• facebook
  • whatsapp
  • telegram

ఇంగ్లిషు సిల‌బ‌స్ విశ్లేష‌ణ‌

పోటీలో విజయాన్ని నిర్థారించేది ఇంగ్లిష్‌ మార్కులే  కాబ‌ట్టి అభ్యర్థి ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించి ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయాలి. పోస్టు ఏదైనా విజయాన్ని ఖాయం చేసేది ఆంగ్లభాషా పరిజ్ఞానమే! ముఖ్యంగా Tenses మీద ప‌ట్టు సాధిస్తే ఎలాంటి ప్ర‌శ్న‌కైనా సులువుగా స‌మాధానం రాయ‌వ‌చ్చు.

ఇంగ్లిషులో....

Parts of Speech: వాక్యంలో అండర్‌లైన్‌ ఉన్న పదం ఏ భాషాభాగానికి చెందుతుందో గుర్తించమనవచ్చు. లేదా ఆ పదాన్ని మరో భాషాభాగంలోకి మార్చమనవచ్చు. ఇందులో రెండు ప్రశ్నలుంటాయి.

Tenses, Conditional clauses: వాక్యంలో ఇచ్చిన ఖాళీని సరైన క్రియారూపంతో నింపమనడంలో గానీ, ఇచ్చిన నాలుగు వాక్యాల్లో ఏ వాక్యంలో verb సరైనదో గుర్తించమనడంలోకానీ మొత్తం మూడు ప్రశ్నలుంటాయి.

Types of Sentences: Simple, Complex, Compound sentencesమీద ప్రశ్నలుంటాయి. ఇచ్చిన వాక్యం మూడింటిలో దేనికి చెందుతుందో గుర్తించడంలో కానీ, ఒక వాక్యాన్ని ఇంకొక దానిలోకి మార్చడంలోకానీ రెండు ప్రశ్నలుంటాయి.

Phrases and Clauses: Phrasesను Clausesలోకి, Clausesను Phrasesలోకి మార్చడంలోగానీ ఇచ్చిన Phrase/ clause ఏ భాగానికి చెందుతుందో గుర్తించడంలో గానీ 2 మార్కులకు ప్రశ్నలుంటాయి.

Articles: a, an, the, zero article, some లాంటి determinersను వాడడం మీద రెండు ప్రశ్నలుంటాయి.

Prepositions: ఏ పదం ముందు ఏ preposition రావాలి, ఏ పదం తరువాత ఏ ప్రిపొజిషన్‌ వస్తుందనే అంశాల మీద 2 ప్రశ్నలుంటాయి.

Degrees of Comparison: Positive, Comparative, Superlative degreeల్లో ఉన్న వాక్యాన్ని మరో degreeలోకి మార్చమంటారు. 2 ప్రశ్నలుంటాయి.

Direct and Indirect speech: Reporting verb, Reported verbల మీద, ఒక speechను మరో speechలోకి మార్చడం మీద రెండు ప్రశ్నలుంటాయి.

Active and Passive Voice: Change of voice, Omission of agent మీద రెండు ప్రశ్నలుంటాయి.

Comprehension: ఇందులో Prose passage మాత్రమే ఇస్తారు. అవగాహన మీదా, title of passage మీదా ప్రశ్నలుంటాయి.

Vocabulary: Synonyms, antonyms, spelling, phrasal verbs, idioms మీద రెండు మార్కులకు ప్రశ్నలుంటాయి.

Composition: Letter- writing, precisల మీద రెండు ప్రశ్నలుంటాయి.

Methodology: History of English Language, Phonetics, Language skills (LSRW), Different approaches, Methods, Techniques, Lesson planning, curriculum, Evaluationల మీద application orientedగా ప్రశ్నలుంటాయి. స్కూలు అసిస్టెంట్లు, భాషా పండిట్‌లు, పీఈటీ ప్రశ్నపత్రంలో కాంప్రహెన్షన్‌లో 4, మెథడాలజీలో 6 ప్రశ్నలే ఉంటాయి. మొత్తం మీద ఎస్‌జీటీలో కంటే ఐదు ప్రశ్నలు తక్కువ ఉంటాయి.

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌