• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంత వికిరణాలు - ఉపయోగాలు

1. సి.టి. స్కానింగ్‌లో ఉపయోగించే విద్యుదయస్కాంత వికిరణాలు ఏవి?

1) కాస్మిక్‌ కిరణాలు       2) X-కిరణాలు

3) పరారుణ కిరణాలు     4) పైవన్నీ

2. X-కిరణాలు ఏ విధంగా ప్రయాణిస్తాయి?

1)  రుజు మార్గంలో   2) వృత్తాకార మార్గంలో 

3్శ 1, 2       4) ఏదీకాదు

3. శ్రీ-కిరణాలకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?

ఎ) ఇవి విద్యుదయస్కాంత తరంగాలు

బి) ఇవి కాంతివేగంతో ప్రయాణిస్తాయి

1) ఎ మాత్రమే      2) బి మాత్రమే 

3) 1, 2      4) ఏదీకాదు

4. శ్రీ-కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త, సంవత్సరం .....

1) రాంట్‌జన్, 1895   2) రాంట్‌జన్, 1905

3) హెర్షల్, 1895     4) రిట్టర్, 1905

5. శ్రీ-కిరణాల ఆవేశం .....

1్శ ధనావేశం           2్శ రుణావేశం 

3్శ ధనావేశం, రుణావేశం  4్శ తటస్థం

6. కిందివాటిలో శ్రీ-కిరణాల తరంగదైర్ఘ్యం ఎంత?

1) 0.01nm - 10nm 

2) 10.1 - 100 ఆంగ్‌స్ట్రాం

3) 0.01 - 0.001nm         4) 1, 2

7. శ్రీ-కిరణాలకు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) శ్రీ-కిరణాలు జింక్‌ సల్ఫైడ్‌ ్బ్ట్ర-ళ్శీ పై పడినప్పుడు ప్రతిదీప్తిని ్బ÷ః్న్య౯’(’-‘’్శ ప్రదర్శిస్తాయి.

బి) ఇవి జీవకణాలపై తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో పడితే హానికరం.

1్శ ఎ మాత్రమే       2్శ బి మాత్రమే  

3్శ 1, 2     4్శ ఏదీకాదు

8. కఠిన X- కిరణాలకు .....

1) అధిక శక్తి ఉంటుంది 

2) అధిక తరంగదైర్ఘ్యం ఉంటుంది

3) అధిక పౌనఃపున్యం ఉంటుంది 

4) 1, 2

9. కింది ఏ విద్యుదయస్కాంత తరంగాలు అణువులు భ్రమణ - కంపనాల స్థితుల్లో మార్పును కలిగిస్తాయి?

1) రేడియో తరంగాలు 

2) పరారుణ కిరణాలు 

3) మైక్రో తరంగాలు    4) టీవీ తరంగాలు

10. పరారుణ కిరణాల తరంగదైర్ఘ్యం ....

1) 0.7nm - 1000nm 

2) 700nm - 1nm  

3) 400nm - 800nm    4) 1, 2

11. పరారుణ కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) విలియం హెర్షల్‌  2) రూథర్‌ఫర్డ్‌

3) నీల్స్‌ - బోర్‌    4) జె.రిట్టర్‌

12. కిందివాటిలో సరైన ప్రవచనం ఏది?

1) దృగ్గోచర కాంతి కంటే పరారుణ కిరణాల తరంగదైర్ఘ్యం ఎక్కువ

2) దృగ్గోచర కాంతి కంటే పరారుణ కిరణాల తరంగదైర్ఘ్యం తక్కువ

3) దృగ్గోచర కాంతి కంటే పరారుణ కిరణాల పౌనఃపున్యం ఎక్కువ

4) దృగ్గోచర కాంతి కంటే పరారుణ కిరణాల శక్తి ఎక్కువ

13. సూర్యుడి నుంచి భూమి పైకి వచ్చే శక్తి ఏ రూపంలో ఉంటుంది?

1) పరారుణ కిరణాలు   2) దృగ్గోచర కాంతి        

3) 1, 2          4) గామా కిరణాలు

14. కిందివాటిలో దేన్ని ఉష్ణవికిరణాలు అని పిలుస్తారు?

1) X - కిరణాలు   2) గామా - కిరణాలు

3) పరారుణ కిరణాలు   4) మైక్రో తరంగాలు

15. పరారుణ కిరణాలను ఉపయోగించి, వస్తువు ఉష్ణోగ్రతను దూరం నుంచి నిర్ణయించే పద్ధతిని ఏమంటారు?

1) రేడియో థెరపీ  2) ఫిజియోథెరపీ 

3) థర్మోగ్రఫీ      4) ఏదీకాదు

16. కిందివాటిలో సరైంది ఏది?

i) రాతి ఉప్పు పట్టకాన్ని ఉపయోగించి పరారుణ కిరణాలను పరిశీలించవచ్చు.

ii) రాతి ఉప్పు పట్టకం పరారుణ కిరణాలను శోషించుకోవు.

1) i మాత్రమే      2) ii మాత్రమే 

3) 1, 2      4) ఏదీకాదు

17. యానకంతో నిమిత్తం లేకుండా ప్రయాణించగలిగే తరంగాలు ఏవి?

1) విద్యుదయస్కాంత తరంగాలు         

2) కాంతి తరంగాలు  3) లేజర్‌ కిరణాలు

4) పైవన్నీ

18. కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాలు కానివి ఏవి?

i) పరారుణ కిరణాలు    ii) X - కిరణాలు 

iii) దృగ్గోచర కాంతి     iv) ఆల్ఫాÄ - కిరణాలు 

v) బీటా - కిరణాలు     vi) గామా - కిరణాలు 

1) i, iv, v      2) iv, v     3) i, ii, iii, iv    4) iv, v

19. ఏవైనా రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని ఏమంటారు?

1్శ ఆవర్తన కాలం   2్శ పౌనఃపున్యం 

3్శ తరంగదైర్ఘ్యం    4్శ కంపన పరిమితి

20. కిందివాటిలో తరంగదైర్ఘ్యానికి ప్రమాణాలు ఏవి?

1) ఆంగ్‌స్ట్రాం (A)  2) నానోమీటర్‌ (nm)

3) సైకిల్‌/ సెకండ్‌   4) 1, 2

21. కింది అంశాలను జతపరచండి.

జాబితా - A     జాబితా - B

a) 1 ఆంగ్‌స్ట్రాం     i) 10-6 m

b) 1 నానోమీటర్‌     ii) 10-10m

c) 1 మైక్రోమీటర్‌     iii) 10-12m    

1) a-i, b-ii, c-iii     2) a-ii, b-i, c-iii

3) a-iii, b-ii, c-i     4) a-ii, b-iii, c-i 

22. కిందివాటిలో పౌనఃపున్యానికి ప్రమాణాలేవి?

1) సైకిల్‌/ సెకండ్‌        2) హెర్ట్జ్‌ 

3)  1, 2         4) మిల్లీమీటర్‌

23. కింది వాటిలో తరంగదైర్ఘ్యం  పౌనఃపున్యం మధ్య ఉన్న సరైన సంబంధం?

24. విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించే వేగం ఎంత?

1) 3 x 108 m/s     2) 3 x 1010 m/s

3) 1, 2     4) 3 x 1016 m/s

25. కిందివాటిలో శక్తి ్బన్శి, తరంగదైర్ఘ్యానికి మధ్య ఉన్న సరైన సంబంధం?

26. తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

1) న్యూటన్‌     2) హైగెన్స్‌ 

3) మాక్స్‌ ఫ్లాంక్‌     4) మాక్స్‌ వెల్‌

27. కిందివాటిలో లేజర్‌ కిరణాల లక్షణాలు ఏవి?

1) ఏకవర్ణీయత       2) దిశనీయత

3) సంబద్ధత         4) పైవన్నీ

28. కిందివాటిలో ప్రాథమిక రంగు కానిది?

1) ఎరుపు   2) నీలం   3) ఆకుపచ్చ   4) పసుపు

29. ఒక తెల్లటి కాంతిపుంజం గాజుపట్టకం ద్వారా చొచ్చుకుని వెళ్లినప్పుడు అది ఎన్ని రంగులుగా విడిపోతుంది? 

1) 3    2) 5    3) 7    4) 9

30. జుఖితీబ్త్రివీళి  అనే ఏడు రంగుల్లో ఎక్కువ తరంగదైర్ఘ్యం దేనికి ఉంటుంది?

1) ఎరుపు     2) నీలం 

3) ఆకుపచ్చ      4) ఊదారంగు

31. VIBGYOR అనే ఏడు రంగుల్లో ఎక్కువ శక్తి ఉన్న రంగు ఏది?

1) నీలం     2్శ ఎరుపు 

3్శ ఊదారంగు     4్శ ఆరెంజ్‌

32. VIBGYOR రంగుల్లో మానవుడికి మానసిక ఉల్లాసం కలిగించే రంగు ఏది?

1్శ ఎరుపు     2్శ ఆకుపచ్చ 

3్శ ఇండిగో         4్శ పసుపు

33. సాధారణ మానవుడి కన్ను ప్రతిస్పందించే కాంతి తరంగదైర్ఘ్యం ఎంత? 

1) 200nm - 400nm

2) 100nm - 200nm

3) 380nm - 750nm

4) 790nm - 990nm

34. అతినీలలోహిత కిరణాల తరంగదైర్ఘ్య అవధి ఎంత?

1) 10nm - 400nm 

2) 400nm - 800nm 

3) 600nm - 800nm 

4) 400nm - 1000nm 

35. నీటిలో లేదా పాలలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేయడానికి ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు?

1) దృగ్గోచర కాంతి 

2) అతినీలలోహిత కిరణాలు

3) రేడియో తరంగాలు 

4) పైవన్నీ

36. కరెన్సీ నోట్లు అసలైనవో, కావో తెలుసుకునేందుకు కింది వేటిని ఉపయోగిస్తారు?

1్శ అతినీలలోహిత కిరణాలు 

2్శ మైక్రో తరంగాలు

3్శ గామా కిరణాలు 

4్శ రేడియో తరంగాలు

37. సూర్యుడి నుంచి విడుదలయ్యే  హానికరమైన అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రానీయకుండా రక్షించేది ఏది?

1) ఓజోన్‌ పొర        2) నీటి ఆవిరి 

3) కార్బన్‌ డైఆక్సైడ్‌    40 పైవన్నీ

38. కింది ఏ రంగుకు పౌనఃపున్యం, శక్తి విలువలు చాలా తక్కువగా ఉంటాయి?

1) ఊదారంగు     2) ఎరుపురంగు

3) నీలిరంగు         4) పసుపురంగు

39. కిందివాటిలో సరికానిది ఏది?

1) ఆకుపచ్చ + నీలం = ముదురు నీలం

2) నీలం + ఎరుపు = ముదురు ఎరుపు

3) ఎరుపు + ఆకుపచ్చ = పసుపు

4) ఎరుపు + నీలం = ముదురు నీలం

40. సమపాళ్లలో నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగులను కలిపినప్పుడు ఏర్పడే రంగు?

1) పసుపు         2) ఆరెంజ్‌     

3) తెలుపు         4) ఊదారంగు

సమాధానాలు

1 - 2   2 - 1   3 - 3   4 - 1  5 - 4   6 - 4   7 - 3   8 - 4   9 - 2   10 - 4   11 - 1  12 - 1  13 - 3  14 - 3  15 - 3   16 - 3  17 - 4  18 - 4   19 - 3   20 - 4   21 - 4     22 - 3    23 - 2   24 - 3   25 - 1   26 - 2   27 - 4   28 - 4   29 - 3   30 - 1   31 - 3   32 - 2   33 - 3   34 - 1   35 - 2   36 - 1  37 - 1   38 - 2   39 - 4   40 - 3  

మరికొన్ని...

1. మైక్రో తరంగాల తరంగదైర్ఘ్య అవధి ఎంత?

1) 1nm - 10nm    2) 1nm - 1nm     

3) 1nm - 10nm      4) 10nm - 10nm 

2. రిమోట్‌ సెన్సింగ్‌లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?

1) రేడియో తరంగాలు   2) మైక్రో తరంగాలు

3) X - కిరణాలు   4) దృగ్గోచర కాంతి

3. వస్తువుల మధ్య దూరాలను కొలిచే ‘టెలిమెట్రి’లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?

1) మైక్రో తరంగాలు   2) గామా - కిరణాలు 

3) రేడియో తరంగాలు   4) X - కిరణాలు

4. ప్రతిపాదన (A): మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఆహార పదార్థాలను వేడి చేసేందుకు లోహపు పాత్రలను ఉపయోగించరు. కారణం (R): లోహపు పాత్రలు మైక్రోతరంగాలను పరావర్తనం చెందిస్తాయి.

1) A సత్యం, కానీ R తప్పు 

2) A తప్పు, కానీ R సత్యం

3) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ

4) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ కాదు

5. స్థిర, మొబైల్‌ కమ్యూనికేషన్‌లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?

1) మైక్రో తరంగాలు 

2) రేడియో తరంగాలు

3) X - తరంగాలు   4) గామా కిరణాలు

6. X - కిరణాలను ఉపయోగించి, రోగ నిర్ధారణ చేయడాన్ని ఏమంటారు?

1) రేడియోథెరపి    2) రేడియోగ్రఫీ

3) కీమోథెరపి     4) ఏదీకాదు

7. గామా - కిరణాల తరంగదైర్ఘ్య అవధి ఎంత?

1) 0.01nm కంటే తక్కువ 

2) 400nm 800nm

3) 200nm 400nm  

4) 10nm  100nm

8. కిందివాటిలో చొచ్చుకుని వెళ్లగల సామర్థ్యం  దేనికి అత్యధికంగా ఉంటుంది?

1) రేడియో తరంగాలు   2) మైక్రో తరంగాలు

3) పరారుణ కిరణాలు  4) గామా-కిరణాలు

9. విమానాశ్రయ భద్రతా స్కానర్‌లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?

1) గామా - కిరణాలు   2) X - కిరణాలు

3) మైక్రో తరంగాలు   4) రేడియో తరంగాలు

10. మైక్రోవేవ్‌ ఓవెన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

1) హెన్రీ బెకరల్‌    2) పెర్రీ స్పెన్సర్‌

3) డబ్ల్యూ.రాంట్‌జన్‌  4) నీల్స్‌ బోర్‌

11. X - కిరణాల ఉత్పత్తిలో ఉపయోగించే ప్రాథమిక కణం ఏది?

1) ప్రోటాన్‌     2) ఎలక్ట్రాన్‌ 

3) న్యూట్రాన్‌         4) మీసాన్‌

సమాధానాలు

1 - 2   2 - 2   3 - 1   4 - 3   5 - 2   6 - 2   7 - 1    8 - 4   9 - 2   10 - 2   11 - 2

Posted Date : 17-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌