• facebook
  • whatsapp
  • telegram

పదసంపదపై పెరుగుతున్న ప్రశ్నలు

కానిస్టేబుల్స్‌ - ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌ 

 

 

తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత 2016, 2019లో జరిగిన ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం 200 మార్కులు ఉండగా అందులో 10 శాతం ప్రశ్నలు జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచే వచ్చాయి. అయితే 2014కు ముందు జరిగిన పరీక్షల్లోనూ 20 శాతం అంటే మొత్తం 40 ప్రశ్నలు అడిగారు. 
 

2014 తర్వాత జరిగిన కానిస్టేబుల్‌ పరీక్షలను గమనించినట్లయితే ఇంగ్లిష్‌లో 15 అంశాలపై పట్టు సాధించాలి. కాంప్రహెన్షన్, ప్యాసెజ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్స్, క్వశ్చ్యన్‌ టాగ్, ఆక్టివ్‌ అండ్‌ పాసివ్‌వాయిస్, డైరెక్ట్‌ స్పీచ్‌ అండ్‌ ఇండైరెక్ట్‌ స్పీచ్‌ అనేవి గ్రామర్‌ టాపిక్స్‌లో ముఖ్యమైనవి. వీటిపై పూర్తి అవగాహనతో ప్రాక్టీస్‌ బిట్లు చేయగలిగితే జనరల్‌ ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించవచ్చు.

 

ఒకాబ్యులరీలో సినానియమ్స్, ఆంటోనియమ్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రెజెల్‌వర్బ్స్, స్పెల్లింగ్స్‌ లాంటి అంశాలపై ప్రశ్నలు క్లిష్టంగా వస్తున్నాయి. కాబట్టి వీటిపై పట్టు సాధించడం కీలకం. ఒక రిక్రూట్‌మెంట్‌కు మరో రిక్రూట్‌మెంట్‌కు క్లిష్టత స్థాయి బాగా పెరుగుతోంది.

 

ఒకాబ్యులరీపై పట్టు సాధించడం ఎలా....

పోలీస్‌ పరీక్షల్లో ఒకాబ్యులరీ నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య పెరుగుతుండటంతో పాటు, ప్రశ్నల స్థాయి కూడా మారుతోంది. కాబట్టి ప్రతిరోజూ కొన్ని కొత్త పదాలను నేర్చుకోవాలి. మొదట్లో ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్స్‌లో చిన్న చిన్న న్యూస్‌ ఐటెమ్స్‌ చదవాలి. అర్థం కాని న్యూస్‌ను రెండోసారి చదవడం వల్ల ఆ విషయంపై మరింత అవగాహన పెరుగుతుంది. కొన్ని రూట్‌ వర్డ్స్‌ నేర్చుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పదాలపై పట్టు సాధించవచ్చు. ఆ పదాలు ఎలా ఏర్పడుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. 

ఉదా: 1. 
 

Monopoly   =  ఒక్కరు చేసే వ్యాపారం

Monogamy =  ఒకే భార్య/ఒకే భర్తను కలిగి ఉండటం 

Mono action = ఒక్కరే చేసే పని

Monolith =  ఏకశిలా విగ్రహం

Monotheist = ఏకేశ్వరారాధకుడు (ఒకే దేవుడిని నమ్మే వ్యక్తి)

Uniform = ఒకే రూపం

University = విశ్వవిద్యాలయం

పై పదాలన్నీ ఒకటి అనే అర్థాన్ని తెలియజేస్తున్నాయి.  

 

Binary = ఇద్దరు భార్యలు/ఇద్దరు భర్తలను కలిగి ఉండటం

Bifurcate = రెండుగా విభజన

Bilingual = ద్విభాష

Bisector  = ద్విఖండన

Bicameral = ద్విసభలు

Bilateral relations = ద్వైపాక్షిక సంబంధాలు

Biped = రెండు కాళ్లు గల జీవి

Ambidextrous = సవ్యసాచి (రెండు చేతులతో రాసే వ్యక్తి)

Amphibian = ఉభయ చరజీవి

పైన పేర్కొన్న విధంగా కొన్ని రూట్‌ వర్డ్స్‌పై పట్టు సాధిస్తే వాటితో ప్రారంభమయ్యే అనేక పదాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు. జనరల్‌ ఇంగ్లిష్‌లో ఒకాబ్యులరీ స్థాయి ప్రతి పరీక్షలో పెరుగుతుండటం వల్ల రూట్‌ వర్డ్స్‌ అయిన ప్రిఫిక్స్, సఫిక్స్‌లను ఎక్కువగా నేర్చుకోవాలి. ఒక్కో రూట్‌ వర్డ్‌ నుంచి 10 - 30 పదాలు నేర్చుకోవచ్చు. ప్రిఫిక్స్, సఫిక్స్‌లు నేర్చుకున్న తర్వాతే వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్‌పై దృష్టి సారించాలి. 

స్పెల్లింగ్స్‌పై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కష్టంగా ఉండే స్పెల్లింగ్స్‌ సులువుగా గుర్తుంచుకోవాలంటే ఆ పదాలను పేపర్‌పై ఎక్కువ సార్లు రాయాలి. ఉదాహరణకు commission, comision, commition, cammission  అని ఇచ్చి వాటిలో సరైన స్పెల్లింగ్‌  ఏది అని అడుగుతారు.             

 

కొన్ని పదాలు

ambassador, anchor, alcohol, accommodate, audience, bureau, battalion, barrier, billion, barrack,  commander, courier, cylinder, councilor, commission

 

* పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో ఇంగ్లిష్‌ సిలబస్‌ (గత ప్రశ్నపత్రాల ఆధారంగా)

1. Article

2. Prepositions

3. Tenses

4. Active voice and Passive voice

5. Direct Speech and Indirect Speech

6. Degrees of comparision

7. Simple, Complex and Compound sentences

8. Correction of sentences

9. Re arrangement of sentences

10. Jumbled sentences

11. Functional English

12. Question tag

13. Synonyms

14. Antonyms

15. Spellings

16. Idioms

17. Phrasal verbs

18. One word substitutions

19. Choose appropriate words in the blanks

20. Comprehension passage    

కానిస్టేబుల్‌ పరీక్షలో 20కి 20 మార్కులు సాధించాలంటే పైన పేర్కొన్న అంశాలన్నింటినీ బాగా అర్థం చేసుకొని వాటిపై వీలైనన్ని ప్రాక్టీస్‌ బిట్సు చేయాలి. 

పాత ప్రశ్నపత్రాల్లోని బిట్లను ఎక్కువగా సాధన చేయడం వల్ల ఏ చాప్టర్‌ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒక అవగాహన ఏర్పడుతుంది.

 

రిఫ‌రెన్స్ బుక్స్‌

1. Objective General english (S.Chand Publications)

2. General english (Arihant Publications)

3. English Grammar (Paramount Publications)

Kurabalakota Venkata Ramana 
 

Posted Date : 18-12-2020

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌