• facebook
  • whatsapp
  • telegram

ప్రతిక్షేపణ పద్ధతి

గణిత ప్రక్రియలు విభాగంలో ప్రాథమిక గణిత పరిజ్ఞానంపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో +, -, ×, ÷, >, <, =, ≠ మొదలైన గుర్తులతో కూడిన ప్రశ్నలు వస్తాయి.

ఇందులో మొదట గుర్తులను మార్చాలి. తర్వాత BODMAS సూత్రం ఆధారంగా సూక్ష్మీకరించాలి.
 

1. + అంటే -అని, × అంటే ÷ అని, ÷ అంటే + అని, - అంటే × అని పిలిస్తే, కింద ఇచ్చిన ప్రశ్న విలువ ఎంత?
    252 × 9 - 5 + 32 ÷ 92 = ?
      ఎ) 95       బి) 168       సి) 192       డి) 200
వివరణ: మొదట గుర్తులు మార్చాలి.
252 ÷ 9 × 5 - 32 + 92 = ?
ఇప్పుడు BODMAS ఆధారంగా సూక్ష్మీకరించాలి.
 × 5 - 32 + 92 = ?
28 × 5 - 32 + 92 = ?
140 - 32 + 92 = 200
జవాబు: డి

మాదిరి ప్రశ్నలు

1. + అంటే × అని, × అంటే - అని, ÷ అంటే + అని, - అంటే ÷ అని పిలిస్తే,
     175 - 25 ÷ 5 + 20 × 3 + 10 = ?
      ఎ) 77       బి) 160       సి) 240       డి) 2370
వివరణ: 175 ÷ 25 + 5 × 20 - 3 × 10 = ?
              7 + 100 - 30 = 77
జవాబు: 

 

2. L అంటే + అని, M అంటే -అని, N అంటే × అని, P అంటే ÷ అని అర్థం. అప్పుడు 14 N 10 L 42 P 2 M 8 = ?
      ఎ) 216       బి) 248       సి) 153       డి) 251
వివరణ: 14 × 10 + 42 ÷ 2 - 8 = ?
        140 + 21 - 8 = 153
జవాబు: సి

 

3. ఒకవేళ $ అంటే + అని, # అంటే - అని, @ అంటే × అని, * అంటే ÷ అని అర్థం. అయితే,
     16 $ 4 @ 5 # 72 * 8 = ?
      ఎ) 25       బి) 27       సి) 29       డి) 36

వివరణ: 16 + 4 × 5 - 72 ÷ 8 = ?
        16 + 20 - 9 = 27
జవాబు: బి

 

4. ÷ అంటే + అని, -అంటే ÷ అని, × అంటే - అని, + అంటే × అని అర్థం. అయితే,
     
      ఎ) 0       బి) 8       సి) 12       డి) 16
వివరణ:

జవాబు: 
సూచన(ప్ర. 5-8 వరకు): ఒక రహస్య భాషలో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లను a, b, c, d, e, f, g, h, i, j లతో ప్రతిక్షేపించారు. ఆ భాషలో 10ని ba గా రాశారు.

 

5. (cd + ef) × bc = ?
      ఎ) 684       బి) 816       సి) 916       డి) 1564
వివరణ: a = 0; b = 1, c = 2, d = 3, e = 4, f = 5, g = 6, h = 7, i = 8, j = 9.
         (23 + 45) × 12
          68 × 12 = 816
జవాబు: బి

6. dc × f - (bf - d) × d = ?
       ఎ) abb       బి) abe        సి) bce        డి) bcf
వివరణ: 32 × 5 - (15 - 3) × 3 = ?
            160 - (12) × 3
            160 - 36 = 124 అంటే bce
జవాబు: సి

 

7. daf ÷ bf × d = ?
      ఎ) df       బి) cb       సి) be       డి) d
వివరణ: 105 ÷ 15 × 3 = ?
 × 3 = 21 అంటే cd
జవాబు: బి

8. bee + fg - (ca × h / be) = ?

      ఎ) bhc       బి) bic       సి) bib       డి) bja

             144 + 56 - (10)
= 144 + 46 = 190 అంటే bja
జవాబు: డి

9. 20 - 10 అంటే 200, 8 ÷ 4 అంటే 12, 6 × 2 అంటే 4 అయితే
100 - 10 × 1000 ÷ 1000 + 100 × 10 = ?
      ఎ) 0       బి) 20       సి) 1090       డి) 1900
వివరణ: 20 - 10 = 200 అంటే 20 × 10 = 200
8 ÷ 4 = 12 అంటే 8 + 4 = 12
6 × 2 = 4 అంటే 6 - 2 = 4
ఇక్కడ - అంటే ×
÷ అంటే +
× అంటే - అని అర్థం.
- అంటే ×, × అంటే - అయితే
÷ అంటే +, + అంటే ÷ అని అర్థం వస్తుంది.
100 × 10 - 1000 + 1000 ÷ 100 - 10 = ?
1000 - 1000 + 10 - 10 = 0
జవాబు: ఎ

10. > అంటే + అని, < అంటే - అని, + అంటే ÷ అని, - అంటే = అని, = అంటే < అని, × అంటే > అని పిలిస్తే, కిందివాటిలో ఏది సత్యం?
      ఎ) 3 + 2 > 4 = 9 + 3 < 2      బి) 3 > 2 > 4 = 18 + 3 < 1
      సి) 3 > 2 < 4 × 8 + 4 < 2      డి) 3 + 2 < 4 × 9 + 3 < 3
వివరణ: ఎ) 3 ÷ 2 + 4 < 9 ÷ 3 - 2
                 + 4 ≮ 3 - 2
బి) 3 + 2 + 4 < 18 ÷ 3 − 1
     9
≮ 6 − 1
సి) 3 + 2 − 4 > 8 ÷ 4 − 2
5 − 4 > 2 − 2
1 > 0
డి) 3 ÷ 2 − 4 > 9 ÷ 3 − 3
 − 4 > 3 − 3
          − 4 > 0
పై నాలుగింటిలో (సి) ఒక్కటే సరైంది.
జవాబు: సి

గుర్తులు, సంఖ్యల్లో పరస్పర మార్పిడి

ఇచ్చిన సమీకరణాల్లో -, ÷ గుర్తులు, 4, 8 అంకెలు పరస్పరం మార్పు చెందితే, ఏది సరైంది?
      ఎ) 6 − 8 ÷ 4 = −1       బి) 8 − 6 ÷ 4 = 1
      సి) 4 ÷ 8 − 2 = 6         డి) 4 − 8 ÷ 6 = 2

 

వివరణ:
       గుర్తులు: −, ÷
       అంకెలు: 4, 8
   
జవాబు: సి

మాదిరి ప్రశ్నలు 

1. +, × గుర్తులు, 4, 5 అంకెలు పరస్పరం బదిలీ అయితే, కిందివాటిలో ఏది సత్యం?
      ఎ) 5 × 4 + 20 = 40         బి) 5 × 4 + 20 = 85
      సి) 5 × 4 + 20 = 104       డి) 5 × 4 + 20 = 95
వివరణ:  x; 4  5
            5 × 4 + 20 = ?
            4 + 5 × 20 = 104
జవాబు: సి
* కింది ప్రశ్నల్లో ఏయే గుర్తులు పరస్పరం బదిలీ అయితే, ఆ సమీకరణాలు సత్యమవుతాయి?

 

2. 9 + 5 ÷ 4 × 3 - 6 = 12
      ఎ) +, ×       బి) ÷, ×       సి) ÷, -       డి) +, -
వివరణ:

జవాబు: సి

3. 12 ÷ 2 - 6 × 3 + 8 = 16
      ఎ) ÷, +       బి) - , +       సి) ×, +       డి) ÷, ×
వివరణ: బి) - , + 
        12 ÷ 2 + 6 × 3 - 8
        6 + 18 - 8 = 16
జవాబు: బి

 

4. 10 + 10 ÷ 10 - 10 × 10 = 10
      ఎ) +, -       బి) +, ÷       సి) +, ×       డి) ÷, +
వివరణ: సి) +, ×
        10 × 10 ÷ 10 - 10 + 10
        10 ×  - 10 + 10 = 10
జవాబు: సి

 

* కింది ప్రశ్నల్లో '=' గుర్తుకు ఇరువైపులా లేదా ఒకవైపు ఏ రెండు అంకెలను పరస్పరం మారిస్తే, '=' గుర్తుకు ఎడమ, కుడివైపు సమానం అవుతుంది.

5. 7 × 2 - 3 + 8 ÷ 4 = 5 + 6 × 2 - 24 ÷ 3
      ఎ) 2, 6       బి) 6, 5       సి) 3, 24       డి) 7, 6
వివరణ: డి) 7, 6
       6 × 2 - 3 + 8 ÷ 4 = 5 + 7 × 2 - 24 ÷ 3
                  12 - 3 + 2 = 5 + 14 - 8
                               11 = 11
                           LHS = RHS
జవాబు: డి

 

6. 15 + 3 × 4 - 8 ÷ 2 = 8 × 5 + 16 ÷ 2 - 1
      ఎ) 3, 5       బి) 15, 5       సి) 15, 16       డి) 3, 1
వివరణ: ఎ) 3, 5
        15 + 5 × 4 - 8 ÷ 2 = 8 × 3 + 16 ÷ 2 - 1
                   15 + 20 - 4 = 24 + 8 - 1
                                  31 = 31
                              LHS = RHS
జవాబు: 

7. 6 × 3 + 8 ÷ 2 - 1 = 9 - 8 ÷ 4 + 5 × 2
      ఎ) 3, 4       బి) 3, 5       సి) 6, 9       డి) 9, 5
వివరణ: డి) 9, 5
        6 × 3 + 8 ÷ 2 - 1 = 5 - 8 ÷ 4 + 9 × 2
                    18 + 4 - 1 = 5 - 2 + 18
                                21 = 21 
                             LHS = RHS
జవాబు: డి

 

8. 8 ÷ 2 × 5 - 11 + 9 = 6 × 2 - 5 + 4 ÷ 2
      ఎ) 5, 9       బి) 8, 5       సి) 9, 6       డి) 11, 5
వివరణ: సి) 9, 6
        8 ÷ 2 × 5 - 11 + 6 = 9 × 2 - 5 + 4 ÷ 2
              4 × 5 - 11 + 6 = 18 - 5 + 2
                          20 - 5 = 15
                                15 = 15
                            LHS = RHS
జవాబు: సి
* కింది ప్రశ్నల్లో ఏయే గుర్తులు, ఏయే అంకెలను మారిస్తే సమీకరణాలు సత్యమవుతాయో తెలపండి.

9. 4 × 6 - 2 = 14

      ఎ) ×  ÷ , 2  4       బి) -  ÷ , 2  6      సి) -  +, 2  6       డి) ×  +, 4  6
వివరణ: సి) - 
 +; 2  6
         4 × 2 + 6 = ? ⇒ 8 + 6 = 14
జవాబు: సి

10. (6 ÷ 2) × 3 = 0
      ఎ) ÷ 
 ×, 2  3       బి) ×  -, 2  6      సి) ÷  ×, 2  6       డి) ×  -, 2  3
వివరణ: డి) × 
 -, 2  3
      (6 ÷ 3) - 2 = ? ⇒  2 - 2 = 0
జవాబు: డి

11. ? 0 ? 3 ? 5 = 20 అనే సమీకరణంలో ఏ గుర్తులను ప్రతిక్షేపిస్తే అది సత్యమవుతుందో కనుక్కోండి.
      ఎ) ×, ×, ×       బి) - , +, ×       సి) ×, +, ×       డి) +, - , ×
వివరణ: బి) -, +, ×
       5 - 0 + 3 × 5 = ? ⇒  5 + 15 = 20
జవాబు: బి

రచయిత: మచ్చర్ల రమేష్

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌