• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర బోధన లక్ష్యాలు

* తరగతిలో విద్యార్థుల ప్రవర్తనను మార్చడం బోధన ముఖ్య ఉద్దేశం.
* విద్యార్థుల ప్రవర్తనలో తీసుకురావాల్సిన  మార్పులను లక్ష్యాలు అంటారు.
* గమ్యాలు దీర్ఘకాలికమైనవి. ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించినవి. ఉద్దేశాలు నియమితమైనవి గమ్యాల కంటే నిర్దిష్టమైనవి, లక్ష్యాలు ఉద్దేశాల కంటే ఎక్కువ నిర్దిష్టమైనవి. - జె.కె. సూద్


                                                                                                                                       

* బోధన, మూల్యాంకనాలకు ఆధారం లక్ష్యాలు.
* లక్ష్యాలు విద్యార్థుల్లో రావాల్సిన ప్రవర్తనా మార్పులను సూచిస్తాయి.
* సెంకడరీ స్థాయిలో విజ్ఞానశాస్త్ర బోధన మేధస్సుకు సంబంధించిందిగా, ఉన్నత విద్యకు సిద్ధపరిచేదిగా ఉండాలని కొఠారీ కమీషన్ సూచించింది.
* బోధన జరిగిన తర్వాత విద్యార్థుల ప్రవర్తనలో ఆశించిన ఫలితాలను బోధనా లక్ష్యాలు/ప్రవర్తనా లక్ష్యాలు అంటారు.
* లక్ష్యాలు బోధన పద్ధతిని లేదా పాఠ్యాంశాన్ని గురించి చర్చించవు. ఇవి కేవలం 'అభ్యసనా ఫలితాలు'.
* బోధనా లక్ష్యాల విపులీకరణం - స్పష్టీకరణం.
* స్పష్టీకరణలు విద్యార్థిలో ఎలాంటి జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు పెంపొందాయో తెలుపుతాయి. అందుకే వీటిని 'నిర్దిష్ట అభ్యసనా ఫలితాలు' అంటారు.

 

స్పష్టీకరణలో రెండు భాగాలు ఉంటాయి.
1) పరివర్తన
2) విషయం
* బోధనా లక్ష్యాలను శాస్త్రీయంగా వర్గీకరణ చేసిన విద్యావేత్త బి.ఎస్. బ్లూమ్
* జ్ఞానరంగంలో నిమ్నదశ - జ్ఞానం

   అత్యున్నత దశ - మూల్యాంకనం
* భావావేశ రంగంలో నిమ్నదశ - గ్రహించడం
   అత్యున్నత దశ - శీలస్థాపనం
* మానసిక రంగంలో నిమ్నదశ - అనుకరణ
   అత్యున్నత దశ - సహజీకరణం

 

* NCERT వారు బి.ఎస్. బ్లూమ్ టాక్సానమీ ఆధారంగా మొత్తం 7 లక్ష్యాలను రూపొందించారు
జ్ఞానరంగం నుంచి - జ్ఞానం, అవగాహన, వినియోగం
భావావేశ రంగం నుంచి - అభిరుచి, వైఖరి, అభినందన లేదా ప్రశంస
మానసిక చలనాత్మక రంగం నుంచి - నైపుణ్యం
* ఈ లక్ష్యాలను మరో రకంగా వర్గీకరించారు.
     ఎ) స్వల్పకాల లక్ష్యాలు - జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం
     బి) దీర్ఘకాలిక లక్ష్యాలు - అభిరుచి, వైఖరి, అభినందన
* దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం కష్టం.
* స్వల్పకాల లక్ష్యాలను చాలా సులువుగా సాధించవచ్చు.

 

భౌతిక, రసాయనశాస్త్ర బోధన లక్ష్యాలు - స్పష్టీకరణలు
విద్యార్థిలో ఎలాంటి జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు పెంపొందాయో తెలుపుతాయి. అందుకే వీటిని నిర్దిష్ట అభ్యసన ఫలితాలు అని కూడా అంటారు. ఇవి పరిశీలించే, కొలవగల నిర్దిష్ట ప్రవర్తనలు.

 

1. జ్ఞానం: విద్యార్థి విజ్ఞానశాస్త్ర పదాలు, యథార్థాలు, భావనలు, సూత్రాలు సంకేతాలను గురించి జ్ఞానం పొందుతాడు.

స్పష్టీకరణలు: శాస్త్ర పదాలు, భావనలు, సూత్రాలు గుర్తుచేసుకుంటారు.
ఉదా: విద్యార్థి అదిశ, సదిశ రాశులు; ప్రాథమిక, ఉత్పన్న రాశులు; వడి, వేగం లాంటి పదాలను గుర్తుచేసుకుంటాడు.

 

2. అవగాహన: విద్యార్థి శాస్త్రీయ పదాలు, భావనలు, యథార్థాలు, సూత్రాలను, దృగ్విషయాలను అవగాహన చేసుకుంటాడు.
* విద్యార్థి సమీప సంబంధం ఉన్న పదాలు, భావనల మధ్య భేదాలను గుర్తిస్తాడు.
ఉదా: కుంభాకార కటకం, పుటాకార కటకం మధ్య తేడాలను గుర్తిస్తాడు.
* విద్యార్థి శాస్త్ర విధానాలు, వస్తువులు, పదార్థాలను వర్గీకరిస్తాడు.
* శాస్త్ర సిద్ధాంతాలు, భావనలు, ప్రక్రియలకు ఉదాహరణలు ఇస్తాడు.
* శాస్త్ర భావనలు, ప్రక్రియల మధ్య ఉండే సంబంధాలను గుర్తిస్తాడు.
* శాస్త్ర ప్రయోగాల అమరిక, సర్క్యూట్‌ల ప్రక్రియలు లాంటి వాటిలో దోషాలను కనుక్కుంటాడు.
* పదాలు, గుర్తులు, సమీకరణాల్లో; పదాలను సంకేతాల్లోకి, సంకేతాలను పదాల్లోకి అనువదిస్తారు.
* విద్యార్థి భౌతికశాస్త్ర భావనలు, సిద్ధాంతాలను వివరిస్తాడు.

 

3. వినియోగం: విద్యార్థి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని, పొందిన అవగాహనను నూతన, పరిచయం లేని పరిస్థితుల్లోకి అన్వయిస్తాడు.
* విద్యార్థి సమస్యలను విశ్లేషిస్తాడు.
* విద్యార్థి దత్తాంశాల నుంచి పరికల్పనను రూపొందిస్తాడు.
* సంభవించే శాస్త్రీయ సంఘటనలను ఊహిస్తాడు.
* శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలను పేర్కొంటాడు.
* విద్యార్థి పరికల్పనను పరీక్షించడానికి తగిన ప్రయోగ పద్ధతులను రూపొందిస్తాడు.


4. నైపుణ్యాలు
* విద్యార్థి పరిశీలన, హస్తలాఘవం, చిత్రలేఖనం, నివేదన నైపుణ్యాలను పొందుతాడు.


స్పష్టీకరణలు

పరిశీలనా నైపుణ్యం:
* పరికరాల్లో రీడింగ్‌లను సరిగ్గా నమోదు చేయడం.
* పరిమాణాలను సరిగ్గా కొలవడం.
* గ్రాఫ్‌లను పరిశీలించడం.

హస్తలాఘవ నైపుణ్యం:
* సరైన పరికరాలను ఎన్నుకుంటాడు.
* పరికరాలను క్రమపద్ధతిలో అమరుస్తాడు.
* ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేస్తాడు.

చిత్రలేఖన నైపుణ్యం:
* విద్యార్థి చిత్రాలను చక్కగా గీస్తాడు.
* తగిన వేగంతో గీస్తాడు.
* చిత్ర భాగాలను గుర్తిస్తాడు.

నివేదన నైపుణ్యం:
* విద్యార్థి పరిశీలనలను తగిన విధానం, వరుసక్రమంలో సమర్పిస్తాడు.
* లెక్కలను, ఫలితాలను తగిన యూనిట్లలో తెలియజేస్తాడు.

 

5. అభినందన
* విద్యార్థి శాస్త్ర ఆవిష్కరణలు, పరిశోధనలు, శాస్త్రజ్ఞులు చేసిన సేవలను కొనియాడతాడు.


స్పష్టీకరణలు:
* సంఘం మీద, వ్యక్తి జీవన శైలి మీద శాస్త్ర ప్రభావాన్ని గమనించి సర్దుకుపోతాడు. శాస్త్ర ప్రగతి నుంచి ఆహ్లాదాన్ని పొందుతాడు. శాస్త్రవేత్తల పట్ల గౌరవం, అభిమానం; శాస్త్రీయ పరిశోధనల పట్ల ఆసక్తి కనబరుస్తాడు.
 

6. అభిరుచి
* విజ్ఞానశాస్త్ర ప్రపంచం మీద అభిరుచిని పెంపొందించుకోవడం.
స్పష్టీకరణలు:
* చర్చలో పాల్గొంటాడు. తీరిక సమయాల్లో శాస్త్ర సంబంధమైన అలవాట్లను కలిగి ఉంటాడు.

 

7. శాస్త్రీయ వైఖరి
* నమ్రత, నిజాయతీ కలిగి ఉంటాడు.
* పరిశీలనలను నిజాయతీతో రికార్డు చేస్తాడు.
* ఫలితం - కారణాల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తిస్తాడు.
* శాస్త్ర ప్రయోగాలను పట్టుదలతో చేస్తాడు.
* నిగర్విగా ఉంటాడు.

 

బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఉపయోగాలు
1) విద్యా ప్రణాళికను రూపొందించడం
2) అనేక రకాల బోధనా పద్ధతులు, ఉపగమాలను ఎన్నుకోవడం.
3) విద్యార్థి కేంద్ర బోధనా పద్ధతులను మనో విజ్ఞానశాస్త్ర సూత్రాల ఆధారంగా అమలు చేయడం.
4) వార్షిక యూనిట్, పాఠ్యపథకాలను తయారు చేయడం.
5) రెమీడియల్ టీచింగ్
* మూల్యాంకనం తరువాత విద్యార్థుల్లోని బలహీనతలను గుర్తించి, వారిలో ఆశించే ప్రవర్తనా మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.


పరిమితులు:
* ఆర్నెల్‌ వాదం ప్రకారం 'ప్రస్తుత విలువల వర్గీకరణ అసంతృప్తికరంగా లేదు. మరింత క్షుణ్ణమైన రీతిలో ఆయా పాఠ్య విషయాల భావనలను పరిశీలించి, పునర్‌వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది'.
* జాక్సన్ ప్రకారం పాఠ్యపథకం తయారీలో లక్ష్య సాధన కంటే విద్యార్థుల భాగస్వామ్యం ముఖ్యం. లక్ష్యాలు ఉపాధ్యాయుడి స్వేచ్ఛను అరికడతాయి. వివరణాత్మక బోధనా విధానాన్ని రూపొందించడంలో * స్పష్టీకరణలు కొంత ఇబ్బందిని కలగజేస్తాయి. తరగతి వాతావరణం కూడా కృత్రిమం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు తన సృజనశీలతను వ్యక్తం చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది.

లెవ్‌టమ్, కెల్లీ విమర్శలు
బ్లూమ్ వర్గీకరణ కృత్రిమమైంది. ఎందుకంటే జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలు మూడు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. స్కేలుతో విభజించలేనివి. బ్లూమ్ ప్రతిపాదించిన ఉన్నతస్థాయి లక్ష్యాలతో సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనాలను రూపొందించడం కష్టం.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌