• facebook
  • whatsapp
  • telegram

నవీన చోళులు

సముద్రంతో ఆటలాడుతూ యుద్ధాలు గెలిచారు!


 


మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో కావేరీ నది పరీవాహక ప్రాంతం కేంద్రంగా విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత చోళులకే దక్కుతుంది. వారు ఆర్థికంగా, సైనికపరంగా, సాంస్కృతికంగా ఎంతో వైభవాన్ని సాధించారు. పటిష్టమైన నౌకాదళంతో జైత్రయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని శ్రీలంక, మాల్దీవుల వరకు విస్తరించారు. మధ్యలో పతన దశను చూసి, ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో చోళ పాలనను పునరుద్ధరించారు. తంజావూర్‌ను నిర్మించి రాజధానిగా అభివృద్ధి చేశారు. చోళుల ఉచ్ఛ దశ, నాటి సామాజిక, రాజకీయ   పరిస్థితులు, పరిపాలనా విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. నవీన చోళ రాజుల్లో సమర్థులైన పాలకులు, వారి విజయాలు, కట్టించిన ఆలయాలు, సంబంధిత శాసనాధారాల గురించి అవగాహన పెంచుకోవాలి.


1.    కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

1) నవీన చోళ వంశస్థాపకుడు విజయాలయుడు.

2) ఇతడి బిరుదు - రాజకేసరి.

3) నవీన చోళులను విజయాలయ చోళులు అని పిలుస్తారు.

4) వీరి రాజధాని మధురై.


2.     విజయాలయుడు నిర్మించిన ‘నిషంబ సూదిని’ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది?

1) మధురై     2) మధుర 

3) తంజావూరు     4) కడలూరు


3.     ఎవరి పరిపాలనా కాలంలో తంజావూరు చోళుల రాజధానిగా మారింది?

1) విజయాలయుడు     2) ఆదిత్య చోళుడు 

3) పరాంతక చోళుడు     4) మొదటి రాజరాజు 


4.     ‘ఉత్తర మేరూర్‌ శాసనం’ ఏ జిల్లాలో ఉంది?

1) చంగల్‌పట్టు     2) కాంచీపురం 

3) ధర్మపురి     4) కడలూరు


5.     మొదటి రాజరాజు అసలు పేరు?

1) ఆదిత్య చోళుడు      2) పొన్నియన్‌ సెల్వన్‌ 

3) అరుమోలి వర్మన్‌     4) రెండో పరాంతకుడు


6.     మొదటి రాజరాజు చివరి ఆక్రమణ ఏది?    

1) శ్రీలంక ఆక్రమణ           2) ఉత్తర భారత్‌ ఆక్రమణ  

3) మాల్దీవుల ఆక్రమణ     4) కేరళ ఆక్రమణ


7.     చూడామణి బౌద్ధవిహారానికి ‘అనైమంగళం’ అనే గ్రామాన్ని దానం చేసిన చోళరాజు?

1) రాజేంద్ర చోళుడు     2) మొదటి రాజరాజు  

3) సుందర చోళుడు     4) పరాంతక చోళుడు


8.     కిందివాటిలో మొదటి రాజేంద్ర చోళుడి బిరుదు కానిది?

1) గంగై కొండ     2) కడారం కొండ 

3) పండిత చోళ     4) మధురై కొండ


9.     బృహదీశ్వర ఆలయం పూర్తిచేసిన సంవత్సరం?

1) క్రీ.శ.1000        2) క్రీ.శ.1010  

3) క్రీ.శ.1230       4) క్రీ.శ.1500


10. మొదటి రాజేంద్రుడి కుమారైకు ఎవరితో వివాహం జరిగింది?

1) రాజరాజ నరేంద్రుడు      2) రెండో పులకేశి   

3) కులోత్తుంగ చోళుడు      4) మిహిర భోజుడు 


11. కిందివాటిలో మొదటి రాజేంద్రుడి ఉత్తర భారత విజయాన్ని తెలియజేసేవి?

1) గంగైకొండ చోళపుర నిర్మాణం         

2) చోళగంగమ్‌ అనే నీటిపారుదల చెరువు తవ్వించడం

3) గంగైకొండ చోళేశ్వర ఆలయ నిర్మాణం   4) పైవన్నీ


12. కిందివారిలో చాళుక్య చోళ వంశస్థాపకుడు?

1) రెండో రాజరాజు      2) రాజేంద్ర చోళుడు

3) కులోత్తుంగ చోళుడు     4) విజయాలయ చోళుడు


13. ‘కళింగత్తు పరణి’ అనే గ్రంథాన్ని రచించింది?

1) ఇలాంగో అడిగల్‌     2) జయ గొండార్‌ 

3) సోమేశ్వరుడు      4) మొదటి రాజేంద్రుడు


14. చోళుల సామ్రాజ్య విభాగాలను వరుసలో అమర్చండి.    

1) మండలం - వెలనాడు - నాడులు - గ్రామం

2) వెలనాడు - మండలం - నాడులు - గ్రామం

3) నాడులు - మండలం - వెలనాడు - మండలం

4) గ్రామం - నాడులు - వెలనాడు - మండలం


15. సతీసహగమనం ఆచరించిన వాసవన్‌ మహాదేవి ఎవరి భార్య?

1) మొదటి రాజరాజు     2) రెండో పరాంతకుడు 

3) రాజేంద్ర చోళుడు      4) కులోత్తుంగ చోళుడు


16. చోళుల కాలంలోని ‘ఉదంకుట్టం’ అంటే?

1) మంత్రిమండలి    2) రాజు సొంత భూమి

3) రాజు అంతరంగిక మందిరం   4) రాజకుమారై అంతరంగిక మందిరం


17. మొదటి రాజేంద్రుడి చేతులో ఓడిన పాలవంశరాజు?    

1) మిహిర భోజుడు      2) రెండో భీముడు  

3) మహీపాలుడు      4) చంద్రదేవుడు


18. తంజావూర్‌ నిర్మాత ఎవరు?

1) సుందర చోళుడు      2) విజయాలయుడు 

3) ఆదిత్య చోళుడు     4) రాజేంద్ర చోళుడు 


19. కిందివాటిని జతపరచండి.

ఎ) శివగనిందమని 1) రామానుజాచార్యులు
బి) పెరియ పురాణం 2) అమిత సాగరుడు 
సి) శ్రీభాష్యం 3) తిరుతక్కదేవర్‌
డి) యాప్పరుంగళం  4) శెక్కిలార్‌

 1) ఎ-1, బి-3, సి-2, డి-4       2) ఎ-3, బి-4, సి-1, డి-2 

3) ఎ-1, బి-2, సి-4, డి-3   4) ఎ-3, బి-4, సి-2, డి-1


20. చోళుల కాలంలో ఏ సముద్రాన్ని చోళ సముద్రం అని పిలిచేవారు?

1) బంగాళాఖాతం      2) అరేబియా సముద్రం 

3) హిందూమహా సముద్రం 4) 1, 3 


21. చోళుల గ్రామపాలన గురించి తెలిపే శాసనం?

1) ఉత్తర మేరూర్‌ శాసనం 2) కన్యాకుమారి శాసనం 

3) ఐహోలు శాసనం      4) తంజావూర్‌ శాసనం


22. కిందివాటిలో చోళుల పదజాలానికి సంబంధించి సరికాని జత?

1) ఓలియనాయగల్‌ - రాజాజ్ఞలను అమలు చేసే కార్యదర్శి

2) పెరుమండ్రం - సచివాలయం

3) సిరుంతరం - రాజుకు ఉన్న ప్రధానమంత్రి

4) పెరుంతరంగ - ఉన్నత ఉద్యోగులు


23. కిందివాటిలో చోళుల కాలం నాటి గ్రామసభ విధి?

1) శిస్తువసూలు చేయడం     2) నేరాలను విచారించి శిక్షించడం

3) దేవాలయాల నిర్వహణ        4) పైవన్నీ


24. కిందివాటిని జతపరచండి.

ఎ) బ్రహ్మదేయ      1) బ్రాహ్మణులకు దానం చేసిన భూములు

బి) దేవదాన        2) దేవాలయాలకు దానంగా ఇచ్చిన భూములు

సి) శాలభోగ        3) విద్యాసంస్థలకు దానంగా ఇచ్చిన భూములు

డి) తిరునామత్తుకని   4) జైన సంస్థలకు దానంగా ఇచ్చిన భూములు

1) ఎ-1, బి-2, సి-3, డి-1        2) ఎ-1, బి-2, సి-4, డి-3 

3) ఎ-4, బి-3, సి-2, డి-1        4) ఎ-4, బి-2, సి-1, డి-3


25. చోళుల కాలంలో అద్వైత విధానం వ్యాప్తిలో ఉంది. అద్వైతం అంటే?

1) ఆత్మ, పరమాత్మ ఒక్కటే.           2) ఆత్మ వేరు, పరమాత్మ వేరు.

3) ఆత్మ సత్యం, పరమాత్మ లేదు.  4) ఆత్మ పరమాత్మలో భాగం.


26. చిదంబరంలోని నాగేశ్వరాలయం పై భాగంలో విమానానికి బంగారు కప్పును చేయించింది?

1) మొదటి రాజేంద్రుడు          2) మొదటి పరాంతకుడు

3) సుందర చోళుడు     4) కులోత్తుంగ చోళుడు


27. తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరు?

1) మొదటి రాజేంద్రుడు      2) కులోత్తుంగ చోళుడు 

3) మొదటి రాజరాజు      4) పరాంతక చోళుడు


28. చోళుల కాలంలో ‘నగరం’ అంటే?

1) వ్యవసాయ గ్రామాలను పాలించే గ్రామసభ.

2) బ్రహ్మదేయ గ్రామాలను పాలించే గ్రామసభ.

3) వ్యాపారస్థులు నివసించే గ్రామాలను పాలించే గ్రామసభ.

4) మత సంస్థలకు దానమిచ్చిన గ్రామాలు.


29. చోళుల కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళం?

1) నౌకాదళం      2) రథబలం  

3) అశ్వికదళం      4) కాల్పళం


30. చోళుల కాలంలో కొన్ని గ్రామాల కలయికకు పేరు?

1) మండలం      2) నాడు  

3) వెలనాడు      4) ఉర్‌


31. చోళుల కాలంలో గ్రామసభకు పోటీ చేయడానికి ఉండకూడని (అనర్హత) దాన్ని గుర్తించండి.

1) 3 నుంచి 4 ఎకరాల సొంత భూమి ఉండాలి.

2) సొంత గృహం ఉండాలి.

3) వేదాల్లో పాండిత్యం ఉండాలి.

4) వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నికై ఉండాలి.


32. కిందివాటిలో సరికాని జత?

1) న్యాయత్తార్‌ - న్యాయస్థానాలను సూచిస్తాయి

2) కడగం - సైనికుల స్థావరం

3) ఉర్‌ - బ్రహ్మదేయాలను పాలించే గ్రామసభ

4) కుడుంబు - వార్డులను సూచిస్తాయి


33. కింది ఏ రాజవంశాన్ని సముద్రంతో ఆటలాడుతూ యుద్ధ విజయాలు సాధించిన వారిగా చెబుతారు?

1) పల్లవులు      2) చోళులు  

3) శాతవాహనులు      4) చాళుక్యులు


34. చాళుక్య చోళవంశంలో చివరివాడు?

1) మూడో కులోత్తుంగుడు   2) మూడో రాజేంద్రుడు

3) రాజరాజ చోళుడు         4) రెండో రాజరాజు


35. పెరుంగూర్‌ అనే పదానికి అర్థం?

1) చోళుల కాలంలో సైనిక స్థావరాలు

2) చోళుల కాలంనాటి గ్రామసభలు

3) చోళుల కాలంనాటి దేవాలయ నిర్వహణ కమిటీ

4) చోళుల కాలం నాటి న్యాయస్థానాలు


36. చోళుల రాజ్య చిహ్నం ఏది?

1) విల్లు   2) పులి   3) వరాహం   4) చేప


37. ‘దక్షిణ భారతనెపోలియన్‌’ అని పిలిచే చోళరాజు?

1) రాజేంద్ర చోళుడు      2) మొదటి రాజరాజు

3) ఆదిత్య చోళుడు       4) కులోత్తుంగ చోళుడు


38. చోళ రాజవంశం ఏ రాజు పాలనలో ఉచ్ఛస్థితికి చేరుకుంది?

1) రెండో రాజరాజ చోళుడు    2) మొదటి రాజేంద్ర చోళుడు

3) సుందర చోళుడు       4) పరాంతక చోళుడు


39. చోళ రాజవంశం శాసనాల ప్రకారం దేవాలయాలకు బహుమతిగా ఇచ్చిన భూమి?

1) వెల్లన్‌ వాగై       2) శాలభోగ   

3) తిరునామట్టుకని     4) పల్లిచ్చదన్‌


40. చోళుల మతం?

1) హిందూ    2) బౌద్ధం

3) జైనం    4) జొరాస్ట్రియంసమాధానాలు

1-4; 2-3; 3-2; 4-1; 5-3; 6-3; 7-2; 8-4; 9-2; 10-1; 11-4; 12-3; 13-2; 14-1; 15-2; 16-1; 17-3; 18-2; 19-2; 20-1; 21-1; 22-3; 23-4; 24-1; 25-1; 26-2; 27-3; 28-3; 29-2; 30-2; 31-4; 32-3; 33-2; 34-2; 35-2; 36-2; 37-1; 38-2; 39-3; 40-1.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు

Posted Date : 14-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు