‣ పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు
ఇంతకుముందు ‘1’తో మొదలయ్యే, ‘1’తో ముగిసే రెండంకెల సంఖ్య ఘనాన్ని కనుక్కునే పద్ధతులను చూశాం. ఇప్పుడు ఏ రెండంకెల సంఖ్యకైనా ఘనం కనుక్కునే పద్ధతి గురించి తెలుసుకుందాం.
రెండంకెల సంఖ్యలున్న 10 నుంచి 99 వరకు ఉన్న ఏ సంఖ్యకైనా ఘనాన్ని తేలికగా కనుక్కోవచ్చు.
మొత్తం నాలుగు స్థానాల్లో సంఖ్యలు రాయాల్సి ఉంటుంది. ఎడమ నుంచి కుడి వైపు రాస్తూ మొదటి స్థానంలో ఇచ్చిన సంఖ్యలో పదుల స్థానంలో ఉన్న అంకె ఘనాన్ని రాయాలి. రెండో స్థానంలో.. పదుల స్థానంలోని అంకె వర్గాన్ని తీసుకుని దానిని ఒకట్ల స్థానంలో ఉన్న అంకెతో గుణించి ఆ ఫలితాన్ని రాయాలి.
మూడో స్థానంలో.. ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె వర్గాన్ని తీసుకుని దాన్ని పదుల స్థానంలోని అంకెతో గుణించి ఆ ఫలితాన్ని ఉంచాలి.
నాలుగో స్థానంలో.. ఒకట్ల స్థానంలోని అంకె ఘనాన్ని రాయాలి.
ఈ నాలుగు స్థానాల్లోని సంఖ్యల్లో మధ్యలో ఉన్న రెండు, మూడో స్థానాల్లోని సంఖ్యలను రెట్టింపు చేసి వాటి కింద అదే క్రమంలో రెండో వరసలో రాయాలి. ఈ రెండు వరుసల్లోని సంఖ్యలను కుడి నుంచి ఎడమ వైపుగా కూడాలి. రెండు వరుసల్లోని సంఖ్యలను కూడగా వచ్చిన ఫలితంలో ఒకట్ల స్థానంలోని అంకెను మాత్రం రాసి మిగిలిన సంఖ్యను తర్వాతి వరుసలోని సంఖ్యల మొత్తానికి కలపాలి. ఈవిధంగా రెండు వరుసల్లోని నాలుగు స్థానాల్లోని సంఖ్యలను కలిపితే జవాబు వస్తుంది.
ఉదాహరణకు 233
నాలుగు స్థానాల్లోని మొదటి స్థానంలో పదుల స్థానంలో 2 ఘనాన్ని రాయాలి.
23 = 8
8
- - - -
రెండో స్థానంలో... పదుల స్థానంలోని ‘2’కు వర్గాన్ని తీసుకుని, దానిని ఒకట్ల స్థానంలోని 3తో గుణించి ఆ ఫలితాన్ని ఉంచాలి.
22 × 3 = 12
8 12
- - - -
మూడో స్థానంలో.. ఒకట్ల స్థానంలోని ‘3’కి వర్గాన్ని తీసుకుని దాన్ని పదుల స్థానంలోని ‘2’తో గుణించి ఆ ఫలితాన్ని ఉంచాలి.
32 × 2 = 18
8 12 18
- - - -
నాలుగో స్థానంలో.. ఒకట్ల స్థానంలోని ‘3’ ఘనాన్ని రాయాలి.
33 = 27
8 12 18 27
- - - -
మధ్యలో ఉన్న 12, 18లను రెట్టింపు చేసి రెండో వరుసలో రాయాలి.
8 12 18 27
24 36
ఈ రెండు వరుసల్లోని సంఖ్యలను కలపాలి.
మరో ఉదాహరణ 343

*************************************
మరింత సమాచారం ... మీ కోసం!