• facebook
  • whatsapp
  • telegram

కాంతి

బుడగలో రంగులు సృష్టించే వ్యతికరణం!

ఖగోళంలో తరచూ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. సముద్రం నీలం రంగులో కనిపిస్తుంది. వజ్రం అత్యంత ఆకర్షణీయంగా మెరిసిపోతుంటుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందు చేస్తుంది. రహస్య సంకేతాల ప్రసారం నిరంతరాయంగా సాగిపోతుంటుంది. వీటన్నింటి వెనుక ఉమ్మడిగా ఉన్న ఫోటాన్‌ కణాల తరంగమే కాంతి. అది ప్రదర్శించే ధర్మాల వల్ల అనేక దృగ్విషయాలు సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కాంతి లక్షణాలను, ధర్మాలను పోటీ పరీక్షారులు తెలుసుకోవాలి. నిత్యజీవితంలో వాటి అనువర్తనాలపై తగిన అవగాహన పెంపొందించుకోవాలి.   


1. స్వచ్ఛమైన నీరు...

1) పారదర్శక పదారం   2) అర్ధపారదర్శక పదారం

3) అపారదర్శక పదారం   4) ఏదీకాదు


2. దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత...

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది

3) పెరిగి, తగ్గుతుంది     4) ఏ మార్పు ఉండదు3. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం

1) 8 సెకన్లు     2) 8 నిమిషాలు      3) 8 గంటలు     4) 8 సంవత్సరాలు


4. సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి  కారణమేంటి?

1) కాంతి రుజువర్తనం     2) వక్రీభవనం    3) ధ్రువణం     4) వివర్తనం


5. చంద్రుడి నుంచి పరావర్తనం చెందిన కాంతి     కిరణాలు భూమికి చేరడానికి పట్టే సమయం ఎంత?

1) ఒక సెకను     2) 8 సెకన్లు    3) 8 నిమిషాలు     4) ఒక నిమిషం 

6. రెండు వస్తువులు సమానమైన కాంతి వేగంతో   ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం...?

1) కాంతి వేగానికి రెట్టింపు     2) కాంతి వేగంలో సగం

3) కాంతి వేగానికి సమానం    4) కాంతి వేగానికి 4 రెట్లు 

7. కిందివాటిలో అతినీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి-

1) డాల్ఫిన్‌     2) తిమింగలం    3) రొయ్య     4) తేనెటీగ 

8.  కెమెరాలోని ఏ భాగం మానవ నేత్రపటలంలా        పనిచేస్తుంది?

1) కటకం  2) ఫిల్మ్‌  3) ద్వారం  4) ఫ్లాష్‌

9. సముద్రం నీలం రంగులో కనిపించడానికి       కారణమేంటి?

1) ఎక్కువ లోతు           2) కాంతి పరావర్తనం

3) కాంతి పరిక్షేపణం     4) ఊర్ధ్వ పొర మాత్రమే


10. సబ్బు బుడగ పలు రంగుల్లో ఏర్పడటానికి కారణం?

1) వ్యతికరణం

2) బహుళ వక్రీభవనం, ధ్రువణం

3) వక్రీభవనం, ధ్రువణం 

4) ధ్రువణం, వ్యతికరణం11. దంత వైద్యులు ఉపయోగించే దర్పణం?

1) కుంభాకార దర్పణం     2) సమతల దర్పణం

3) స్తూపాకార దర్పణం     4) పుటాకార దర్పణం


12. టీవీ రిమోట్‌లో ఉపయోగించే కిరణాలు-

1) గామా కిరణాలు        2) అతినీలలోహిత కిరణాలు

3) పరారుణ కిరణాలు   4) రాడార్‌ కిరణాలు

13. కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?

1) కాంతి వివర్తనం     2) వ్యతికరణం

3) వక్రీభవనం          4) పరావర్తనం14. వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి    కిరణాలు- 

1) అతినీలలోహిత కిరణాలు     2) పరారుణ కిరణాలు

3) గామా కిరణాలు                    4) రాడార్‌ కిరణాలు15. వజ్రం కాంతిమంతంగా మెరవడానికి కారణం?

1) పరావర్తనం    2) వ్యతికరణం   3) సంపూర్ణాంతర పరావర్తనం   4) వితరణం16. కాంతి రుజుమార్గ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని పనిచేసే పరికరం?

1) సూక్ష్మదర్శిని    2) కెమెరా    3) లాంతరు   4) ప్రొజెక్టర్‌17. హోలోగ్రఫీ అనేది... ని తెలియజేస్తుంది.

1) ఏకతల ఫొటోగ్రఫీ        2) ద్విమితీయ ఫొటోగ్రఫీ

3) త్రిమితీయ ఫొటోగ్రఫీ   4) సమకోణ ఫొటోగ్రఫీ18. వాహనాల్లో డ్రైవర్లకు పక్కన అమర్చే దర్పణం ఏది?

1) పుటాకార దర్పణం     2) కుంభాకార దర్పణం

3) స్తూపాకార దర్పణం     4) సమతల దర్పణం 

19. అంబులెన్స్‌ ముందు భాగాన అద్దంపై అంబులెన్స్‌ అని తిరగేసి రాస్తారు. ఇందులో ఇమిడి ఉన్న శాస్త్రీయ దృగ్విషయం ఏమిటి? 

1) కాంతి వక్రీభవనం  2) కాంతి పరావర్తనం

3) కాంతి విక్షేపణం    4) కాంతి పరిక్షేపణం20. వస్తు పరిమాణంలో సమాన పరిమాణం ఉన్న   ప్రతిబింబాన్ని ఏర్పరిచే పార్శ్య విలోమం ఏ     దర్పణంలో ఏర్పడుతుంది?

1) సమతల దర్పణం        2) పుటాకార దర్పణం

3) కుంభాకార దర్పణం     4) 2, 321. ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి దర్పణంపై పతనం చెందినా, పరావర్తన కోణం విలువ

1) OO   2) 30O  3) 60  4) 90O


22. ఆరోగ్యవంతుడైన మానవుడి దృష్టికోణం సుమారుగా?

1) 50O   2) 80O   3) 70O   4) 60O


 

23. నేత్ర పటలం ... ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పడవు.

1) అంధచుక్క    2) శుక్లపటలం   3) దృఢస్తరం    4) పచ్చచుక్క24. సాధారణంగా స్పష్ట దృష్టి కనీస దూరం

1) 55 సెం.మీ.  2) 40 సెం.మీ.    3) 25 సెం.మీ.     4) 35 సెం.మీ.25. కిందివాటిలో ఇంధ్రధనస్సు ఏర్పడటానికి కారణం?

1) కాంతి విశ్లేషణం  2) సంపూర్ణాంతర పరావర్తనం

3) వక్రీభవనం        4) పైవన్నీ26. కింది వాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) కాంతి పౌన:పున్యం తగ్గితే ఫోటాన్లలోని శక్తి పెరుగుతుంది. 

బి) తరంగదైర్ఘ్యం పెరిగితే ఫోటాన్‌ శక్తి తగ్గుతుంది.

1) ఎ సరైంది, బి తప్పు    2) ఎ తప్పు, బి సరైంది

3) రెండూ సరైనవే           4) రెండూ తప్పు


27. పిడుగుపాటు సమయంలో మొదట మెరుపు కనిపిస్తుంది.  తర్వాత ఉరుము వినపడుతుంది. ఇది  ఏ విధమైన దృగ్విషయాన్ని తెలియజేస్తుంది? 

1) కాంతి వేగం, ధ్వని వేగం కంటే ఎక్కువ

2) ధ్వని వేగం, కాంతి వేగం కంటే ఎక్కువ

3) ధ్వని వేగం, కాంతి వేగం రెండూ సమానం

4) పైవన్నీ


28. కిందివాటిలో సరైంది?

ఎ) LASER  లైట్‌ ఆంప్లిఫికేషన్‌ బై స్టిమ్యులేటెడ్‌ ఎమిషన్‌ ఆఫ్‌ రేడియేషన్‌ 

బి) RADAR  రేడియో డిటెక్షన్‌ అండ్‌ రేజింగ్‌

సి) SONAR సౌండ్‌ నేవిగేషన్‌ అండ్‌ రేజింగ్‌ 

డి) CFL కాంపాక్ట్‌ ఫ్లోరోసెంట్‌ ల్యాంప్‌ 

1) ఎ, బి   2) ఎ, సి    3) ఎ, సి, డి  4) ఎ, బి, సి, డి29. కిందివాటిలో పరారుణ కిరణాల (ఐఆర్‌) అనువర్తనం కానిది

1) రాకెట్, క్షిపణుల్లో మార్గ నిర్దేశక కిరణాలుగా 

2) రహస్య సంకేతాల ప్రసారానికి

3) మురిగిన కోడిగుడ్ల నుంచి, మంచి వాటిని గుర్తించడానికి

4) పొగమంచులో స్పష్టంగా ఫొటోలు తీయడానికి  30. కిందివాటిలో సరైంది?

1) పతన, వక్రీభవన కోణాలు లంబంతో కోణాన్ని  ఏర్పరచవు.

2) వక్రీభవన కోణం ఒక తలంలో, లంబం మరొక తలంలో ఉంటాయి.

3) పతన, వక్రీభవన కిరణాలు లంబ పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయి.

4) పతన, వక్రీభవన కిరణాలు, లంబం ఒకే తలంలో ఉండవు.


31. కిందివాటిలో సరికానిది?

ఎ) ఆప్టికల్‌ ఫైబర్‌ను డాక్టర్‌ నరేంద్ర సింగ్‌ కపానీ కనుక్కున్నారు. 

బి) ఇది కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పని చేస్తుంది.

సి) దీన్ని సమాచార రంగంలో ఉపయోగిస్తారు.

డి) దీన్ని వజ్రంతో తయారుచేస్తారు.

1) ఎ, బి    2) బి, సి    3) డి    4) సి 


 

32. కిందివాటిలో సరికానిది?

ఎ) కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది.

బి) కాంతి సంపూర్ణంతర పరావర్తనం వల్ల  ఎండమావులు ఏర్పడతాయి. 

సి) కాంతి ధ్రువణం వల్ల దృష్టిజ్ఞానం కలుగుతుంది. 

డి) కాంతి వక్రీభవనం వల్ల నీటిలోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది

1) ఎ, బి, సి     2) బి, సి, డి   3) సి   4) బి 


33. వక్రీభవనం గుణకం విలువల ఆధారంగా కింది పదారాలను గరిష్ఠం నుంచి కనిష్ఠానికి ఏ విధంగా అమర్చవచ్చు?

1) వజ్రం > గాజు > నీరు > గాలి

2) వజ్రం < గాజు <  నీరు < గాలి

3) గాజు > గాలి > వజ్రం > నీరు

4) నీరు >  గాలి > గాజు > వజ్రం


34. కింది వాటిలో సరికానిది?.

ఎ) ప్రాథమిక వర్ణాలు సమపాళ్లలో కలిపినప్పుడు తెలుపు రంగు ఏర్పడుతుంది

బి) నలుపు రంగు గరిష్ఠమైన శక్తిని కలిగి ఉంటుంది.

సి) తెలుపు రంగు అన్ని కాంతి కిరణాలను పరావర్తనం చెందిస్తుంది.

డి) నీలం, ఆకుపచ్చ రంగులు కలిసి నలుపు రంగును ఏర్పరుస్తాయి

1) ఎ, బి   2) డి   3) సి    4) పైవన్నీ 35. కిందివాటిని జతపరచండి.

1) కుంభాకార కటకం        ఎ) సినిమా ప్రొజెక్టర్‌

2) కుంభాకార దర్పణం    బి) డ్రైవర్‌ మిర్రర్‌

3) పుటాకార కటకం          సి) వికేంద్రీకరణ కటకం

4) పుటాకార దర్పణం       డి) డాక్టర్‌ మిర్రర్‌

1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి    2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి36. కిందివాటిని జతపరచండి

1) కాంతి విశ్లేషణం        ఎ) థామస్‌ యంగ్‌

2) కాంతి వివర్తనం        బి) గ్రిమాల్టి

3) కాంతి వ్యతికరణం    సి) బార్లోలైన్‌

4) కాంతి ధ్రువణం        డి) న్యూటన్‌

1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి     2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

37. కింది వాటిని జతపరచండి.

1) ఫొటోమీటరు     ఎ) కాంతి తీవ్రత

2) టెలిస్కోప్‌       బి) దూరంగా ఉండే  వస్తువులను పరిశీలించడానికి

3) మైక్రోస్కోప్‌      సి) చిన్న వస్తువులను చూడటానికి 

4) స్టిరియోస్కోప్‌   డి) త్రీ డైమెన్షనల్‌ ఫొటోలను చూడటానికి 

1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి    2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి    4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


38. కింది వాటిని జతపరచండి.

1) పారదర్శక పదారం           ఎ) ట్రేసింగ్‌ పేపర్‌

2) అర్ధ పారదర్శక పదారం    బి) వజ్రం

3) అపారదర్శక పదారం        సి) ఇనుము

1) 1-బి, 2-ఎ, 3-సి     2) 1-ఎ, 2-బి, 3-సి 

3) 1-సి, 2-బి, 3-ఎ     4) 1-బి, 2-సి, 3-ఎ


సమాధానాలు

1-1; 2-2; 3-2; 4-1; 5-1; 6-3; 7-4; 8-2; 9-3; 10-1; 11-4; 12-3; 13-1; 14-1; 15-3; 16-2; 17-3; 18-2; 19-2; 20-1; 21-1; 22-4; 23-1; 24-3; 25-4; 26-2; 27-1; 28-4; 29-3; 30-3; 31-3; 32-3; 33-1; 34-2; 35-3; 36-2; 37-4; 38-1.  

Posted Date : 11-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు