• facebook
  • whatsapp
  • telegram

వేగంగా.. హెచ్చవేయంగా!

‣ పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు

ఇంతకుముందు కూడిక, తీసివేతలు తేలికగా చేయగలిగే స్పీడ్‌ మ్యాథ్స్‌ పద్ధతులను నేర్చుకున్నాం. ఈవారం హెచ్చవేతలను (గుణకారాలు) తక్కువ సమయంలో ఎలా చేయాలో చూద్దాం!

బేస్‌ నంబర్‌ పద్ధతి

ఈ పద్ధతిలో గుణకారం చేసే రెండు సంఖ్యలకు దగ్గరలో ఉన్న ఒక పూర్తి సంఖ్యను ‘బేస్‌ నంబర్‌’గా తీసుకోవాలి. గుణకారం చేసే రెండు సంఖ్యలలో ఒక దానికంటే ఎక్కువ/ తక్కువ ఉన్న సంఖ్యను మిగిలిన సంఖ్యకు కలపాలి. ఆ సంఖ్యను బేస్‌ నంబర్‌తో గుణించాలి. ఆ ఫలితానికి ఇచ్చిన సంఖ్యలు బేస్‌ నంబర్‌కు ఎంత ఎక్కువ లేదా తక్కువగా ఉన్నాయో వాటి గుణిజాన్ని కలిపితే జవాబు వస్తుంది. 

ఈ పద్ధతిని బేస్‌ నంబర్‌ కంటే ఇచ్చిన రెండు సంఖ్యలూ ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు లేదా ఒకటి ఎక్కువ మరోటి తక్కువగా ఉన్నప్పుడూ ఉపయోగించవచ్చు. 

బేస్‌ నంబర్‌ కంటే ఎక్కువగా ఉంటే: 

14×13 

ఇచ్చిన సంఖ్యలు 14, 13 ‘10’ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ‘10’ ని ‘బేస్‌ నంబర్‌’గా తీసుకోవాలి. 

14, 13లు బేస్‌ నంబర్‌ 10 కంటే 4, 3 ఎక్కువ ఉన్నాయి. వాటిని ఆయా సంఖ్యలపైన రాయాలి. 

ఆ తర్వాత మొదటి సంఖ్య 14కు రెండో సంఖ్య బేస్‌ నంబర్‌ కూడా ఎక్కువ ఉన్న 3ను కలపాలి. లేదా రెండో సంఖ్య 13కు మొదటి సంఖ్య బేస్‌ నంబర్‌ కంటే ఎక్కువ ఉన్న ‘4’ను కలపాలి. రెండింటిలో ఒకే ఫలితం 17 (14+3 లేదా 13+4) వస్తుంది.

దీన్ని బేస్‌ నంబర్‌తో గుణించాలి. 

17×10 = 170

ఈ ఫలితానికి ఇచ్చిన సంఖ్యలు బేస్‌ నంబర్‌కు ఎక్కువ ఉన్న +4, +3ల లబ్దాన్ని కలిపితే జవాబు వస్తుంది. 

(+4) × (+3) = +12

170 + 12 = 182

బేస్‌ నంబర్‌ కంటే తక్కువ ఉంటే: 

16×18

ఈ సంఖ్యలు రెండూ 10 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ 20 కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ‘20’ని బేస్‌ నంబర్‌గా తీసుకోవాలి. 

16, 18లు బేస్‌ నంబర్‌ ‘20’ కంటే 4, 2లు తక్కువగా ఉన్నాయి. వాటిని ఆయా సంఖ్యల కింద ‘’ గుర్తుతో రాయాలి. 

తర్వాత మొదటి సంఖ్య 16 నుంచి రెండో సంఖ్య బేస్‌ నంబర్‌ కంటే తక్కువ ఉన్న ( 2) ను తీసివేయాలి. లేదా రెండో సంఖ్య 18 నుంచి మొదటి సంఖ్య బేస్‌ నంబర్‌ కంటే తక్కువ ఉన్న 4ను తీసివేయాలి. రెండింటిలోని ఒకే ఫలితం (16 2=14 లేదా 18 4=14) వస్తుంది. 

దీన్ని బేస్‌ నంబర్‌ ‘20’ తో గుణించాలి.

14×20 = 280

ఈ ఫలితానికి ఇచ్చిన సంఖ్యలు బేస్‌ నంబర్‌ కంటే తక్కువ ఉన్న సంఖ్యల లబ్దాన్ని కలిపితే.. (4)× (2) = +8

280 + 8= 288 జవాబు.

దీన్ని ‘10’ బేస్‌తో చేసినా ఇదే జవాబు వస్తుంది. 

Posted Date : 28-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌