• facebook
  • whatsapp
  • telegram

గుణించాలా? తీసివేస్తే సరి!

పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు

బ్యాంకు నియామక పరీక్షల్లో, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఏవైనా సంఖ్యలను ‘9’ లేదా ‘99’ తో గుణించమని తరచుగా అడుగుతుంటారు. స్పీడ్‌ మ్యాథ్స్‌ పద్ధతులను నేర్చుకుంటే ఇలాంటి హెచ్చవేతలను వేగంగా, సులువుగా చేయొచ్చు. అలాంటి గుణకార పద్ధతులను ఈ వారం తెలుసుకుందాం.

ఏదైనా సంఖ్యను ‘9’తో గుణించడం

ముందుగా ఇచ్చిన ఏదైనా సంఖ్యకు చివరలో ‘0’ ఉంచాలి. అపై ఆ సంఖ్యలో నుంచి ఇచ్చిన సంఖ్యను తీసివేయాలి. అప్పుడు వచ్చిన ఫలితమే జవాబు. 

ఉదాహరణకు: 38 × 9

ఇచ్చిన సంఖ్య 38కి చివరలో ‘0’ ఉంచితే అప్పుడది 380 అవుతుంది. దీనిలో నుంచి ఇచ్చిన సంఖ్యను తీసివేయాలి. 380-38 = 342 జవాబు అవుతుంది. 

ఈ పద్ధతిలో ఎన్ని అంకెల సంఖ్యనైనా ‘9’తో తేలికగా గుణించవచ్చు. 

ఏదైనా సంఖ్యను 99తో గుణించడం

ఈ పద్ధతి కూడా ‘9’ తో గుణించే పద్ధతినే పోలి ఉంటుంది. ఈ పద్ధతిలో ముందుగా ఇచ్చిన సంఖ్యకు చివరలో రెండు సున్నాలు ఉంచాలి. ఈ తర్వాత ఆ సంఖ్య నుంచి ఇచ్చిన సంఖ్యను తీసివేస్తే వచ్చే ఫలితమే జవాబు!  

ఉదాహరణకు: 237 × 99

ఇచ్చిన సంఖ్య ‘237’కు చివరలో రెండు ‘00’ ఉంచాలి. అప్పుడు అది 23700 అవుతుంది. ఆపై దీనిలో నుంచి ఇచ్చిన సంఖ్య 237ను తీసివేయాలి. 

23700 - 237 = 23463 జవాబు అవుతుంది. 

237 × 99 = 23463.

ఈ పద్ధతిలో కూడా ఎన్ని అంకెల సంఖ్యనైనా చాలా తేలికగా ‘99’ తో గుణించవచ్చు. 

ఏదైనా సంఖ్యను ‘999’తో గుణించడం

ఈ పద్ధతి కూడా ‘9’, ‘99’ లతో గుణించే పద్ధతినే పోలి ఉంటుంది. దీనిలో ఇచ్చిన సంఖ్యకు చివరలో మూడు సున్నాలు ఉంచాలి. ఆ తర్వాత ఆ సంఖ్య నుంచి ఇచ్చిన సంఖ్యను తీసివేస్తే వచ్చే ఫలితమే జవాబు అవుతుంది. 

ఉదాహరణకు: 2698 × 999

ఇచ్చిన సంఖ్య 2698కు చివరగా మూడు ‘000’ ఉంచితే అప్పుడది 2698000 అవుతుంది. దీనిలో నుంచి ఇచ్చిన సంఖ్య 2698ను తీసివేయాలి. 

2698000 - 2698  

2695302 జవాబు అవుతుంది.

ఈ పద్ధతులన్నింటినీ గమనించినప్పుడు ఏదైనా ఇచ్చిన సంఖ్యను సంఖ్యలో అన్ని అంకెలూ ‘9’లే ఉన్నప్పుడు (9, 99, 999, 9999..) తేలికగా గుణించే పద్ధతి అని అవగతమవుతుంది.

ముందుగా మనం ఏ సంఖ్యతోనైతే గుణిస్తున్నామో... దానిలో ఎన్ని ‘9’లు ఉన్నాయో చూసి ఇచ్చిన సంఖ్య చివరలో అన్ని సున్నాలు ఉంచాలి. ఆపై ఆ సంఖ్య నుంచి ఇచ్చిన సంఖ్యను తీసివేస్తే జవాబు వస్తుంది. అంటే ఇచ్చిన సంఖ్యను 9, 99, 999, 9999, .... లతో గుణించేటప్పుడు ఇచ్చిన సంఖ్య చివరలో వరుసగా 0, 00, 000, 0000, ..ఉంచి దానిలో నుంచి ఇచ్చిన సంఖ్యను తీసివేయాలి. ఈ పద్ధతిని పాటిస్తే సాంప్రదాయిక పద్ధతిలో కంటే వేగంగా జవాబు వస్తుంది.


 

Posted Date : 26-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌