• facebook
  • whatsapp
  • telegram

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఈసారి కట్ఆఫ్ మార్కులెన్ని?

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ  పీఓ, క్లర్క్ పోస్టులకు ఆగస్టులో ప్రలిమ్స్ జరగనున్న తరుణంలో అందరి దృష్టి కట్ఆఫ్పైనే పడింది. ఆయా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారిలో కట్ఆఫ్ ఎంత ఉండొచ్చనే చర్చ మొదలైంది. సాధారణంగా రాష్ట్రాలవారీగా దీన్ని నిర్ణయిస్తారు. పోస్టులు, దరఖాస్తు చేసినవారి సంఖ్యతోపాటు పరీక్షలో ప్రశ్నల సరళిపై ఇది ఆధారపడి ఉంటుంది. గత కట్ఆఫ్లను పరిశీలిస్తే ఈసారి ఎంత ఉంటుందో అంచనాకు రావచ్చు. పీఓ పోస్టులకు సంబంధించి తెలంగాణలో 2018లో 45.25 ఉన్న కట్ఆఫ్ 2019కి వచ్చేసరికి 54 మార్కులు ఉంది. అంటే దాదాపు 9 మార్కుల పెరుగుదల. 2020లో 48.25గా నిర్ణయించారు. 5.75 మార్కులు తగ్గాయి. ఇందుకు పోస్టుల సంఖ్య పెరగడంతోపాటు ప్రశ్నలు కఠినంగా ఉండటమే కార‌ణం. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మంది పోటీ పడతారు. కాబట్టి కట్ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏపీకి సంబంధించి గత పరీక్షలను గమనిస్తే 2018లో 52.50గా ఉన్న కట్ఆఫ్ 2019లో 58.50 మార్కులుగా నిర్ధరించారు. 2020లో 52.75కు తగ్గింది. ఈ ఏడాది ఏపీ, తెలంగాణలో 2-3 మార్కులు కట్ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. 

క్లర్క్ పరీక్షకు గతేడాది మార్కులేనా!

సాధారణంగానే క్లర్క్ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంటుంది. పైగా ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో చాలామందికి అత్యధిక మార్కులు వస్తాయి. అందుకే 80/80 సాధించడంపై దృష్టి పెట్టాలి. కనీసం 75 మార్కులైనా తెచ్చుకోవడం తప్పనిసరి. అప్పుడే పోటీలో నిలబడగలుగుతాం. తెలంగాణలో గతేడాది కట్ఆఫ్ మార్కులను పరిశీలిస్తే 2018లో 67.75గా ఉంది. 2019లో 68.50కి తగ్గింది. ఇక 2020లో 71.25కు పెరిగింది. ఏపీలో 2018లో 72.50గా నిర్ణయించారు. 2019లో 71.50 మార్కులు, 2020లో 76.25 కట్ఆఫ్గా ఉంది. ఈసారి కూడా ఏపీ, తెలంగాణలో గతేడాది కట్ఆఫ్ మాదిరిగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. సన్నద్ధతను ఆపకుండా పరీక్షకు సిద్ధమైతే తప్పకుండా 80 మార్కులు సాధించగలరు. 

Posted Date : 27-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌