• facebook
  • whatsapp
  • telegram

కొత్త‌వి నేర్చుకుంటూ ... సాధ‌న చేసుకుంటూ!

ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

    ఎస్సై ఉద్యోగ పరీక్షలో ఇంగ్లిష్‌ సబ్జెక్టును కనీస అవగాహన కోసం కేటాయించినప్పటికీ అర్హత మార్కులు సాధించనట్లయితే అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మిగతా సబ్జెక్టులతో పాటు ఇంగ్లిష్‌కూ ప్రాధాన్యం ఇవ్వాలి.   

    ఎస్సై పరీక్షకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులను 3 దశల్లో పరీక్షిస్తారు. మొదటి దశలో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) ఉంటుంది. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఇందులో జనరల్‌ స్టడీస్, అరిథ్‌మెటిక్, రీజనింగ్‌లపై ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి రెండో దశలో దేహదారుఢ్య పరీక్షను నిర్వహిస్తారు. మూడో దశలో మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. ఇది 600 మార్కులకు జరుగుతుంది. 

పరీక్ష వివరాలు... 

*     ఇంగ్లిష్‌ భాషపై నైపుణ్యం - 100 మార్కులు

*     తెలుగు భాషపై నైపుణ్యం - 100 మార్కులు

*     జనరల్‌ స్టడీస్‌ - 200 మార్కులు

*     అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ - 200 మార్కులు

    ర్యాంకు కేటాయించడంలో ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకోనప్పటికీ కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్‌ స్టడీస్, అరిథ్‌మెటిక్, రీజనింగ్‌లో స్టేట్‌ టాప్‌ ర్యాంకు మార్కులు వచ్చినా ఇంగ్లిష్‌లో కూడా నిర్దేశిత మార్కులు రావాల్సిందే.  

*     ఎస్సై పరీక్షలో ఇంగ్లిష్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. 

   

    గ్రామర్‌ పార్ట్‌కు సంబంధించి అభ్యర్థులు గ్రామర్‌తో పాటూ ఒకాబ్యులరీ కూడా చదవాలి. గ్రామర్‌లో ఒక టాపిక్‌ చదవడం పూర్తయిన వెంటనే దానిపై ప్రాక్టీస్‌ బిట్స్‌ చేయడం ద్వారా ఆ టాపిక్‌పై పూర్తి అవగాహన కలుగుతుంది.

    గ్రామర్‌లో అన్ని అంశాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 25 మార్కులు ఉంటాయి. ఇందులో 1/4 నెగిటివ్‌ మార్కులు కేటాయించారు. కాబట్టి కచ్చితమైన సమాధానం తెలిస్తేనే గుర్తించాలి. పూర్తిగా అవగాహన లేని ప్రశ్నలకు జవాబు గుర్తించకపోవడమే మంచిది.


గ్రామర్‌    

    1. Articles

    2. Prepositons 

    3. Tenses

    4. Conditions

    5. Parts of speech

    6. Helping verbs usage

    7. Conjunctions

    8. Types of Sentences

    9. Question tag

    10. Active voice and Passive voice

    11. Direct and Indirect speech

    12. Degrees of comparision

    13. Simple, Complex and Compound sentences

    14. Error location

    15. Re arrangement of Sentences

    16. Inserting appropriate words in the blanks

    17. Jumbled Sentences

    18. Functional English

    19. Synonyms

    20. Antonyms

    21. One word substitutions

    22. Idioms and Usage

    23. Phrasel verbs

    24. Spellings

*  మెయిన్‌ పరీక్షలో పైన పేర్కొన్న టాపిక్స్‌ నుంచి 50 ప్రశ్నలను 25 మార్కులకు ఇస్తారు. 

*  డిస్క్రిప్టివ్‌లో 75 మార్కులకు గాను 6 అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

   1. Letter writing

    2. Comprehension passage

    3. Precis writing

    4. Report writing

    5. Essay writing

    6. Expansions

 ఒక్కో ప్రశ్న 10 లేదా 15 మార్కులకు ఉండొచ్చు. ఈ ప్రశ్నలకు మాత్రం నెగటివ్‌ మార్కులు ఉండవు. సరైన ప్రణాళికతో సిద్ధమైతే 100కి 70 మార్కులపైనే సాధించవచ్చు. 

సన్నద్ధతకు సూత్రాలు

1. ప్రతి రోజూ ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్‌ చదవాలి. అందులో ఉండే కొన్ని క్లిష్టమైన పదాలు నోట్‌ చేసుకోవాలి. 

2. చిన్న చిన్న పదాలతో వాక్యనిర్మాణం చేయడం అలవాటు చేసుకోవాలి. వాటిని నిజజీవితంలో ఉపయోగించాలి. 

3. ప్రతి రోజూ కొన్ని కొత్త ఇంగ్లిష్‌ పదాలు నేర్చుకొని వాటిని వాక్యాల్లో ఉపయోగించాలి. 

4. గ్రామర్‌లో ఒక్కో టాపిక్‌ బాగా చదివి ప్రాక్టీస్‌ బిట్స్‌ సాధన చేయాలి. ప్రశ్న అడిగే విధానం కోసం ప్రీవియస్‌ పేపర్లు పరిశీలించాలి. 

5. ఇంగ్లిష్‌ డిక్షనరీ దగ్గర పెట్టుకొని రిఫర్‌ చేస్తూ ఉండాలి.  

రిఫ‌రెన్స్ బుక్స్‌

1. Objective General english (S.Chand Publications)

2. General english (Arihant Publications)

3. English Grammar (Paramount Publications)


Kurabalakota Venkata Ramana 

Posted Date : 09-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌