• facebook
  • whatsapp
  • telegram

క్యాలెండర్

1. 2 అక్టోబరు, 1869 మహాత్మాగాంధీ పుట్టినరోజు. అది ఏ వారం?
జవాబు: శనివారం అవుతుంది.
 ఈ ప్రశ్నలోని రోజులను 2 అక్టోబరు,
1869 = (1868+1.1.1869 to 2.10.1869)
              1868 = 1600 + 200 + 68
1600 సంవత్సరాలు = 0 బేసి దినం
  200 సంవత్సరాలు = 3 బేసి దినాలు
   68 సంవత్సరాలు = 17 leap years + 51
                        ordinary years
   = 17 × 2 + 51 ×1
   = 34+51 = 85 బేసి దినాలు
   = 12 వారాలు + 1 బేసి దినం

= 1 బేసి దినం
   1868 odd days = 0+3+1=4 బేసి దినాలు
Jan Feb March April May June July Aug Sep Oct
32 + 28 + 31 + 30 + 31 + 30 + 31 + 31+30+02 
                        = 275 days
275 రోజులు = 35 వారాలు + 2 రోజులు = 2 బేసి దినాలు మొత్తం బేసి దినాలు = 4 + 2 = 6 కాబట్టి శనివారం అవుతుంది.
        Shortcut : 02-10-1869
       2+1+69+17+2 = 91 రోజులు 
                   
గమనిక: పై లెక్కను Date + month code + No. of years (more than 100 years) + No. of leap years + century code.

2. మొదటి గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న నిర్వహించారు. అది ఏ రోజు?

జవాబు: గురువారం అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన రోజులు
26 జనవరి 1950 (1949+1.1.1950 to 26.1.1950)
                         1949 = 1600 + 300+ 49
1600 సంవత్సరాలు = 0 బేసి దినం
  300 సంవత్సరాలు = 1 బేసి దినం
    49 సంవత్సరాలు = 12 leap years + 37
                                                      ordinary year
= 12× 2 + 37× 1= 24 + 37 = 61 బేసి దినం
     61 రోజులు = 8 వారాలు + 5 బేసి దినాలు 
                             = 5 బేసి దినాలు
    1950 Jan - 26.
మొత్తం బేసి దినాలు = 0+1+5+26= 32 బేసి దినాలు 
          

Shortcut : 26-Jan-1950
   = 26+1+50 + 12 + 0 = 89
     

3. జులై 16, 1776 ఏ రోజు?
జవాబు: మంగళవారం అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన రోజులు
16 జులై 1776 = (1775.1.1.76 to 16.7.76)
                      1775 = 1600+100+75
1600 సంవత్సరాలు = 0 బేసి దినం 
  100 సంవత్సరాలు = 5 బేసి దినాలు
    75 సంవత్సరాలు = 18 leap years + 57
                                                 ordinary years
                               = 18 × 2+57 × 1= 36+57

                               = 93 బేసి దినాలు

                               = 13 వారాలు + 2 బేసి దినాలు
Jan + feb + Mar + April + May + June + July
31 + 29 + 31 + 30 + 31 + 30 + 16 = 198 days
198 days = 28 వారాలు + 2 బేసి దినాలు
                    = 2 బేసి దినాలు.
మొత్తం బేసి దినాలు = 0+5+2+2
                               = 9 బేసి దినాలు
= 1 వారం + 2 బేసి దినాలు
2 బేసి దినాలు అంటే మంగళవారం.
Shortcut: 26-July-1776
          26+0+76+19+4 = 123-1 = 122
           

* Short cut విధానం - 1 ఎందుకంటే ఎప్పుడైనా ఈ పద్ధతిలో ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరమై అడిగిన ప్రశ్న జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటే తప్పక -1 చేయాలి.

4. ఏప్రిల్ 2001లో ఆదివారాలు ఏ తేదీన వస్తాయి?
జవాబు: 4, 11, 18, 25 తేదీల్లో అవుతుంది. ఈ ప్రశ్నలో తేదీ ఇవ్వలేదు.
కాబట్టి 1వ తేదీ తీసుకుంటే మిగిలిన తేదీలు కనుకోవచ్చు.
1 ఏప్రిల్ 2001 = (2000 + 1.1.2001 to 01.4.2001)
2000 సంవత్సరాలు = 0 బేసి దినాలు
  Jan       Feb       March       April
   31   +    28   +      31     +      01 = 91
                                       = 13 వారాలు + 0 బేసి దినాలు
మొత్తం బేసి దినాలు = 0 +0 = 0 కాబట్టి
ఏప్రిల్ 1వ తేది - ఆదివారం
ఏప్రిల్ 2వ తేది - సోమవారం
ఏప్రిల్ 3వ తేది - మంగళవారం
ఏప్రిల్ 4వ తేది - బుధవారం

కాబట్టి జవాబు 4, 11, 18, 25 తేదీల్లో అవుతుంది.
Shortcut: 1-April-2001
1+0+1+0+6 = 8 బేసి దినాలు = 1 వారం + 1 బేసి దినం
* 1 బేసి దినం ఆదివారం - 1-April-2001
                      సోమవారం - 2-April-2001 
                      మంగళవారం - 3-April-2001
                      బుధవారం - 4-April-2001
     4+7 = 11, 11+7 = 18, 18+7 = 25
* 4th, 11th, 18th, 25th wednesdays.

5. జనవరి 1, 2007 సోమవారం అయితే జనవరి 1, 2008 ఏ వారం అవుతుంది?
జవాబు: మంగళవారం అవుతుంది.
ఈ ప్రశ్నలో 2007 సంవత్సరం సాధారణ సంవత్సరం. కాబట్టి అందులో 1 బేసి దినం ఉంటుంది. తర్వాత సంవత్సరానికి వెళ్లినప్పుడు 1 రోజు ముందుకు వెళుతుంది. అంటే 2008, జనవరి 1వ తేదీ మంగళవారం అవుతుంది.

6. ఈ రోజు సోమవారం 61 రోజుల తర్వాత ఏ వారం వస్తుంది?
జవాబు: శనివారం అవుతుంది. ఈ ప్రశ్నలో రోజులు మాత్రమే ఇచ్చారు. కాబట్టి 7 రోజుల తర్వాత మళ్లీ అదే వారం వస్తుంది. 63 రోజులకు అదే వారం అంటే సోమవారం వస్తుంది. కానీ లెక్కలో 61 రోజులు మాత్రమే ఇచ్చారు.
అంటే 2 రోజులు ముందుకు వస్తుంది. అప్పుడు అది శనివారం అవుతుంది.

 

7. x వారాలు, x రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాయి?
జవాబు: 8x అవుతుంది.
ఈ ప్రశ్నలో x వారాలు అంటే వారానికి 7 రోజులు కాబట్టి 7 తో గుణించాలి. అది 7x అవుతుంది. తర్వాత 'x' రోజులను కలపాలి. 7x + x = 8x రోజులు అవుతాయి.

 

8. 2007వ సంవత్సరం లాంటి క్యాలెండర్ మళ్లీ ఏ సంవత్సరంలో వస్తుంది?
జవాబు: 2018 అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన సంవత్సరం నుంచి బేసి దినాలను లెక్కించుకుంటుపోతే వాటి మొత్తం 7తో నిశ్శేషంగా భాగితమవుతుందో దాని తర్వాత సంవత్సరం వచ్చేది సమాధానం అవుతుంది.


                 

 మొత్తం బేసి దినాలు = 14 కాబట్టి తర్వాత సంవత్సరం అదే క్యాలెండర్ అంటే 2018 వస్తుంది.
 

9. కింది వాటిలో లీపు సంవత్సరం కానిది ఏది? 
       1.  200      2.400     3. 700      4. 600
 జవాబు: 700 అవుతుంది. ఈ ప్రశ్నలోని సంవత్సరాలను 400తో నిశ్శేషంగా భాగిస్తే అది లీపు సంవత్సరం. భాగించకపోతే అది లీపు సంవత్సరం కాదు. పైవాటిలో 700లను 400లతో నిశ్శేషంగా భాగించలేం. కాబట్టి అది లీపు సంవత్సరం కాదు.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌