• facebook
  • whatsapp
  • telegram

సగటు

1. మొదటి 9 ప్రధాన సంఖ్యల సగటు ఎంత?
  ఎ) 9       బి) 11         

జవాబు: సి
 

2. 30, 50 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటు ఎంత?
   ఎ) 38      బి) 39      సి) 38.8      డి) 39.8

జవాబు: డి

3. 4 కి చెందిన మొదటి 5 గుణిజాల సగటు ఎంత?
   ఎ)       4 బి) 16       సి) 20       డి) 12

జవాబు: డి
 

4. 6, 34 మధ్య ఉన్న 5 కి చెందిన గుణిజాల సగటు ఎంత?
      ఎ) 30       బి) 24       సి) 20       డి) 18

జవాబు: సి

5. రెండు అంకెల సంఖ్యలను తారుమారు చేస్తే వాటి విలువలు మారవు. అయితే అలాంటి సంఖ్యల సగటు ఎంత?
     ఎ) 66      బి) 55      సి) 44      డి) 33

జవాబు: బి
 

6. 36 మంది విద్యార్థుల సగటు వయసు 14 ఏళ్లు. ఉపాధ్యాయుడి వయసు కలిపితే వారి సగటు వయసు 1 సంవత్సరం పెరుగుతుంది. అయితే ఉపాధ్యాయుడి వయసు ఎంత?
   ఎ) 31 సంవత్సరాలు     బి) 36 సంవత్సరాలు     సి) 51 సంవత్సరాలు      డి) 55 సంవత్సరాలు

జవాబు: సి

7. ఒక క్రికెట్ ఆటగాడు 10 మ్యాచ్‌లలో సగటున 32 పరుగులు చేశాడు. అతని సగటు 4 పరుగులు పెరగాలంటే తర్వాతి మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేయాలి?
  ఎ) 2        బి) 4        సి) 70        డి) 76

జవాబు: డి

 

8. 16a + 16b = 48 అయితే a, b ల సగటు ఎంత?
   ఎ) 3        బి) 2.5        సి) 1.5        డి) 5

జవాబు: సి

 

9. ఒక శూన్యేతర సంఖ్య వర్గాల సగటు ఆ సంఖ్యకు 5 రెట్లు అయితే ఆ సంఖ్య ఏది?
   ఎ) 9       బి) 17       సి) 29       డి) 295

జవాబు:

10. ఒక లైబ్రరీకి ప్రతి ఆదివారం 510 మంది పాఠకులు వస్తారు. మిగిలిన రోజుల్లో 240 మంది వస్తారు. ఒక నెలలో 30 రోజులు ఉండి, అది ఆదివారంతో ప్రారంభమైతే, ఆ నెలలో సగటు పాఠకులు ఎంతమంది?
      ఎ) 250       బి) 276       సి) 280       డి) 285


జవాబు: డి

11. ఒక గుంపులో 9 మంది ఉన్నారు. అందులో 8 మంది సగటు తిండి ఖర్చు రూ.12. తొమ్మిదో వ్యక్తి 9 మంది సగటు తిండి ఖర్చు కంటే రూ.8 ఎక్కువ ఖర్చు చేశాడు. అయితే అందరి తిండి ఖర్చు ఎంత?
      ఎ) రూ.104       బి) రూ.117       సి) రూ.128       డి) రూ.135
సాధన: 9 మంది సగటు తిండి ఖర్చు రూ. x అనుకుందాం
దత్తాంశం ప్రకారం 9x = 8 × 12 + 1 (x + 8)
9x = 96 + x + 8
9x - x = 104

9 మంది మొత్తం తిండి ఖర్చు 9x  = 9 × 13 = 117
జవాబు: బి

 

12. ఒక ఫ్యాక్టరీలోని అందరి సగటు జీతం రూ.8000. అందులో 7 గురు టెక్నీషియన్‌ల సగటు జీతం రూ.12,000. మిగిలినవారి సగటు జీతం రూ.6,000. అయితే ఫ్యాక్టరీలోని మొత్తం పనివారు ఎంతమంది?
    ఎ) 23        బి) 32        సి) 21        డి) 20


జవాబు: సి

 

13. వివాహ సమయంలో ఒక జంట సగటు వయసు 25 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వారికి 3 సంవత్సరాల బాబు ఉంటే, ప్రస్తుతం ఆ కుటుంబ సగటు వయసు ఎంత?
      ఎ) 19 సంవత్సరాలు      బి) 21 సంవత్సరాలు      సి) 23 సంవత్సరాలు      డి) 25 సంవత్సరాలు


జవాబు: బి

 

14. ఒక బోటులోని 10 మంది తెడ్డువేసే వారి సగటు బరువు 53 కేజీలు. అందులో ఒకరి బదులుగా ఒక కొత్త వ్యక్తిని తీసుకుంటే వారి సగటు బరువు 1.8 కేజీలు పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత?
    ఎ) 69 కేజీలు         బి) 70 కేజీలు         సి) 71 కేజీలు         డి) నిర్వచించలేం
సాధన: పెరిగిన మొత్తం బరువు = 10 × 1.8 = 18 కేజీలు
కొత్త వ్యక్తి బరువు = పాత సగటు + పెరిగిన మొత్తం బరువు
కొత్త వ్యక్తి బరువు = 53 + 18 = 71 కేజీలు
జవాబు: సి

 

15. 10 సంఖ్యల సరాసరి 7. ప్రతి సంఖ్యను 12 తో గుణిస్తే కొత్త సగటు ఎంత?
    ఎ) 7         బి) 19         సి) 82         డి) 84
సాధన: 10 సంఖ్యల సగటు = 7
కొత్త సగటు = 7 × 12 = 84
ప్రతి సంఖ్యను గుణించినా సగటును గుణించినా ఒకటే.
జవాబు: డి

16. 4 సంఖ్యల్లో మొదటి మూడు సంఖ్యల సరాసరి 18, చివరి మూడు సంఖ్యల సరాసరి 16. చివరి సంఖ్య 19 అయితే ఆ సంఖ్యల్లో మొదటిది ఏది?
1) 19          2) 20             3) 21            4) 25 
సాధన: మొదటి మూడు సంఖ్యల మొత్తం = 18 × 3 = 54 
చివరి మూడు సంఖ్యల మొత్తం = 16 × 3 = 48 
చివరి సంఖ్య = 19
2వ సంఖ్య, 3వ సంఖ్యల మొత్తం = 48 -19 = 29
మొదటి సంఖ్య = 54 - 29 = 25
సమాధానం: 4


17. వరుసలో ఉన్న 7 సహజ సంఖ్యల సగటు 28 అయితే ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది?
1) 31           2) 30           3) 32           4) 33 
సాధన: వరుసలో ఉన్న సంఖ్యలు n అయి, n బేసిసంఖ్య 
అయితే సగటు = n + 1/2 స్థానంలోని సంఖ్య అవుతుంది. 
సమస్యలో వరుసలో ఉన్న 7 సహజ సంఖ్యల సగటు 4వ సంఖ్య అవుతుంది.
సగటు లేదా నాలుగో సంఖ్య = 28
పెద్ద సంఖ్య = 28 + 3 = 31
సమాధానం: 1


18. 7 వరుస సహజ సంఖ్యల సగటు 30 అయితే ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది?
1) 39           2) 36           3) 33           4) 37 
సాధన: 7 వరుస సహజ సంఖ్యలు  = x, x + 1, x + 2, x + 3, x + 4, x + 5, x + 6 అనుకోండి
సగటు = 4వ పదం (n + 1/2 వ పదం) = x + 3
లెక్కప్రకారం  x + 3 = 30
x = 30 - 3 = 27 
x = 27 
పెద్ద సంఖ్య = x + 6 = 27 + 6 = 33 
సమాధానం: 3


19. 7 వరుస బేసి సంఖ్యల సగటు 27 అయితే ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది?
1) 31          2) 33           3) 35         4) 37 
సాధన: 7 వరుస బేసి సంఖ్యలు = x, x + 2, x + 4, x + 6, x + 8, x + 10, x + 12 అనుకోండి.
సగటు = 4వ పదం = x + 6 
లెక్క ప్రకారం  x + 6 = 27
x = 27 - 6 = 21 
పెద్ద సంఖ్య = x + 12 = 21 + 12 = 33 
సమాధానం: 2


20. 7 వరుస సరిసంఖ్యల సగటు 68 అయితే ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది?
1) 70          2) 72           3) 76              4) 74 

సాధన: 7 వరుస సరిసంఖ్యలు =  x, x + 2, x + 4, x + 6, x + 8, x + 10, x + 12 
సగటు = 4వ పదం  = x + 6 
లెక్క ప్రకారం x + 6 = 68
x = 68 - 6 = 62 
పెద్ద సంఖ్య = x + 12 = 62 + 12 = 74 
సమాధానం: 4


21. m సంఖ్యల సగటు  n2, n  సంఖ్యల సగటు m2 అయితే m + n సంఖ్యల సగటు ఎంత?
1) m − n        2) m + n          3) mn           4) m ÷ n 
సాధన: m సంఖ్యల సగటు = n2
= m సంఖ్యల మొత్తం =  mn2
= n సంఖ్యల సగటు = m2 
= n సంఖ్యల మొత్తం  = nm2 = m2n
m + n సంఖ్యల మొత్తం = mn2 + m2n = mn (m + n)
m + n సంఖ్యల సగటు =  రాశుల మొత్తం/రాశుల సంఖ్య
= mn(m + n)/m + n =  mn 
సమాధానం: 3


22. అయిదు సంఖ్యల మొత్తం 666. మొదటి రెండు సంఖ్యల సగటు 85, మూడో సంఖ్య 126 అయితే చివరి రెండు సంఖ్యల సగటు ఎంత?
1) 195          2) 185        3) 175           4) 178 
సాధన: అయిదు సంఖ్యల మొత్తం = 666
మొదటి రెండు సంఖ్యల సగటు = 85
మొదటి రెండు సంఖ్యల మొత్తం = 2 × 85 = 170 
మూడో సంఖ్య = 126
మొదటి మూడు సంఖ్యల మొత్తం  = 170 + 126 = 296 
చివరి రెండు సంఖ్యల మొత్తం = 666 - 296 = 370
చివరి రెండు సంఖ్యల సగటు = 370/2 = 185
సమాధానం: 2


23. 8 సంఖ్యల సగటు 20. మొదటి రెండు సంఖ్యల సగటు 15.1/2. తర్వాతి మూడు సంఖ్యల సగటు 21.1/3. 7వ, 8వ సంఖ్యలు వరుసగా 6వ సంఖ్య కంటే 4, 7 ఎక్కువ అయితే 8వ సంఖ్య ఎంత?
1) 25            2) 23             3) 22              4) 21
సాధన: 8 సంఖ్యల సగటు = 20
8 సంఖ్యల మొత్తం  = 8 × 20 = 160 

సమాధానం: 1


24. 100, 200 మధ్య ఉన్న 3 గుణిజాల సగటు ఎంత?
1) 140       2) 150         3) 160             4) 152 
సాధన: 100, 200 మధ్య ఉన్న 3 గుణిజాలు = 102, 105, 108.... 195, 198 
100, 200 మధ్య ఉన్న 3 గుణిజాల సగటు 102 + 198/2 = 300/2 = 150 
సమాధానం: 2


25. 11 సంఖ్యల సగటు 80, మొదటి 10 సంఖ్యల సగటు 79 అయితే 11వ సంఖ్య ఎంత?
1) 90            2) 100            3) 81           4) 89 
సాధన: 11వ సంఖ్య = 11 సంఖ్యల మొత్తం -  10 సంఖ్యల మొత్తం
= 11 × 80 - 10 × 79 
= 880 - 790 = 90 
సమాధానం: 1


26. ఒక తరగతిలోని 15 మంది బాలికల సగటు వయసు వారి ఉపాధ్యాయురాలితో కలుపుకుని 16 సంవత్సరాలు. ఆ ఉపాధ్యాయురాలిని మినహాయిస్తే వారి సగటు వయసు 1 సంవత్సరం తగ్గుతుంది. అయితే ఆ ఉపాధ్యాయురాలి వయసు ఎంత?
1) 33           2) 30           3) 32           4) 31 
సాధన: 15 మంది బాలికలు, వారి ఉపాధ్యాయురాలి సగటు వయసు = 16 సం.
15 మంది బాలికలు, వారి ఉపాధ్యాయురాలి వయసుల మొత్తం = సగటు వయసు  × వ్యక్తుల సంఖ్య
= 16 × 16 = 256 సం.
ఉపాధ్యాయురాలిని మినహాయిస్తే 15 మంది బాలికల సగటు వయసు = 16 - 1 = 15 సం.
15 మంది బాలికల వయసుల మొత్తం = 15 × 15 = 225 సం.
ఉపాధ్యాయురాలి వయసు  = 256 - 225 = 31 సం.
సమాధానం: 4


27. ఒక తరగతిలోని 20 మంది బాలుర సగటు వయసు 12 సంవత్సరాలు. ఆ తరగతిలో సగటు వయసు 7 సంవత్సరాలుగా ఉన్న ఐదుగురు బాలురు కొత్తగా ప్రవేశం పొందితే, ఆ తరగతిలోని బాలుర సగటు వయసు ఎంత?

సాధన: 20 మంది బాలుర సగటు వయసు = 12 సం.
20 మంది బాలుర వయసుల మొత్తం = 12 × 20 = 240 సం.
కొత్తగా చేరిన ఐదుగురు బాలుర సగటు వయసు = 7 సం.
కొత్తగా చేరిన ఐదుగురు బాలుర వయసుల మొత్తం = 7 × 5 = 35 సం.
తరగతిలోని మొత్తం బాలుర సగటు వయసు = వయసుల మొత్తం/ బాలుర సంఖ్య
= 240 + 35/20 + 5  =  275/25 =  = 11 సం.
సమాధానం: 1


28. ఒక తరగతిలో 28 మంది విద్యార్థులు ఉన్నారు. వారు గణితంలో పొందిన సగటు మార్కులు 50. ఈ తరగతి నుంచి 8 మంది విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్లిపోయారు. మిగిలిన విద్యార్థుల సగటు మార్కులు 4 పెరిగాయి. అయితే పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థుల సగటు మార్కులు ఎంత?
1) 40         2) 40.5         3) 39         4) 39.5 
సాధన: 28 మంది విద్యార్థుల సగటు మార్కులు = 50 28 మంది విద్యార్థుల మార్కుల మొత్తం = 50 × 28  = 1400 
పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు వెళ్లిపోగా మిగిలిన వారు = 28 - 8 = 20 
20 మంది విద్యార్థుల సగటు మార్కులు = 50 + 4 = 54 
20 మంది విద్యార్థుల మార్కుల మొత్తం = 54 × 20 = 1080 
పాఠశాల నుంచి వెళ్లిన 8 మంది విద్యార్థుల మొత్తం మార్కులు  = 1400 - 1080 = 320 
8 మంది విద్యార్థుల సగటు మార్కులు  320/8 = 40 మా.
సమాధానం: 1


29. 100 సంఖ్యల సగటు 45. ఈ సంఖ్యకు మరో 4 సంఖ్యలు కలిపాక వాటి సగటు 50. అయితే ఆ 4 సంఖ్యల సగటు ఎంత?
1) 185        2) 175        3) 190        4) 195 
సాధన: 100 సంఖ్యల సగటు = 45
100 సంఖ్యల మొత్తం   = 45 × 100 = 4500 
100 సంఖ్యలకు 4 సంఖ్యలు కలిపితే మొత్తం సంఖ్యలు = 100 + 4 = 104 
104 సంఖ్యల సగటు = 50
104 సంఖ్యల మొత్తం = 50 × 104 = 5200 
కొత్తగా చేరిన 4 సంఖ్యల మొత్తం  = 5200 - 4500 = 700 
4 సంఖ్యల సగటు = 700/4 = 175 
సమాధానం: 2


నమూనా ప్రశ్నలు

1. 5 వరుస సంఖ్యల సగటు n. తర్వాతి 2 సంఖ్యలను కలిపితే మొత్తం సంఖ్యల సగటు ఎంత?
జవాబు: 1 పెరుగుతుంది

 

2. 8 మంది వ్యక్తుల సగటు బరువు 65 కేజీలు. అందులో ఒక వ్యక్తిని తొలగించి మరొక కొత్త వ్యక్తిని తీసుకుంటే వారి సగటు బరువు 2.5 కేజీలు పెరిగింది. అయితే కొత్త వ్యక్తి బరువు ఎంత?
జవాబు: 85 కేజీలు

 

3. ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 30 మంది సగటు బరువు x కేజీలు. మిగిలిన వారి సగటు y కేజీలు అయితే అందరి సగటు బరువు ఎంత?
జవాబు:  

 

4. 8 మంది వ్యక్తుల సగటు వయసులో నుంచి 21, 23 సంవత్సరాల వయసున్న ఇద్దరు వ్యక్తులను తొలగించి ఇద్దరు కొత్తవారిని తీసుకున్నారు. ప్రస్తుతం వారి సగటు 2 సంవత్సరాలు పెరిగింది. అయితే కొత్తగా చేరినవారి సగటు వయసు ఎంత?
జవాబు: 30 సంవత్సరాలు

 

5. మొదటి 50 సహజ సంఖ్యల సగటు ఎంత?
జవాబు: 25.5

 

6. 12, 22, 32, 42, 52, 62, 72 ల సగటు ఎంత?
జవాబు: 20

Posted Date : 16-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌