్రాఫిక్‌
అర్హత‌: 55 శాతం మార్కుల‌తో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల‌తో బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ లేదా 55 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ(మ్యాథ్స్‌, ఫిజిక్స్‌)తోపాటు ఎన్‌సీసీ నేవ‌ల్ వింగ్ సీ స‌ర్టిఫికెట్ లేదా 75 శాతం మార్కుల‌తో ఆప‌రేష‌న‌ల్ రీసెర్చ్‌/ క్వాంటిటీటివ్ మెథడ్స్‌లో డిగ్రీ/ పీజీ లేదా మ్యాథ్స్‌తో క‌లిసి స్టాటిస్టిక్స్‌/ ప్రాబ‌బిలిటీలో డిగ్రీ/ పీజీలో 75 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు
 

ఎస్ఎస్‌సీ ఏటీసీ
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌తో ప్రథ‌మ శ్రేణితో డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఈ స‌బ్జెక్టుల్లో ఎందులోనైనా 55 శాతం మార్కుల‌తో పీజీ
వ‌యోప‌రిమితి: 19 1/2 - 25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)
 

ఎస్ఎస్‌సీ లా క్యాడ‌ర్‌
అర్హత‌: 55 శాతం మార్కుల‌తో లా డిగ్రీ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 22-27 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)
 

ఎస్ఎస్‌సీ లాజిస్టిక్స్ క్యాడ‌ర్‌
అర్హత‌: ప్రథ‌మ శ్రేణితో బీఏ(ఎక‌నామిక్స్‌), బీకాం, బీఎస్సీ(ఐటీ) సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ, బీసీఏ, ఎంసీఏ, క్యాట‌రింగ్ టెక్నాల‌జీ, బీఈ/ బీటెక్‌(మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెరైన్‌, ఎల‌క్ట్రానిక్స్‌, సివిల్‌, ఐటీ, కంప్యూట‌ర్‌, ఆర్కిటెక్చర్‌) లేదా పీజీ డిప్లొమా ఇన్ మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌.
వ‌యోప‌రిమితి: 19 1/2 -25 ఏళ్లు
 

ఎస్ఎస్‌సీ పైల‌ట్‌
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత‌. అలాగే ఇంట‌ర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ చ‌దివుండాలి.
వ‌యోప‌రిమితి: 19-23 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)
 

ఎస్ఎస్‌సీ అబ్జర్వర్‌
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత. అలాగే ఇంట‌ర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ చ‌దివుండాలి.
వ‌యోప‌రిమితి: 19-23 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)
 

ఎస్ఎస్‌సీ నేవ‌ల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్షన్ క్యాడ‌ర్‌
అర్హత‌: ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా ఫిజిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌లో పీజీ
వ‌యోప‌రిమితి: 19 1/2-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)
 

ఎస్ఎస్‌సీ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ
అర్హత‌: కంప్యూట‌ర్ సైన్స్‌, కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌, ఐటీలో బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ (ఐటీ), బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్‌, ఎంటెక్ కంప్యూట‌ర్ సైన్స్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత‌.
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు
 

ఇంజినీరింగ్ విభాగం
ఇందులో ఇంజినీరింగ్ జ‌న‌ర‌ల్ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌, స‌బ్ మెరైన్ ఇంజినీర్‌ ఆఫీస‌ర్‌, నావ‌ల్ క‌న్‌స్ట్రక్షన్ ఆఫీస‌ర్ ఉద్యోగాలున్నాయి.
 

ఎన్డీఏ క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2 - 19 ఏళ్లు
ఎంపిక‌: యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్డీఏ రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టుల ద్వారా
 

10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత దీంతోపాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. అలాగే ప‌ది లేదా ఇంట‌ర్‌లో ఇంగ్లిష్ స‌బ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించాలి.(పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2-19 ఏళ్లు

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: మెకానిక‌ల్‌, మెరైన్‌, ఏరోనాటిక‌ల్‌, ఏరోస్పేస్‌, ఆర్కిటెక్చర్‌, ఆటో మొబైల్‌, సివిల్‌, నావ‌ల్ ఆర్కిటెక్చర్‌, ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ ప్రొడ‌క్షన్‌, మెట‌ల‌ర్జీ, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, టెలి క‌మ్యూనికేష‌న్‌, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెక‌ట్రానిక్స్‌, కంట్రోల్ ఇంజినీరింగ్ ఏ బ్రాంచ్‌లోనైనా క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత (ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థులైతే 6వ సెమిస్టర్ వ‌ర‌కు, ప్రీ ఫైన‌ల్ విద్యార్థులైతే 4వ సెమిస్టర్ వ‌ర‌కు 60 శాతం మార్కులు ఉండాలి)
వ‌యోప‌రిమితి: ఫైన‌ల్ విద్యార్థులైతే 19-24 ఏళ్లు, ప్రీ ఫైన‌ల్ విద్యార్థులైతే 19 1/2-25 ఏళ్లు
 

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (జీఎస్‌)
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)
 

షార్ట్ స‌ర్వీస్ కమిష‌న్ (స‌బ్ మెరైన్ ఇంజినీరింగ్‌)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో మెకానిక‌ల్ బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)


 

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌