• facebook
  • whatsapp
  • telegram

మూర్తిమ‌త్వం

1. దెయ్యం, లోతైన సముద్రం మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి ఏ రకమైన సంఘర్షణను అనుభవిస్తాడు?
: పరిహార - పరిహార

 

2. గణితంలో తక్కువ సాధన కలిగిన పిల్లవాడు భాషా విభాగంలో పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు వాడిన రక్షకతంత్రం?
జ: పరిహారం

 

3. ప్రధానోపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడిని నిందిస్తే... అతడు తోటి ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయుడిపై తనకేమీ కోపం లేదని, తనంటే చాలా అభిమానమని చెప్పడం?
జ: ప్రతిచర్యానిర్మితి

 

4. పదోతరగతి ఫెయిల్‌ అయిన రాజేష్‌ తన తండ్రితో విద్యార్థులందరూ ఫెయిల్‌ అయ్యారని చెప్పడం?
జ: ప్రక్షేపణం

 

5. వ్యక్తిలో విషమయోజన లక్షణం కాని అంశం?
జ: ఇతరులు అడిగే ప్రశ్నలకు శాంతంగా జవాబులు చెప్పడం

 

6. కిందివాటిలో మూర్తిమత్వం లక్షణం కానిది?
1) మూర్తిమత్వం స్థిరంగా ఉండదు, స్తబ్దంగా ఉంటుంది.      
2) మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు.
3) మూర్తిమత్వాన్ని కచ్చితంగా కొలవలేం. 
4) మూర్తిమత్వం వ్యక్తికి సంబంధించిన అన్ని లక్షణాల సమగ్ర స్వరూపం.
జ: 1 (మూర్తిమత్వం స్థిరంగా ఉండదు, స్తబ్దంగా ఉంటుంది.)

 

7. పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా అతడి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది?
జ: ప్రక్షేపక పరీక్ష

 

8. కిందివాటిలో విషమయోజనం ఏర్పడే స్థితి?
1) అవసరాలకు మించి అవకాశాలు రావడం, కానీ ఉపయోగించుకోలేకపోవడం.
2) అవసరం ఉండి అవకాశాలు లేకపోవడం.
3) అవసరాలకు, అవకాశాలకు మధ్య సమతూకం లోపించడం. 
4) ఏదీకాదు
జ: 3 (అవసరాలకు, అవకాశాలకు మధ్య సమతూకం లోపించడం.)

 

9. ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా వ్యక్తి తన ఆత్మయోగ్యత, ఆత్మగౌరవ భావాలను పెంపొందించడానికి చేసే ప్రత్యేక కృషి ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ?
జ: తదాత్మీకరణం

 

10. రవి అనే వ్యక్తి డ్టాకర్‌ కావాలని కాలేకపోయాడు. తన కుమారుడు రాజేష్‌ను డాక్టర్‌ను చేసి అందరిముందూ అతడి గురించి ప్రస్తావించి గౌరవాన్ని పెంపొందించుకున్నాడు. ఈ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షకతంత్రం?
జ: తదాత్మీకరణం

 

11. ‘ఆడలేక మద్దెల ఓటి’ అనే సామెతకు సరిపోయే రక్షకతంత్రం?
: ప్రక్షేపణం

 

12. రాజస్థాన్‌ నుంచి వచ్చిన గీతకు రొట్టెలు తప్ప అన్నం తినడం ఇష్టం లేదు. కానీ చిత్తూరులోని తమ బంధువుల ఇంట్లో అన్నం తప్ప వేరే ఉండదు. కాబట్టి విధి లేక అన్నం తినడం అలవాటు చేసుకోవడాన్ని ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు?
జ: అంతర్లీనం

 

13. ఉపాధ్యాయుడు తనను కించపరుస్తున్నాడని భావించిన విద్యార్థి తల్లిదండ్రులకు తన బాధను వ్యక్తం చేయడమనేది?
జ: వ్యక్తీకరణం

 

14. రాజుకు పిల్లిని పట్టుకోవాలని ఉంది. కానీ పిల్లి కరుస్తుందేమోనని భయంతో దగ్గరకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాడు. అయితే ఇది ఏ రకమైన సంఘర్షణ?
జ: ఉపగమ - పరిహార

 

15. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఉమకు తన స్నేహితురాలు చేసిన కాఫీ నచ్చకపోయినా బాగుందని చెప్పి తాగడం అనేది?
జ: ప్రతిచర్యానిర్మితి

 

16. ఉష అనే బాలికను తన తండ్రి ఎందుకు ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ కాలేదు అని అడగ్గా ఆమె క్లాస్‌లో ఎవరూ ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ కాలేదనడం ఏ రక్షకతంత్రం?
జ: ప్రక్షేపణం

 

17. పులితో ఫొటో దిగాలని ఉంది కానీ చంపేస్తుందని భయంగా ఉంది. చెట్టు ఎక్కి పండు కోసుకొని తినాలని ఉంది కానీ కింద పడతానేమోనని భయంగా ఉంది. ఇది ఏ సంఘర్షణ?
జ: ఉపగమ - పరిహార

 

18. ఐఏఎస్‌ కావాలనుకున్న వ్యక్తి తాను ఐఏఎస్‌ కాలేకపోయినప్పటికీ... ఒక జిల్లాను పరిపాలిస్తున్నట్లు కలలు కనడం ఏ రక్షకతంత్రంగా చెప్పవచ్చు?
జ: స్వైరకల్పన

 

19. కిందివాటిలో అధివృక్క గ్రంథికి సంబంధించి సరైంది? 
1) స్త్రీలలో అధిక అడ్రినలిన్‌ రక్తంలో కలవడం వల్ల మీసాలు, గడ్డం వస్తాయి. 
2) స్త్రీలలో అధిక అడ్రినలిన్‌ రక్తంలో కలవడం వల్ల జననేంద్రియ వికాసం త్వరగా జరుగుతుంది.
3) స్త్రీలలో అడ్రినలిన్‌ స్థాయి తగ్గడం వల్ల మగవారి గొంతులా బొంగురు పోతుంది. 
4) ఈ హార్మోన్‌ వ్యక్తి ఉద్వేగంపై ప్రభావాన్ని చూపుతుంది.
జ: 3 (స్త్రీలలో అడ్రినలిన్‌ స్థాయి తగ్గడం వల్ల మగవారి గొంతులా బొంగురు పోతుంది.)

 

20. ఇటీవల దిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ బాధను తట్టుకోలేక నగరంలోని ప్రముఖ ఆఫీసుల, బస్సుల అద్దాలను పగలగొట్టడం ఏ రక్షకతంత్రం?
జ: విస్తాపనం

 

21. గ్రంథి చిన్నగా ఉన్నా వ్యక్తి పొడవుగా పెరగడానికి, పెరుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారణమై అన్ని గ్రంథులను నియంత్రించేది?
జ: పీయూష గ్రంథి

 

22. రాము పదోతరగతి పరీక్ష రాస్తున్నప్పుడు పేపర్‌ను చూడగానే చెమటలు పట్టి భయాందోళనకు గురయ్యాడు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ప్రతికూల ఉద్వేగాలకు లోనవుతున్నాడు. ఈ సమయంలో అతడిపై ప్రభావం చూపే గ్రంథి?
: అధివృక్క గ్రంథి

 

23. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చూడటానికి లావుగా ఉన్నా, తన కంపెనీలోని సహోద్యోగులతో కలుపుగోలుగా ఉంటూ అందరి మన్ననలను పొందుతుంటాడు. అయితే షెల్డన్‌ ప్రకారం అతడు ఏ వర్గానికి చెందినవాడు?
జ: స్థూలకాయులు

 

24. నల్లపిల్ల అని అందరితో హేళనకు గురైన అమ్మాయి ప్రఖ్యాత డాక్టర్‌గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షకతంత్రానికి ఉదాహరణ?
జ: పరిహారం

 

25. కవిత తన స్నేహితురాలు పెళ్లికి పిలిచినప్పుడు ఏదైనా బహుమతి తీసుకెళ్లాలి కానీ డబ్బులు ఖర్చవుతాయని ఆలోచించి ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి వెళ్లలేదు. ఇక్కడ ఆమె ఉపయోగించిన రక్షకతంత్రం?
జ: ఉపసంహరణ

 

26. వ్యక్తి సమస్యాత్మక ప్రవర్తనకు కారణం?
1) పిల్లల పట్ల తల్లిదండ్రుల వైఖరులు       2) చెడు ప్రవర్తన గల సమవయస్కుల బృందాలు
3) ప్రతికూల ప్రవర్తనను కలిగించే పరిసరాలు   4) అన్నీ
జ: 4 (అన్నీ)


27. స్ప్రాంజర్‌ ప్రకారం సాంఘిక విలువలు పాటించేవారు ఏ విధంగా ఉంటారు?
జ: ఉద్యమ స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ నిస్వార్థంగా ఉంటారు.

 

28. క్విజ్‌ ప్రోగ్రాంలో అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాన్ని చెప్పకుండా కొంత సమయం తర్వాత గుర్తుకు తెచ్చుకొని చెప్పడం
జ: ఉపచేతనం

 

29. అధ్యహం వ్యక్తిలో ఉన్నట్లు ఎలా గుర్తిస్తారు?
జ: నైతిక విలువలు పాటించినప్పుడు

 

30. పాఠశాలలో ఒక విద్యార్థినిని మిగిలిన విద్యార్థులు దొంగ అని సంబోధించినప్పుడు కాదు అని గట్టిగా విభేదిస్తే ఆ బాలిక ఉపయోగించుకున్న రక్షకతంత్రం?
జ: నిరాకరణ

31. రెండుసార్లు డీఎస్సీ రాసి ఉపాధ్యాయుడు కాలేకపోయిన మహేష్‌పై ప్రభావం చూపేది?
జ: ఒత్తిడి

 

32. మూర్తిమత్వానికి సంబంధించి సరైన వాక్యం?
     1) సాధారణంగా అందరిలో ఒకే రకమైన మూర్తిమత్వం ఉంటుంది.
     2) మూర్తిమత్వం అంటే సాంఘిక, మానసిక వికాసాల కలయిక మాత్రమే.
     3) వ్యక్తికి, వ్యక్తికి మధ్య మూర్తిమత్వంలో మార్పులు ఉంటాయి.
     4) మూర్తిమత్వాన్ని కచ్చితంగా కొలవవచ్చు.
 3 (వ్యక్తికి, వ్యక్తికి మధ్య మూర్తిమత్వంలో మార్పులు ఉంటాయి.)

 

33. అన్యాయంగా సంపాదించిన వ్యక్తి తన ఆస్తిని దానధర్మాలు చేస్తున్నాడు. ఇందులోని రక్షకతంత్రం?

జ: ప్రాయశ్చిత్తం
 

34. ‘ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ గెస్టాల్ట్‌ సైకాలజీ’ గ్రంథాన్ని రాసినవారు?
జ: కర్ట్‌ కోఫ్‌కా

 

35. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను ప్రాగుక్తీకరించడానికి అతడిలోని ఏ గుణాలను ఎక్కువగా తెలుసుకోవాలి?
జ: సహజసామర్థ్యం

 

36. ‘ఎమోషనల్‌ కెథార్సిస్‌’ అంటే?
జ: ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం

37. వ్యక్తిలోని ఉద్వేగాలపై నేరుగా ప్రభావం చూపే గ్రంథి?
జ: అధివృక్క గ్రంథి

 

38. ‘అవ్వా కావాలి బువ్వా కావాలి’లో ఇమిడి ఉన్న సంఘర్షణ
జ: ఉపగమ − ఉపగమ

 

39. కిందివాటిలో ఒత్తిడి గల వ్యక్తి లక్షణం కానిది?
     1) అతిగా నిద్రపోవడం      2) ఆకలి లేకపోవడం      

    3) చెమటలు పట్టడం      4) తరచూ తలనొప్పి రావడం
జ: 1 (అతిగా నిద్రపోవడం)

 

40. ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు గేమ్స్‌ పీరియడ్‌లో ఆడనీయకుండా అభ్యసన కృత్యాలు చేయమనడం వల్ల అతడు అధిక కుంఠనానికి గురవడమనేది?
జ: మానసికమైంది

 

41. ‘ఎడిపస్‌ కాంప్లెక్స్‌’ అంటే?
జ: మగశిశువు తన తల్లి వద్ద నుంచి అధిక ప్రేమానురాగాలు పొందడం

 

42. వ్యక్తి మనసులోని ఉపచేతనంలో ఉండేవి?
జ: సమీప కాలంలో జరిగిన కొంత ప్రయత్నంతో గుర్తు తెచ్చుకునే అంశాలు

 

43. ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన CAT పరీక్ష దేన్ని మాపనం చేయడానికి ఉపయోగపడుతుంది?
జ: పిల్లల మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి

44. చెడు అనకు, కనకు, వినకు అనే మూడు కోతుల బొమ్మల ద్వారా కళ్లు, చెవులు, నోరు మూసుకొని ఉండటంలో ఉన్న రక్షక తంత్రం?
జ: ఉపసంహరణ

 

45. మూర్తిమత్వ కారకాల్లో శారీరక కారకానికి సంబంధించి సరికాని వాక్యం?
     1) శరీర ఆకృతి, చిత్తప్రవృత్తికి సంబంధం ఉంటుంది     2) శరీర ఆకారానికి, మూర్తిమత్వానికి సంబంధం లేదు 
     3) శరీర ఆకారానికి, మూర్తిమత్వానికి సంబంధం ఉంటుంది      4) ఏదీకాదు
జ: 2 (శరీర ఆకారానికి, మూర్తిమత్వానికి సంబంధం లేదు)

 

46. కిందివాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది?
     1) గతిశీలమైంది      2) కొన్ని లక్షణాల సముదాయం      

    3) అంచనా వేయవచ్చు      4) అన్నీ
జ: 2 (కొన్ని లక్షణాల సముదాయం)

 

47. కిందివారిలో చొరవచూపే గుణం ఉన్నవారు?
     1) అంతర్వర్తనులు      2) బహిర్వర్తనులు      

    3) ఉభయవర్తనులు      4) ఎవరూకాదు
జ: 2 (బహిర్వర్తనులు)

 

48. వ్యక్తి సమయోజనం నుంచి విషమయోజన దిశగా మారే ప్రవర్తన క్రమం?
జ: సర్దుబాటు − సంఘర్షణ − కుంఠనం − వ్యాకులత

49. ‘డిక్షనరీ ఆఫ్‌ సైకాలజీ’ గ్రంథ రచయిత?
జ: జె.పి.చాప్లిన్‌

 

50. కిందివారిలో ఉభయవర్తనులు అని ఎవరిని అంటారు?
     1) చొరవ చూపే గుణం ఉన్నవారు.      2) ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు 
     3) వారికోసం వారు బతికేవారు           4) అందరూ
జ: 2 (ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు)

 

51. రక్షక తంత్రాలను పరిమితంగా ఉపయోగించుకునేవారు?
జ: సమగ్ర మూర్తిమత్వం ఉన్నవారు

 

52. వ్యక్తిని తప్పు చేయాలని ప్రోత్సహించేది?
జ: ఇడ్‌

 

53. కిందివాటిలో కుంఠనానికి పర్యవసానాలు?
     1) దౌర్జన్యానికి పాల్పడటం                                      2) స్వైరకల్పనలు చేయడం 
     3) అధిక కుంఠనం వల్ల ఆత్మహత్యకు పాల్పడటం      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

54. మానసిక తన్యతను తగ్గించుకోవడానికి అలగడం అనేది ఏ రక్షకతంత్రం?
జ: ప్రతిగమనం

55. కిందివాటిలో మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది?
     1) లక్ష్యం దిశగా సాగుతుంది          2) మారుతూ ఉంటుంది    
     3) గతిశీలంగా ఉంటుంది                 4) ఎక్కువ అస్థిరంగా ఉంటుంది
జ: 4 (ఎక్కువ అస్థిరంగా ఉంటుంది)

 

56. కావాలని మర్చిపోవడం?
జ: దమనం

 

57. కిందివాటిలో మానసిక అపవ్యవస్థ రకానికి చెందింది. 
     1) నాడీ రుగ్మతలు      2) మనోవిక్షిప్తులు      

    3) నాడీ రుగ్మతలు, మనోవిక్షిప్తులు     4) మానసిక అనారోగ్యం
జ: 3 (నాడీ రుగ్మతలు, మనోవిక్షిప్తులు)

 

58. గీత అనే విద్యార్థిని నిరంతరం ఆత్మన్యూనతతో ఉంటూ తాను ఎందుకూ పనికిరాననే ఆలోచనలను కలిగి ఉండటం
జ: అవపాదం

 

59. కిందివాటిలో మానసిక ఆరోగ్యం అనే అంశానికి సంబంధించింది?
     1) ధనాత్మక అంశం      2) నిరోధించే అంశం     

    3) రోగ చికిత్స అంశం      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

60. వాస్తవికతతో సంబంధాలు తెగిపోయి, తనదైన భ్రాంతిలో ఉంటూ సమగ్ర మానసిక క్షయానికి దారితీసే మానసిక అపవ్యవస్థ ఏ రకానికి చెందింది?
జ: మనోవిక్షిప్తులు

61. సాంఘిక పరిసరాలతో సర్దుబాటు చేసుకుని జీవించే వ్యక్తి లక్షణం కానిది?
జ: స్వీయ భావనను కలిగి ఉండటం.

 

62. కిందివాటిలో సర్దుబాటు లక్షణం కానిది?
     1) ఇది అందరిలో ఒకే విధంగా ఉండదు.   
     2) ఒక వ్యక్తిలో సర్దుబాటు అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.
     3) సర్దుబాటు గర్భస్థ శిశు దశ నుంచి చనిపోయే వరకు కొనసాగే నిరంతర ప్రక్రియ.
     4) ఒక వ్యక్తి సర్దుబాటు అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉంటుంది.
జ: 4 (ఒక వ్యక్తి సర్దుబాటు అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉంటుంది.)

 

63. ఒక సంఘటనకు లేదా మార్పునకు, సవాలుకు వ్యక్తి శారీరంగా, మానసికంగా అతిగా స్పందించడమే ఒత్తిడి అని నిర్వచించినవారు
జ: ముర్రే

 

64. ‘ఎ మైండ్‌ దట్‌ ఫౌండ్‌ ఇట్‌సెల్ఫ్‌’ గ్రంథ రచయిత?
జ: క్లిఫర్డ్‌ బీర్స్‌

 

65. ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరికాని వాక్యం?
     1) ఈ పరీక్షలను ఫ్రాంక్‌ మూర్తిమత్వ అంచనాకు ఉపయోగించారు. 
     2) వ్యక్తిలో చేతన, అచేతన భావాలను వ్యక్తపరుస్తుంది.
     3) ప్రయోజ్యుడు ఊహ ద్వారా సమాధానమిస్తాడు.        

    4) ఈ పరీక్షలో అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి.
జ: 2 (వ్యక్తిలో చేతన, అచేతన భావాలను వ్యక్తపరుస్తుంది.)

66. ‘కలల విశ్లేషణ’ ఎవరికి చెందిన రచన?
జ: సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌

 

67. మూర్తిమత్వ అంచనాకు ఉపయోగించే మూర్తిమత్వ శోధికల్లో మొదటిది?
జ: ఉడ్‌వర్త్‌ పర్సనల్‌ డేటా షీట్‌

 

68. మానసిక ఆరోగ్య పితామహుడు?
జ: క్లిఫర్డ్‌ బీర్స్‌

 

69. కార్యకారణ ప్రభావంతో అత్యంత విశ్వసనీయత గల పద్ధతి?
జ: ప్రయోగ పద్ధతి

 

70. రోషాక్‌ సిరా మరకల పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేసే అంశాలకు సంబంధించి ‘d - చిన్న భాగాలు’ అనేది దేనికి చెందుతుంది?
జ: స్థానం

 

71. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచార సేకరణ దేనికి చెందుతుంది?
జ: చేతనావస్థ

 

72. ఒక విద్యార్థి ఊహాత్మక పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే విషయం ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్ష కానిది?
జ: సన్నివేశ పరీక్ష

73. కిందివాటిలో సరికాని జత. 
     1) రోషాక్‌ సిరా మరకల పరీక్ష − హెర్మన్‌ రోషాక్‌             2) థీమాటిక్‌ అప్పర్‌సెప్షన్‌ పరీక్ష − ముర్రే, మోర్గాన్‌ 
     3) చిల్డ్రన్‌ అప్పర్‌సెప్షన్‌ పరీక్ష − ఎస్‌.బెల్లాక్, ఎల్‌.బెల్లాక్‌   4) సాంఘికమితి పరీక్ష − ఫిలిస్‌ జాక్సన్‌
జ: 4 (సాంఘికమితి పరీక్ష − ఫిలిస్‌ జాక్సన్‌)

 

74. అనైతిక ఆలోచనలను కట్టడిచేసి, వాస్తవాలను గ్రహించి ఎప్పుడూ మంచిపనులే చేయాలని ప్రోత్సహించే మనసు?
జ: సూపర్‌ ఈగో

 

75. చిన్న పిల్లలతో ‘హఠం’ చేయడం అనే సమస్యను మాన్పించడం ఎలా?
జ: కోరికలు ఏ విధంగా అనుచితం కాదో చెప్పడం

 

76. బాల్యదశలో కనిపించే నిద్ర సమస్య కానిది?
జ: స్వైరకల్పన

 

77. కిందివాటిలో సరికానిది?
     1) సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు.     
     2) మూర్తిమత్వం స్వీయ చేతనత్వంతో ఉంటుంది. 
     3) మూర్తిమత్వం లక్షణాల సమగ్ర స్వరూపం.
     4) మూర్తిమత్వం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది.
జ: 1 (సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు.)

78. తార్కికత, శాస్త్రీయ దృక్పథం కలిగిన కుటుంబ వాతావరణంలో పెరిగిన శిశువు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటాడు?
     1) స్వావలంబన      2) సహకారతత్వం     

    3) బాధ్యతాయుత ప్రవర్తన      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

79. కిందివాటిలో సరైన క్రమం. 
     1) లక్ష్యం − అవసరం − ఉత్సుకత − గమ్యం        2) అవసరం − ఉత్సుకత − కదలిక − గమ్యం
     3) ఉత్సుకత − అవసరం − కదలిక − గమ్యం     4) గమ్యం − ఉత్సుకత − అవసరం − కదలిక
జ: 2 (అవసరం − ఉత్సుకత − కదలిక − గమ్యం)

 

80. కలెక్టర్‌ కావాలనుకున్న వ్యక్తి లక్ష్యం మార్చుకొని గ్రూప్‌ 2 ఆఫీసరు అవడం ఏ రకమైన సర్దుబాటు?
జ: రాజీ విధానాలను అనుసరించడం

 

81. ఏ గ్రంథి స్రావం శరీరంలోని కాల్షియం స్థాయిని క్రమబద్దీకరిస్తుంది?
జ: పార్శ్వ అవటుగ్రంథి

82. ‘రోషాక్‌ ఇంక్‌ బ్లాట్‌ పరీక్ష’ ఏ విధానానికి సంబంధించింది?
జ: ప్రత్యక్ష విధానం

 

83. రూప సిద్ధాంతాల్లో హిప్పోక్రటస్‌ వర్గీకరణ ప్రకారం రక్తంలో శ్లేష్మ స్రావకం గలవారు ఏ విధంగా ఉంటారు?
జ: నెమ్మదస్తులు, ఏకాకులు, సంఘంతో సంబంధం లేనివారు.

84. మూర్తిమత్వ నిర్మాణంలో గురువులు, తల్లిదండ్రులు, మంచి స్నేహితుల వల్ల వికసించే భాగం?
జ: సూపర్‌ ఈగో

 

85. కిందివారిలో ‘అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త’గా పేరొందినవారు? 
       1) ఎరిక్‌సన్‌        2) సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌        

      3) షెల్డన్‌        4) క్రెష్మర్‌
జ: 1 (ఎరిక్‌సన్‌)

 

86. తరగతిలో ఒక విద్యార్థి అహం కలిగి ఉన్నాడని ఉపాధ్యాయుడిగా నీవు ఎలా గుర్తిస్తావు?
జ: వాస్తవిక ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు

 

87. ఫ్రాయిడ్‌ ప్రకారం విద్యార్థిలో తదాత్మీకరణం, అంతర్లీకరణం ఏర్పడి అధ్యహం బాగా అభివృద్ధి చెందే దశ?
జ: గుప్తదశ (6 - 11 సంవత్సరాలు)

 

88. కిందివాటిలో విద్యార్థి ప్రయత్నం లేకుండా చూపే ప్రతిచర్య?
       1) కాలికి ముళ్లు గుచ్చుకున్నప్పుడు కాలిని వెనక్కి లాగడం.
       2) పాఠశాలలో గంట కొట్టగానే తరగతి గదిలోకి క్యూలైన్‌లో ప్రవేశించడం.
       3) ఈత నేర్చుకోవడం. 
       4) ట్రాఫిక్‌ వద్ద సిగ్నల్‌ పడగానే ఆగడం లేదా బయలుదేరడం.
జ: 1 (కాలికి ముళ్లు గుచ్చుకున్నప్పుడు కాలిని వెనక్కి లాగడం.)

89. ఒక తరగతిలో అనిత అనే విద్యార్థిని ‘సామర్థ్యం’ అనే లక్షణాన్ని చూపుతుంది. అయితే ఎరిక్‌సన్‌ ప్రకారం ఆమె ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి?
జ: శ్రమశీలత − న్యూనత

 

90. విద్యార్థి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే వంశపారంపర్య కారకానికి సంబంధం లేనిది?
జ: తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం

 

91. ఆల్‌పోర్ట్‌ లక్షణాంశ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు వివిధ సందర్భాల్లో ప్రదర్శించే దయ, ఉదారత, స్నేహం లాంటి వాటిని ఉపాధ్యాయుడిగా నీవు ఏ లక్షణాంశాలుగా పేర్కొంటావు?
జ: ప్రాథమిక లక్షణాంశాలు

 

92. రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయినప్పుడు ఏర్పడే సంఘర్షణ?
జ: పరిహార − పరిహార

 

93. సర్దుబాటు చేసుకునే వ్యక్తులు
జ: సమస్యా పరిష్కార పద్ధతులను ఆశ్రయిస్తారు.

 

94. రమేష్‌కి బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. వారు ఫలహారం ఇవ్వబోతే వద్దని చెప్పాడు. అయితే అతడు అనుసరించిన రక్షక తంత్రం?
జ: ప్రేరకం తారుమారు

95. టీచర్‌ కావాలనుకునే సీత డీఎస్సీలో తాను ఎంపిక కాలేదని తెలిసి చిన్నపిల్లలా ఏడవటం అనేది?
జ: ప్రతిగమనం

 

96. కిందివాటిలో హేతుకీకరణాన్ని సూచించేది?
       1) ఒక విద్యార్థి తనకిష్టమైన ఉపాధ్యాయుడిని అనుసరిస్తాడు. 
       2) పరుగుపందెంలో గెలవలేకపోయిన పిల్లవాడు పాదరక్షలను చూపించి బాగాలేవని చెప్పడం. 
       3) తన చెల్లి అంటే ఇష్టంలేనివాడు ఆమెపై ఎక్కువ శ్రద్ధ చూపడం. 
       4) విద్యార్థులతో చిన్నపిల్లాడిలా ఆడుకునే ఉపాధ్యాయుడు.
జ: 2 (పరుగుపందెంలో గెలవలేకపోయిన పిల్లవాడు పాదరక్షలను చూపించి బాగాలేవని చెప్పడం.)

 

97. సంఘర్షణ అనేది?
జ: మానసిక ఉద్వేగం

 

98. విద్యార్థుల్లో విషమయోజనానికి ప్రధాన కారణం?
జ: సరైన ఆత్మభావన లేకపోవడం

 

99. ఏ దశలో మగపిల్లలు తండ్రిపై, ఆడపిల్లలు తల్లిపై విరోధ భావాన్ని కలిగి ఉంటారు?
జ: శిశ్నదశ

 

100. కోపం, ధ్వంసం చేయడం, అవిధేయత, సహాయ నిరాకరణ లాంటివి ఏ లక్షణాలు?
జ: ప్రవర్తనా అపవ్యవస్థ

Posted Date : 28-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు