• facebook
  • whatsapp
  • telegram

రసాయనశాస్త్రంలో ముఖ్యమైన సూత్రాలు, నియమాలు

ఆఫ్‌బౌ నియమం  (Aufbau Principle)

 ఆఫ్‌బౌ నియమం ప్రకారం భూస్థాయి లో ఉన్న పరమాణువులోని ఉపకర్పరాలను వాటి శక్తులు పెరిగే క్రమం లో ఎలెక్ట్రాన్లతో భర్తీ చేయాలి .

 ఎలక్ట్రాన్‌లు అందుబాటులో ఉన్న కనిష్ఠ శక్తి కలిగిన ఉపకర్పరాల్లో మొదట చేరతాయి. ఈ తక్కువ శక్తి ఉపకర్పరాలు ఎలక్ట్రాన్‌లతో పూర్తిగా నిండాకే ఎక్కువ శక్తి కలిగిన ఉపకర్పరాల్లోకి ప్రవేశిస్తాయి.

 ఉపకర్పరాల శక్తులు పెరిగే క్రమం, ఉపకర్పరాలను ఎలక్ట్రాన్‌లతో నింపే క్రమం:


1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d < 4p < 5s < 4d


ఉదా:

హుండ్‌ నియమం (Hund's Rule)

 ఒక ఉపకర్పరానికి చెందిన సమానశక్తి స్థాయులు కలిగిన ఆర్బిటాళ్లను డీజనరేట్‌ ఆర్బిటాళ్లు అంటారు.

 హుండ్‌ నియమం ప్రకారం ‘ఒక ఉపకర్పరానికి చెందిన సమానశక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్లను ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ ఆక్రమిస్తుంది. ఆ తర్వాతే ఎలక్ట్రాన్‌లు జతకూడతాయి. అంటే, డీజనరేట్‌ ఆర్బిటాళ్లలో రెండో ఎలక్ట్రాన్‌ చేరడానికి ముందే ప్రతిదానిలో ఒక్కో ఎలక్ట్రాన్‌ నిండి ఉండాలి.

ఉదాహరణ:

కార్బన్‌ (పరమాణు సంఖ = 6) ఎలక్ట్రాన్‌ విన్యాసం: 1s2 2s2 2p2

ఇందులో నాలుగు ఎలక్ట్రాన్లు 1s, 2s ఉపకర్పరాల్లోకి చేరతాయి. తర్వాతి రెండు ఎలక్ట్రాన్లు 2p - ఉపకర్పరంలోని వేర్వేరు ఆర్బిటాళ్లని ఆక్రమిస్తాయి.

 

పౌలీ వర్జన సూత్రం (Pauli Extension Principle)

 అనేక రకాల ఆర్బిటాళ్లలో భర్తీ చేసే ఎలక్ట్రాన్ల సంఖ్యను నియంత్రించటానికి పౌలీ అనే శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. దీన్నే పౌలీ వర్జన సూత్రం అంటారు. ఈ నియమం ప్రకారం ‘ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.’

 పౌలీ వర్జన సూత్రం ప్రకారం ‘ఒకే ఆర్బిటాల్‌లో గరిష్ఠంగా రెండు ఎలక్ట్రాన్‌లు ఉండొచ్చు. ఆ రెండు ఎలక్ట్రాన్‌లకు వ్యతిరేక స్పిన్‌ ఉండాలి.’’.

ఉదాహరణ: 

హీలియం (పరమాణు సంఖ్య = 2) ఎలక్ట్రాన్‌ విన్యాసం: 

  . ఈ రెండు ఎలక్ట్రాన్‌లను ­ తో సూచిస్తారు. అంటే ఒకే ఆర్బిటాల్‌లోని రెండు ఎలక్ట్రాన్‌ల స్పిన్‌లు వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 

అష్టక నియమం (Octet Rule)

 అష్టక నియమం ప్రకారం ‘పరమాణువులు ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం, స్వీకరించడం లేదా పంచుకోవడం ద్వారా బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లను పొందడానికి ప్రయత్నిస్తాయి.’

బాయిల్‌ నియమం(Boyle's Law)

 బాయిల్‌ నియమం ప్రకారం ‘స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న ఒక వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది.’

 బాయిల్‌ నియమాన్ని గణిత రూపంలో కింది విధంగా సూచిస్తారు. 

ఇక్కడ P = పీడనం, V = ఘనపరిమాణం, 

K = అనుపాత స్థిరాంకం

 బాయిల్‌ నియమం ప్రకారం 

 స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి కలిగిన వాయువు పీడనం దాని సాంద్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

నియమిత ద్రవ్యరాశి కలిగిన వాయువును సంపీడనానికి గురిచేస్తే అదే సంఖ్యలోని అణువులు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అంటే అధిక పీడనాల వద్ద వాయువులు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి.

చార్లెస్‌ నియమం (Charle's Law)

 చార్లెస్‌ నియమం ప్రకారం ‘స్థిర పీడనం వద్ద, నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం పరమఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.’

 స్థిర పీడనం వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి ఉన్న ఒక వాయువు 00C వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి 10C ఉష్ణోగ్రత పెరుగుదలకు  రెట్లు పెరుగుతుంది. 

 చార్లెస్‌ నియమాన్ని గణిత రూపంలో కింది విధంగా రాస్తారు.

ఇక్కడ V = ఘనపరిమాణం, T = పరమ ఉష్ణోగ్రత, K = అనుపాత స్థిరాంకం

 చార్లెస్‌ నియమం ప్రకారం

 స్థిరపీడనం వద్ద ఘనపరిమాణం, ఉష్ణోగ్రత రేఖలను ‘ఐసోబార్‌’లు అంటారు. 

 273.150C ఉష్ణోగ్రత వద్ద వాయువుల ఘనపరిమాణం శూన్యం.

 శూన్య ఘనపరిమాణాన్ని కలిగి ఉండే వాయువుల కనిష్ఠ ఉష్ణోగ్రత 273.150C. ఈ ఉష్ణోగ్రతను ‘పరమశూన్య ఉష్ణోగ్రత (zero temperature) అంటారు.

 పరమశూన్య ఉష్ణోగ్రతను 0K గా సూచిస్తారు. 

గేలూసాక్‌ నియమం

 గే-లూసాక్‌ నియమం ్బబ్చ్విల్యి((్చ‘్ఠ( ః్చ్ర్శ ప్రకారం ‘స్థిర ఘనపరిమాణం వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశిని కలిగిన వాయు పీడనం పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.’

దీన్ని గణిత రూపంలో కింది విధంగా సూచిస్తారు.

ఇక్కడ P = పీడనం, T = పరమ ఉష్ణోగ్రత,

K = స్థిరాంకం

 గేలూసాక్‌ నియమం ప్రకారం

 స్థిర ఘనపరిమాణం ఉన్న వాయువు పీడనం - ఉష్ణోగ్రత రేఖలను ‘ఐసోకోర్‌లు’ అంటారు

అవగాడ్రో నియమం (Avogadro's law)

 అవగాడ్రో నియమం ప్రకారం ‘ఒకే ఉష్ణోగ్రత, పీడనాల వద్ద సమాన ఘనపరిమాణాలున్న విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులు లేదా మోల్స్‌ను కలిగి ఉంటాయి.’

 ఒక వాయువు ఘనపరిమాణం దాని మోల్‌ సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది.

అవగాడ్రో నియమం ప్రకారం  

 ఒక మోల్‌ వాయువులో 6.022 ´ 1023 అణువులు ఉంటాయి.

 ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఏదైనా ఒక మోల్‌ వాయువు ఒకే ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది.

 ఏదైనా ఒక మోల్‌ వాయువు ప్రమాణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద 22.4 లి.్ఝ్నః1 ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది.

​​​​​​​

Posted Date : 26-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌