• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర చరిత్ర అభివృద్ధి

* 'నియాండర్తల్' ప్రాచీన శిలాయుగానికి చెందిన పురాతన మానవుడు.
* బాబిలోనియన్లు విశ్వసించిన ప్రాకల్పనల ఆధారంగా 'జ్యోతిష్యం' అనే సిద్ధాంతం అభివృద్ధి చెందింది.
* భూగోళ శాస్త్రంలో అనాసక్తి గల నాగరికత ఈజిప్టు నాగరికత.
* 365 రోజుల క్యాలెండర్, సౌర గడియారం, నీటి గడియారాన్ని ఈజిప్షియన్లు తయారు చేశారు.
* సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రం గ్రీకుల కాలంలో అభివృద్ధి చెందింది.
* 'ఆల్కెమి' అలెగ్జాండ్రియన్ కాలంలో ఆవిర్భవించింది.
* చరకుడు మూత్రకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల గురించి 'చరక సంహిత' అనే గ్రంథంలో తెలియజేశాడు.
* రుగ్వేదంలో 30 రోజులున్న 12 నెలలను ఒక సంవత్సరంగా తెలియజేశారు.
* చంద్రుడి చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి 'యజుర్వేదం'లో వివరించారు.
* ఆచార్య నాగార్జునుడు 'రసరత్నాకర' గ్రంథంలో డిస్టిలేషన్, ఎక్స్‌ట్రాక్షన్, సబ్లిమేషన్ గురించి వివరించాడు.
* భారతదేశంలో రెండు రకాలైన పాఠశాలలు ఉండాలని 'సార్జెంట్ నివేదిక' సూచించింది.
* నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (2000) సంస్థ శాస్త్రీయ, కంప్యూటర్ అక్షరాస్యతను ఇంటర్నెట్ ద్వారా అందరికీ అందించాలనే లక్ష్యాలను నిర్ణయించింది.

 

ఆర్యభట్ట
* ఆర్యభట్ట క్రీ.శ.476లో కేరళలోని కుసుమపురంలో జన్మించారు.
రచనలు: ఆర్యభట్టీయం, ఆర్యభట్ట సిద్ధాంతం అనే గ్రంథాలను రచించాడు.
పరిశోధనలు: Π విలువను కనుక్కున్నాడు. బీజగణితాన్ని ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త.

 

భాస్కరాచార్యుడు
* భాస్కరాచార్యుడు క్రీ.శ.114లో కర్ణాటకలోని బీజాపూరు ప్రాంతానికి చెందిన 'బిజ్జదబిడ'లో జన్మించాడు.
రచనలు: సిద్ధాంత శిరోమణి, కరణకుతూహలం అనే గ్రంథాలను రచించాడు.
పరిశోధనలు: ఏ సంఖ్యనైనా సున్నాతో భాగిస్తే ఫలితం అనంతమని తెలియజేశాడు. చక్రీయ/చక్రవాళ పద్ధతిని, ప్రస్తారాలు - సంయోగాలు, త్రికోణమితి లాంటి వాటిని కనుక్కున్నాడు.
* క్రీ.శ.1185లో ఉజ్జయినిలో మరణించాడు.

 

అరిస్టాటిల్
* అరిస్టాటిల్ క్రీ.పూ.384లో ఈజిప్టులోని స్టాగిరాలో జన్మించాడు.
రచనలు: డి ఎనిమా, ఎథిక్స్, ఆర్గనాన్, పాలిటిక్స్.
పరిశోధనలు: జీవజాతులను వర్గీకరించాడు. భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశాడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు.
* అరిస్టాటిల్ క్రీ.పూ.222లో మరణించాడు.

 

న్యూటన్
* న్యూటన్ 1642, డిసెంబరు 25న ఇంగ్లండ్‌లో జన్మించాడు.
రచనలు: ప్రిన్సిపియా మ్యాథమెటికా, ఆప్టిక్స్ ఆన్ మోషన్.
పరిశోధనలు: గాలిమర, సన్‌డయల్, నీటి గడియారం, పరావర్తన దూర దర్శినులను కనుక్కున్నాడు. కాంతి మీద అనేక ప్రయోగాలను చేశాడు.
* న్యూటన్ 1727లో మరణించాడు.

 

ఐన్‌స్టీన్
* ఐన్‌స్టీన్ 1879, మార్చి 14న జర్మనీలోని ఉల్మ్‌లో జన్మించాడు.
పరిశోధనలు: E = mc2, క్వాంటం సిద్ధాంతం, ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్.
మరణం: ఐన్‌స్టీన్ 1955, ఏప్రిల్ 18న మరణించాడు.

 

కోపర్నికస్
* కోపర్నికస్ క్రీ.శ. 1473లో పోలండ్‌లోని థార్నే గ్రామంలో జన్మించాడు.
రచనలు: కోపర్నికస్ కొమ్మెంటరాయిలస్, ది రివల్యూషన్ ఆఫ్ ది హెవన్లీ స్పియర్, ఎట్రీటైజ్ ఆన్ కరెన్సీ.
పరిశోధనలు: సూర్యకేంద్రక సిద్ధాంతం, సంవత్సరం అవధిని నిర్ధారించాడు.
* కోపర్నికస్ 1543, మే 24న మరణించాడు.

 

సి.వి. రామన్ 
* సి.వి. రామన్ 1888, నవంబరు 7న తమిళనాడులోని తిరుచునాపల్లిలో జన్మించాడు.
రచనలు: రామన్ ఎఫెక్ట్
పరిశోధనలు: సంగీత వాయిద్యాల సిద్ధాంతంపై పరిశోధనలు చేశాడు.
* సి.వి. రామన్ 1970, నవంబరు 20న మరణించాడు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌